Others

అందం, ఆరోగ్యం పుచ్చకాయతో సొంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనకు లభించే ఫలాలలో పుచ్చకాయ పుష్క లంగా ఖనిజ లవణాలు ఉన్న ఫలం. అందమైన రంగుతో ఉన్న పుచ్చకాయను చూడగానే చిన్నారులకు సైతం నోరూరుతుం ది. ఈ పండు ఎండాకాలం లో ఎక్కువగా దొరుకుతుంది.
వేసవి సీజన్‌లో లభించే ఈ పండును తినడంవలన ఆరోగ్యం మెరుగుపడు తుంది. దీనిలో వుండే పొటాషియం కిడ్నీలను శుభ్రపర్చడానికి దోహదపడుతుంది. రక్తంలో యూరిక్ ఆసిడ్ శాతం తగ్గిస్తుంది. ఈ పండులో నీటిశాతం ఎక్కువ.మూత్ర విసర్జన సక్రమంగా జరగడానికి ఉపయోగపడుతుంది. కిడ్నీలు కాపాడుకోవాలనుకునేవారు పుచ్చకాయ తినడం అలవాటు చేసుకోవాలి. అధిక రక్తపోటును అరికడుతుంది. దీంట్లో అధికంగా నీరు ఉండటం వల్ల శరీర వేడిని తగ్గిస్తుంది. పుచ్చకాయలో విటమిన్ సి, విటమిన్ ఏ, కెరోటిన్ పోషకాలను శరీర ఆరోగ్యానికి అందించగలవు. కాన్సర్ వ్యాధిని నిరోధించే శక్తి పుచ్చకాయలో వుందని నిపుణులు పేర్కొంటున్నారు. గుండె జబ్బులకు కారణమయ్యే కొలెస్ట్రాల్‌ను అదుపు చేసే శక్తి దీనికి వుంది.
షుగర్ పేషెంట్లు సైతం నిరభ్యంతరంగా పుచ్చకాయ తినవచ్చని నిపుణులు చెబుతున్నారు. మన శరీరంలో షుగర్ లెవెల్స్ తగ్గినపుడు దీనిని తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది.
గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో పుచ్చకాయ దోహదపడుతుంది. వీటిలో వుండే థయామిన్, పొటాషియం ఆరోగ్య పరిరక్షణకు తోడ్పడతాయ.
పుచ్చకాయ ఫేస్‌ప్యాక్
పుచ్చకాయ ఫేస్‌ప్యాక్ చర్మం లోపల కూడా శుభ్రపరచి మృతకణాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. ముఖానికి తాజాదనం వస్తుంది. పుచ్చకాయ గుజ్జును తీసుకుని దానిని మెడకు, ముఖానికి పట్టించి ఓ అరగంట ఆరనివ్వాలి. అనంతరం గోరువెచ్చని నీటితో శుప్రరచుకుంటే తాజా సౌందర్యంతో తళతళ మెరుస్తారు. అతివలకు అన్ని విధాలా లాభదాయకం పుచ్చపండు.
**

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో
bhoomika@andhrabhoomi.netకు
మెయల్ చేయవచ్చు.
లేదా
ఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03

- ఎల్.ప్రఫుల్లచంద్ర