Others

షార్ట్ ఫిల్మ్ @180

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘డబ్బుకు లోకం దాసోహం’, ‘డబ్బు లేనిదే ఏ పనీ జరగదు’ అన్నది ప్రస్తుత సమాజంలో కొంతవరకూ నిజం కావొచ్చు. కానీ, నిబద్ధత, ధృడ దీక్ష, సంకల్పం ఉంటే తగినంత డబ్బు లేకున్నా అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించారు క్రిస్టినే జోస్ సలేస్. కేవలం రూ.180 ఖర్చుతో ఒక షార్ట్ ఫిల్మ్ నిర్మించి ఉత్తమ షార్ట్ ఫిల్మ్ అవార్డ్ సాధించాడు. ప్రస్తుతం యువత షార్ట్ ఫిల్మ్‌ల తయారీ (నిర్మించడం) పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతోంది. పలువురు షార్ట్ ఫిల్మ్ నిర్మాణానికి లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మరికొందరు తగినంత సొమ్ము లేక ఆసక్తి చంపుకుంటున్నారు. అయితే, షార్ట్ ఫిల్మ్ నిర్మించాలని అనుకొంటున్న అలాంటి వారికి ఆదర్శంగా నిలిచాడు జోస్ సలేస్. ప్రకృతి రమణీయతకు నిలయమైన కేరళలోని ‘కంజీరప్పల్లి’ కుగ్రామంలో పుట్టిన జోస్, గ్రాడ్యుయేషన్ కోసం బెంగళూరు వచ్చారు. ఆ సమయంలో కళాశాలలో ఒక నాటకంలో నటించే అవకాశం వచ్చింది. అనంతరం ఒక నాటకానికి దర్శకత్వం వహించి అందరి మన్ననలు అందుకున్నాడు. అప్పటినుంచి జోస్ నాటకాలు రచించటం, ప్రదర్శించటంపై ఆసక్తి చూపించాడు. ప్రస్తుతం జోస్ చెన్నైలో సింబియాసిస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మీడియా అండ్ కమ్యూనికేషన్స్‌లో ఎంబిఎ చేస్తున్నాడు.
ప్రముఖ ఆంగ్ల రచయిత క్రిష్ట్ఫార్ నోలాన్ రచించిన ‘బాడీ ఆఫ్ వర్క్’ అనే నవల స్ఫూర్తితో, జోస్ సొంతగా ఒక కథ తయారు చేశాడు. సదరు కథతో ‘టైమ్ ఇన్ ఎ బాక్స్’ అనే షార్ట్ ఫిల్మ్ నిర్మించాడు. ఈ షార్ట్ ఫిల్మ్ నిర్మాణానికి అయిన ఖర్చు అక్షరాలా రూ.180 రూపాయలు. ఇటీవల మీడియా కొనె్నక్ట్ నిర్వహించిన షార్ట్ ఫిల్మ్ కాంపిటేషన్‌లో ‘టైమ్ ఇన్ ఎ బాక్స్’ ఉత్తమ షార్ట్ఫిల్మ్‌గా ఎంపికైంది. ఈ పోటీలో మొత్తం 450 ఫిల్మ్‌లు పోటీ పడ్డాయి. షార్ట్ఫిల్మ్ ఎంపిక కమిటీలోని న్యాయ నిర్ణేతలలో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనంత్ మహదేవన్ ఒకరు. అతి తక్కువ ఖర్చు సినిమా ఎలా నిర్మించాలో ‘జోస్’నుంచి చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా గుర్తు పెట్టుకోవాలి.
షార్ట్ ఫిల్మ్‌లో తన స్నేహితులు నటించారని, మరో స్నేహితుడు కేనన్ డిఎస్‌ఎల్‌ఆర్ కెమెరా ఇచ్చారని, షూటింగ్ మొత్తం తన గదిలో చేశానని జోస్ చెప్పారు. లైటింగ్ కోసం వినియోగించే బల్బులకు అద్దెకట్టానని, ఎడిటింగ్ కూడ తానే చేశానని చెప్పుకొచ్చారు. స్నేహితుల సహాయ, సహకారాలతోనే తాను కేవలం రూ. 180తో షార్ట్ఫిల్మ్ నిర్మించినట్టు ‘జోస్’ వినమ్రంగా చెబుతున్నాడు. సృజనాత్మకత కలిగి, షార్ట్ ఫిల్మ్‌లు నిర్మించాలనుకొనే వారికి జోస్ ఆదర్శప్రాయుడిగా నిలుస్తున్నారు. జోస్ మరిన్ని మంచి చిత్రాలు నిర్మించాలని ఆశిద్దాం.

-పి భానుశంకర్