AADIVAVRAM - Others

పాలిఇథిలిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం పాలిఇథిలిన్ లేకుండా రోజువారీ జీవితాన్ని ఊహించటమే కష్టం. కిరాణా దుకాణంలో సరుకులు పెట్టే ఇచ్చే సంచీ, బట్టలు ఉతికేందుకు బక్కెట్లు, పాల క్యాను లాంటి ఎన్నో వస్తువులు పాలిఇథిలిన్‌తో తయారైనవే. ప్రపంచవ్యాప్తంగా పాలిఇథిలిన్ ఇప్పుడు 32 వేల కోట్ల పరిశ్రమ అయితే 1954లో అనుకోని రీతిలో దీని ఆవిష్కరణ జరిగింది.
అప్పట్లో కైసర్ వెల్‌హ్మి ఇన్‌స్టిట్యూట్ (తరువాత దీని పేరును మాక్స్‌ప్లాంక్ ఇనిస్టిట్యూట్‌గా మార్చారు)లో పని చేస్తున్న జర్మన్ రసాయనవేత్త కార్ల్ జైగ్లర్ - ఇథిలిన్‌తో చర్య జరిపే ఫ్రీరాడికల్ అణువులను విశే్లషిస్తున్న సమయంలో ఇది జరిగింది. ప్రయోగం నిర్వహిస్తున్న ఛాంబర్‌లో కొంత నికిల్ మిగిలిపోయింది. ఫలితంగా అంతకు ముందు తెలియని చాలా పొడవైన కర్బన పరమాణువుల గొలుసు ఒకటి ఏర్పడింది. దీంతో ముగ్ధుడైన జైగ్లర్ ఇతర లోహాలతో ఇదే రకమైన ప్రయోగాల్ని నిర్వహించాడు. వాటిలో అల్యూమినియం అత్యుత్తమమైన ఫలితాలను ఇవ్వడం గుర్తించాడు.
ఆ ప్లాస్టిక్ దృఢంగా ఉండటమే కాకుండా వొంచేందుకు వీలుగా ఉండటాన్ని గమనించాడు. జైగ్లర్ ఆవిష్కరణకు విశేష ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ చర్యలన్నీ సాధారణ ఉష్ణోగ్రతల, వాతావరణ పీడనం వద్దనే సాధ్యపడ్డాయి. ఇతర పద్ధతుల్లో అయితే తీవ్రమైన ఉష్ణోగ్రతలు, పీడన అవసరం. ఆ తరువాతి కాలంలో ఇటాలియన్ శాస్తవ్రేత్త గియులోనాట్టా జైగ్లర్ విధానాన్ని మరింత మెరుగుపరిచి పాలిప్రొపలైన్ అనే పదార్థాన్ని తయారుచేశాడు. ఇది ఆహార పదార్థాల కంటైనర్లు, తివాచీలను తయారుచేసేందుకు ఉపయోగపడే నారను ఉత్పత్తి చేయటానికి వస్తుంది.
ఈ ఆవిష్కరణలకు గాను జైగ్లర్- నాట్టాకు 1963లో ఉమ్మడిగా రసాయనశాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి ఇచ్చాడు. ప్రస్తుతం సహజంగా కుళ్లిపోయే శక్తిలేని కారణంగా ప్లాస్టిక్ గూర్చి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా కుళ్లి నశించిపోగల ప్లాస్టిక్‌ను రూపొందించేందుకు ప్రయోగాలు జరుగుతున్నాయి.

-బి.మాన్‌సింగ్ నాయక్