Others

ర్యాంప్‌పై బామ్మలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్యాషన్ షోలలో అందమైన అమ్మాయిలు క్యాట్‌వాక్ చేస్తుంటారు. కాని ఇటీవల లండన్‌లో జరిగిన ఫ్యాషన్ వీక్‌లో ఐదు పదులు దాటిన బామ్మలు క్యాట్‌వాక్ చేసి అదరగొట్టారు. ఆమె వయసు 73 సంవత్సరాలు. కాని క్యాట్ వాక్‌లో వయ్యారాలు ఒలకబోసింది. ఇటలీకి చెందిన ఈ బెండెట్టా బార్జిని మాజీ మోడల్. నలుగురు పిల్లలకు తల్లి. వయసు మీద పడినప్పటికీ చెక్కుచెదరని అందంతో ఆహుతులను అలరించింది. ఫ్యాషన్ డిజైనర్ సైమన్ రోచా రూపొందించిన దుస్తులను ధరించి బెండెట్టా బార్జిని (73) ర్యాంప్ మీద నడిచారు. అలాగే జాన్ వార్డ్ డి వెల్లెన్యూ 69 సంవత్సరాల వృద్ధ మోడల్. అరవై ఏళ్లు దాటిన తరువాత ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఈ వృద్ధ సుందరి అంతకు ముందు స్కూలు టీచర్‌గా పనిచేసేది. ఇద్దరు పిల్లలు. సోపీ విల్సన్ (53) కూడా ర్యాంప్‌పై అందాలతో కనువిందు చేసింది.

చిత్రాలు.. జాన్ వార్డ్ డి వెల్లెన్యూ (69), సోపీ విల్సన్ (53), బెండెట్టా బార్జిని (73)