Others

వేసవిలో జాగ్రత్త!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసవి కాలం వచ్చిందంటే చిన్నారుల పట్ల జాగ్రత్త వహించాలి. ఇంట్లో ఉండే సమయం. ఈ కాలంలో వచ్చే డయేరియా వారి ప్రాణాలకు ముప్పుగా పొంచివుంటుంది. పిల్లల్లో వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వారు తాగే నీటి పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి. జ్వరాలు, చికెన్‌ఫాక్స్ వంటి వ్యాధులు సైతం పిల్లల్ని చుట్టుముడతాయి. నీళ్ల విరోచనాలు, వాంతులు సంభవించి వారిని బలహీనపరుస్తాయి. స్వచ్ఛమైన మంచినీటితో పాటు శానిటేషన్ పట్ల జాగ్రత్తలు తీసుకుంటే చిన్నారులను ఈ వ్యాధులబారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఇంట్లో ఉండే టాయిలెట్స్‌ను కనీసం వారానికి ఒకసారైనా శుభ్రం చేస్తుండాలి. కలుషిత నీటి వల్ల వ్యాపించే డయేరియా మనదేశంలో ఏటా మూడు లక్షల మంది చిన్నారులు మృత్యువాతకు గురిచేస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాది వేసవి కాలంలో మనదేశంలో డయేరియా వల్ల గంటకు 13మంది చిన్నారులు మరణించారు. ఈసారి ఎండలు ఎక్కువేనని వాతావరణ శాఖ అధికారులు సైతం ముందే హెచ్చరించారు. ఎండలు ముదురకముందే వారి పట్ల సరైన రక్షణ చర్యలు తీసుకోవాలి. వాంతులు, విరేచనాలు అవ్వటం వల్ల పిల్లల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయదు. ఇటువంటి సమయంలో వారికి తక్షణ శక్తి అందించేందుకు పండ్లు చక్కగా పనిచేస్తాయి. డయారియా వల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా శరీరానికి కావల్సిన పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు తక్షణమే అందించేందుకు పండ్లుగానీ లేదా పండ్ల రసాలనుగానీ పిల్లలకు అందించాల్సిన అవసరం ఉంది. వేసవిలోద్రాక్ష, చెర్రీస్, బ్లూ బెర్రీస్, బెర్రీ పండ్లు దొరుకుతాయి. ఈకాలంలో లభించే పండ్లలో మామిడి పండ్లు విరివిగా లభిస్తాయి. ఈ పండ్లను నేరుగా తినేకన్నా జ్యూస్ తీసి ఇస్తే శరీరానికి కావలసిన పోషక పదార్థాలు లభ్యమవుతాయి. చెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు సహజసిద్ధమైన షుగర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో వీటిని పిల్లలకు సలాడ్‌గా ఇచ్చినా ఇష్టంగా తింటారు. అన్నింటికంటే ముఖ్యం పిల్లలకు స్వచ్ఛమైన నీటిని తరచూ తాగిస్తుండటం వల్ల వేడికి చెమట రూపంలో పోయే నీటిని అందించినవారమవుతాం. గత ఏడాది ప్రతి గంటకు 13మంది చిన్నారులు బలయ్యారనే విషయం జ్ఞప్తికి తెచ్చుకుంటూ స్వచ్ఛమైన నీటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం తప్పనిసరి.