Others

కలియుగ గజేంద్రమోక్షం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడుగులో మంచినీళ్లు త్రాగడానికి దిగిన గజేంద్రుణ్ణి పట్టుకున్న మకరి- పాపం! ఆ గజేంద్రుణ్ని ముప్పుప్పలు పెట్టింది. చివరికి సిరికిన్ చెప్పకుండా విష్ణుమూర్తి దిగివచ్చాడు. అలాగ కలియుగంలో ఒక చిన్న సైజు గజేంద్రుణ్ని ఓ స్కూటరు ఖాళీ టైరు ముందుకాలికి పట్టుకుని నానా తిప్పలూ పెడుతోంది.
ఇది ఒడిస్సాలోని అతి పెద్ద గండక డొంపాడా వన్య మృగ సంరక్షక క్షేత్రంలో తిరుగుతూన్న ఏనుగు గుంపులోని గున్న ఏనుగు ఒకటి- దారిలో దొరికిన స్కూటర్ టైరుతో ఫుట్‌బాల్ ఆడాలనుకుంది కాబోలు- అంతలో ఆ టైరు రుూ ఏనుగు కాలుకు సరిగ్గా కడియం లాగా అతుక్కునిపోయింది. చెంబులో తలకాయ దూర్చిన పిల్లిలా అయింది. ఇంత లావుపాటి ఏనుగూ- వర్ణనాతీతంగా చిందులు త్రొక్కుతూ- బాధతో, చిరాకుతో, కోపంతో అల్లాడిపోతూంటే ‘పిల్లకాయ చేష్టలు’ కాబోలుననుకుని ‘గజదండు’- దాన్ని వదిలేసి వాటిమానాన అవి ముందుకు సాగాయి. ఆ ‘శాంచువరీ 193 చదరపు కిలోమీటర్ల వైశాల్యం గలది. ఈ గున్న ఏనుగు అలా అలా టైరుని విదిలించుకుంటూ, మనుషులు మసలే- గురుదాస్‌పూర్ దాకా అంటే భువనేశ్వర్‌కు అతిసమీపంగా చేరుకుంది.
ఐతే- అంతలో చిక్కని అడవిలోకి మాయమైపోతోంది. ఈలోగా పదిమందిని కుమ్మేస్తోంది. అత్యున్నత అటవి అధికారులదాగా దిగివచ్చారు. దీనిని మత్తుకలిగించే ఇంజెక్షన్ బాణాలు పెట్టి కొట్టాలి. ఆనక అది స్పృహ తప్పి పడుకుంటే- పట్టుకుని, కాలికున్న టైరుని- వ్రేలికి వున్న ఉంగరాన్ని కోసినట్లు- జాగ్రత్తగా దాని కాలికున్న- మొసలి పట్టు పట్టిన టైరుని కోసేయాలి- అదీ ప్లాను.
గానీ, ఏనుగు దొరకదు- అలాగని మానదు. కాకపోతే ఏనుకుకి రోజుకి రెండు వందల లీటర్ల నీళ్లు కనీసపక్షం కావాలి. వాటికోసం అది కొలనులోకో, చెర్లోకో రావాలి. పైగా పున్నమి నాటి వెనె్నల్లోనైతే ఏనుగులు తప్పక కొలనులో జలకాలాడడానికి వస్తాయి. ఆ పున్నమి పనె్నండవ తేదీ- హోళీ అవుతోంది. ఆ రోజు ఈ గజేంద్రమోక్షం తప్పదు అంటున్నారు డేరాలు వేసి, విడిసి కూర్చున్న సిబ్బంది!

-వీరాజీ