AADIVAVRAM - Others

వారాల పేర్లు ఎలా వచ్చాయి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలోనూ, అన్ని భాషలలోనూ, 7 రోజులు ఒక వారంగానూ, 30 రోజులు ఒక నెలగానూ, 12 నెలలు ఒక సంవత్సరంగానూ పరిగణింపబడుతూ ఉండగా వారంలోని రోజుల పేర్లు ఒక క్రమంలో - ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని వారాలుగానూ డSunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday గానూ ఎలా ఏర్పడినాయో సామాన్య విద్యావంతులకే కాక, అత్యధిక శాతం వారికి సైతం తెలీదు. తెలుసు అని ఎవరైనా చెప్పగలిగితే - వారు తప్పనిసరిగా ‘ఖగోళ విజ్ఞానం’లో లోతుగా అధ్యయనం చేసిన వారై ఉండాలన్నమాట.
ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని - అనే ఏడు రోజులకు ఆ పేర్లు? ఎన్నటికీ మారని ఆ వరుస క్రమం ఎలా వచ్చాయి?
‘్భమి’తో సహా మరో ఆరు గ్రహాలైన చంద్ర, బుధ, శుక్ర, కుజ, గురు, శనులు - ‘సూర్యుని’ చుట్టూ ఆ వరుసలో వేర్వేరు దూరాలలో ఉండి పరిభ్రమిస్తూ రోజులోని 24 గంటలలో ఒక్కొక్క గ్రహమూ ఒక గంటసేపు తన కాంతిని ప్రసరిస్తూ ఉంటుంది కాబట్టి. కాని ‘్భమి’ కేంద్రంగా మనం ఆ గ్రహాలను నేరుగా ఆకాశంలో సందర్శిస్తున్నపుడు చంద్ర, బుధ, శుక్ర గ్రహాలు చిన్నవిగా ఒక వర్గంగానూ, కుజ, గురు, శని గ్రహాలు పెద్దవిగా ఒక వర్గంగా ఏర్పడటం వల్ల ఈ గ్రహాల క్రమం - చంద్ర, బుధ, శుక్ర, రవి, కుజ, గురు, శనిగా ఉంటుంది. ఈ క్రమానే్న మన పెద్దలు శనితో మొదలుపెట్టి చంద్రునితో ముగిస్తూ-
మంద, అమరౌజ్య, భూపుత్ర, సూర్య, శుక్ర, ఇందుజ, ఇందు అనే క్రమంలో సూర్యోదయం నుండి 24 గంటలలో మూడుసార్లు గడవగా మర్నాటి సూర్యోదయానికి ముందుగా మరో మూడు గ్రహాల హోరలు (గంటలు) జరిగి నాల్గవ హోర మర్నాటి ఉదయాన ప్రారంభమై ఆ వారానికి పేరు ఏర్పడుతుంది.
ఉదాహరణకు ‘సూర్య’ హోరతో ప్రారంభమైన రోజు ‘ఆదివారం’ కాగా ఆనాడు సూర్య, శుక్ర, ఇందుజ, ఇందు, మంద, అమరౌజ్య, భూపుత్ర - అనే ఏడు గ్రహాల క్రమం మూడుసార్లు గడవగా తిరిగి సూర్య, శుక్ర, ఇందుజ అనే హోరలు గడిస్తే 24 గంటలు పూర్తయి మర్నాటి సూర్యోదయ సమయాన ‘ఇందు’ హోర ఏర్పడుతుంది కాబట్టి ఆ రోజు ‘ఇందువారం’ లేక ‘సోమవారం’ అవుతుంది. అలాగే ‘ఇందు’ హోరలో ప్రారంభమైన సోమవారంనాడు - ఇందు, మంద, అమరౌజ్య, భూపుత్ర, సూర్య, శుక్ర, ఇందుజ అనే 7 హోరల క్రమం మూడుసార్లు గడిచి తర్వాత ఇందూ, మంద, అమరౌజ్య అనే మూడు హోరలు కూడా గడిచి తర్వాత హోరయైన భూపుత్ర హోర ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ మర్నాడు ‘్భపుత్ర’ వారం లేక మంగళవారం అవుతుంది.
అలాగే ఏ రోజున సూర్యోదయాన అయినా ఆ రోజు పేరుగల హోర ఉంటుంది. కాబట్టి మర్నాటి సూర్యోదయానికి ఏడు హోరల క్రమం మూడుసార్లు జరిగి మరో మూడు హోరలు కూడా గడిచి 24 గంటలు పూర్తికాగా మర్నాటి పేరుగల హోర ప్రారంభమవుతుందన్న మాట.
పైన ఏర్పడిన భూపుత్ర వారం లేక మంగళవారం సూర్యోదయ కాలం నుండి 24 హోరలు గడువగా మర్నాటి సూర్యోదయానికి ముందు భూపుత్ర, సూర్య, శుక్ర అనే మూడు హోరలు గడువగా ‘ఇందుజ హోర’ లేక ‘బుధహోర’ ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ రోజు బుధవారం అవుతుంది. అదే రీతిగా గురు, శుక్ర, శని, ఆదివారాలు ఏర్పడటం గమనించగల్గుతారు.

-సన్నిధానం యజ్ఞనారాయణమూర్తి