సబ్ ఫీచర్

పసి మనసులు.. గాడ్జెట్లకు బానిసలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాజంలో నైతిక విలువలతోపాటు, మానవ సంబంధాలు కూడా నానాటికి తగ్గిపోతున్నాయని అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నవారే. అయితే అందుకు గల కారణాలను విశే్లషించి, తదనుగుణంగా వ్యవహరించడానికి మాత్రం ఎవరూ సిద్ధంగా లేకపోవడం గమనార్హం. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం వలన స్మార్ట్ఫోన్‌లు, ఇంటర్నెట్ సౌకర్యం దాదాపుగా అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఇంటర్నెట్ దాదాపుగా అందరికీ అందుబాటులోకి రావడం ఒక సంచలనమే. అంతేకాకుండా, ఇంటర్నెట్ కారణంగా యావత్ ప్రపంచం ఒక కుగ్రామంగా మారింది. ఇంటర్నెట్‌లో లభించని సమాచారం అంటూ ఏమీ లేదు. వెలుతురు వెన్నంటే చీకటి ఉంటుంది అన్నది ఎంత నిజమో, ప్రతి సౌకర్యంతోపాటు అసౌకర్యం కూడా ఉంటుంది. అయితే, మనం దానిని వినియోగించుకొనే దానిని బట్టి అది సౌకర్యమా? అసౌకర్యమా అనేది తేలుతుంది. ప్రపంచీకరణ కారణంగా, సమాజంలో యాంత్రిక జీవనం ఎక్కువ అయింది. తమ పిల్లలకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పించాలనే తపన తల్లిదండ్రులలో పెరిగిపోయింది. అందుకోసం వారు డబ్బు సంపాదనకే ఎక్కువ ప్రాధా న్యం ఇస్తున్నారు. దీని కారణంగా, వారు పిల్లలతో గడిపే సమయం తగ్గిపోవడంతోపాటు, వారు ఏమి చేస్తున్నారనే అంశాన్ని పరిశీలించే తీరిక, ఓపిక కూడా వారికి ఉండటంలేదు. తమ పిల్లల్ని మంచి కార్పొరేట్ విద్యా సంస్థలో చేర్పించి, వారికి అన్ని సౌకర్యాలు కల్పించడంతో తమ బాధ్యత పూర్తి అయిందని భావించే తల్లిదండ్రులు ఎక్కువ అయ్యారు. పిల్లలకు చిరుప్రాయంనుంచే సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు, టాబ్లెట్లు వినియోగించడం నేర్పుతున్నారు. పెద్దలకన్నా చిన్నారులలో గ్రహణ శక్తి, నేర్పరితనం ఎక్కువగా ఉంటాయి. దీంతో అతి తక్కువ కాలంలోని పిల్లలు ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు వినియోగంలో నైపుణ్యాలను సంపాదిస్తున్నారు. దీని కారణంగా పిల్లలు చదువులో వెనుకబడిపోవడం సర్వసాధారణమైపోయిం ది. పిల్లలు ఎలక్ట్రానిక్ గాడ్జెట్లకు బానిసలుగా మారడానికి కారణం తల్లిదండ్రులే అన్న విషయాన్ని మరచిపోకూడదు. తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడపకపోవడంవలన వారిలో ఆత్మన్యూనత భావం పెరిగిపోతున్నది. ఈ పరిస్థితులల్లో ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు ఆత్మబంధువులుగా మారుతున్నాయి. కళ్ల సంబంధమైన సమస్యలు కూడా పిల్లల్లో పెరిగిపోతున్నాయి. తల్లిదండ్రులు ఎంత బిజీగా వున్నప్పటికీ పిల్లలతో కొంత సమయం గడపడంతోపాటు వారిని స్వేచ్ఛగా ఆడుకోనివ్వాలి. దీనివలన పిల్లలకు ఆరోగ్యవంతంగా ఎదగడానికి చదువులో ముందుండటానికి అవకాశం కలుగుతుంది. తల్లిదండ్రులారా ఇకనైనా పిల్లలతో కొంత సమయం గడపడానికి కేటాయించండి.. ప్లీజ్...

-పి.హైమావతి