Others

అలా మిస్సయ్యాం... శరత్కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ చిత్రంలోని నటుడి పేరు విజయ్‌కుమార్. పేరొందిన సంగీత కుటుంబం నుంచి వచ్చిన నటుడు, మంచి గాయకుడు కూడా. నృత్యంలో కూడా ప్రావీణ్యత పొందాడు. మొదటి చిత్రం ‘పెళ్లిళ్ల చదరంగం’లో మంచి హాస్యపాత్రలో నటించి మెప్పించాడు. ఆ చిత్రం నంది అవార్డుతోపాటు పలు అవార్డులూ సాధించింది. ఈ చిత్రం విడుదల తర్వాత ప్రేక్షకుల తీర్పునకు అనుగుణంగా తన భవిష్యత్ కార్యక్రమం కొనసాగించాలని అనుకొన్నాడు. అనుకోని కారణంగా చిత్రం విడుదల వాయిదా పడసాగింది. ఈ చిత్రంలోనే మరో ఆసక్తికర సన్నివేశంలో మారువేషంలో స్ర్తిపాత్రలో వున్న శుభలేఖ సుధాకర్‌ను కూడా చూడవచ్చు. ఈ సన్నివేశంలో విజయ్‌కుమార్ కడుపుబ్బ నవ్వించాడు. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఆ నటుడి కలలు నెరవేర లేదు. సరికదా ఆ నటుడే మనకు దూరమై గతించిన తన తండ్రి చెంతకు చేరాడు. ఒకమంచి నటుడు గాయకుడు, నృత్య కళాకారుడు రాబోతున్నాడని ఆశించిన తెలుగు సినిమా పెద్దలు నివ్వెరపోయారు. ఇంతకీ ఈ విజయ్‌కుమార్ ఎవరో తెలుసా? అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రథమ పుత్రుడు. పరిశ్రమ ఒక టాలెంట్‌గల కళాకారుడిని కోల్పోయింది.

-పర్చా శరత్‌కుమార్ 9849601717