AADIVAVRAM - Others

రాజ్యం విలువ (కథాసాగరం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీరు సాన్నిథ్యంలో పదేళ్లు గడిపి జ్ఞానోదయం పొందిన ఇబ్రహీం తన దేశమయిన బొఖారో తిరిగి వెళ్లాడు. కానీ తన నగరానికి వెళ్లలేదు. రాజ్య భారాన్ని నెత్తికెత్తుకోలేదు. దేశంలోనే ఉంటూ అజ్ఞాత జీవితం గడిపాడు. నిరుపేదగా జీవించాడు.
ఒకరోజు టెగ్రెస్ నదీ తీరంలో కూచుని సూదీ దారంతో చినిగిపోయిన తన బట్టల్ని కుట్టుకుంటున్నాడు. మాసిన గడ్డంతో చినిగిన బట్టల్తో ఆయన ఆ దేశానికి చక్రవర్తి అని ఎవరూ గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు.
ఆయన మంత్రి ఆ ప్రాంతపు అడవిలో వేటాడి అటువేపుగా వచ్చాడు. సూదీ దారంతో బట్టలు కుట్టుకుంటున్న చక్రవర్తిని చూశాడు. ఎవడో బిచ్చగాడనుకున్నాడు. తేరిపార చూశాడు. అప్పటికి చక్రవర్తిని చూసి పనె్నండేళ్లు గడిచిపోయాయి. కానీ రాజుగారి ముఖ కవళికల్ని బట్టి సందేహం కలిగింది.
‘ఎవరు నువ్వు? ఈ దేశ చక్రవర్తి ఐన ఇబ్రహీంవి కాదు కదా!’ అన్నాడు సందేహంగా. చక్రవర్తి ‘అవును. నేను ఇబ్రహీంను’ అన్నాడు. మంత్రి వెంటనే గుర్రం దిగి రాజు పాదాలపైబడి నమస్కరించాడు. ‘రాజా! మీరు రాజ్యాన్ని వదిలి పనె్నండు సంవత్సరాలు గడిచాయి. మీ అజ్ఞానుసారమే పరిపాలన చేస్తున్నా. మీ కొడుకుని అన్ని కళల్లో ఆరితేరిన వాడుగా తీర్చిదిద్దాను. మీరు వచ్చి రాజ్యభారాన్ని స్వీకరించండి’ అన్నాడు.
రాజు ‘నీ ధర్మానికి ధన్యవాదాలు. కానీ నేను రాను’ అన్నాడు. మంత్రి ఎందుకున్నాడు. రాజు తన చేతిలోని సూదిని నదిలో విసిరి ‘ఆ సూదిని తిరిగి తేగలవా?’ అన్నాడు. మంత్రి ‘నేను ఆ సూదిని తేలేను. కానీ అటువంటివి వెయ్యి తెప్పించగలను’ అన్నాడు. ‘కానీ నాకు అదే కావాలి. దాన్ని తెప్పించే మార్గమేమయినా ఉందా?’ అన్నాడు రాజు. మంత్రి వౌనం వహించాడు.
రాజు నీటిపై నిర్మలంగా దృష్టి నిలిపాడు. ఒక చిన్ని చేప నోటితో ఆ సూదిని కరచుకుని వచ్చి రాజుగారి పాదాల దగ్గర ఆ సూదిని వదిలి వెళ్లిపోయింది.
మంత్రి ఆ సంఘటనని చూసి ఆశ్చర్యపోయాడు.
‘నేను ఈ రాజ్యంలో ఏం చెయ్యాలి? ఈ రాజ్యానే్న కాదు, ఇట్లాంటి రాజ్యాలెన్నో వున్న ఈ భూమండలానే్న కాదు, విశ్వంలోని అనంత ప్రపంచాలకు అధిపతి అయిన దేవుని సేవకుణ్ణి నేను. ఆయన ఆజ్ఞానుసారమే అన్నీ ఉనికిలో ఉన్నాయి. ఆయన దయ వల్ల నేను అపరిమితుణ్ణయ్యాను. ఆయన లాగే అనంతుణ్ణయ్యాను. నువ్వేమో తిరిగి వచ్చి రాజ్యాన్ని పాలించమంటున్నావు’
మంత్రి నోట మాట రాకుండా రాజు మాటల్ని వింటున్నాడు.
‘నేను వెనకటి వ్యక్తిని కాను. నేను ఊహకందని ప్రపంచాల్ని అనుభవానికి తెచ్చుకున్నాను. నువ్వు సూదిని తీసుకురాలేనట్లే ఆ వెనకటి రాజునూ తీసుకు రాలేవు. దయచేసి వెళ్లు. నువ్వు, నా కొడుకు కలిసి మీరు రాజ్యాన్ని ఏమి చెయ్యాలో అది చేయండి. నాకు ఆ రాజ్య కాంక్ష లేదు. దైవ రాజ్య కాంక్షల్లో వున్నాను. ప్రాపంచికమయిన విషయాల పట్ల నాకు ఆసక్తి లేదు. దయచేసి వెళ్లు’ అన్నాడు.
ఆ మాటలకు చలించిపోయిన మంత్రి రాజు పాదాలకు నమస్కరించి నిష్క్రమించాడు. *

- సౌభాగ్య, 9848157909