Others

కమలాఫలం పచ్చడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసవిలో లభించే కమలాఫలంతో రుచి కర మైన వంటలు చేసుకోవచ్చు. వ్యాధి నిరోధక శక్తి కలిగిన కమలా పండుతింటే జలుబు, దగ్గు చేస్తుందని అనుకుంటారు. కాని కమ లాపండు తినటం వల్ల దగ్గును దూరుం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు సలహా ఇస్తున్నారు. దీనితో తొక్కల పచ్చడి, కస్టర్డ్ వంటివి చేసుకుని తింటే రుచిగా ఉంటాయ.
కస్టర్డ్
కమలా తొనలు - 2 కప్పులు, కస్టర్డ్ పౌడర్ - 1 కప్పు, పాలు - 2 కప్పులు, ఏలకులు - 5, వేరుశెనగపప్పులు - 24, జీడిపప్పులు - 24, బాదం - 24, పిస్తా - 24, ఖర్జూరం ముక్కలు - 1 కప్పు, పంచదార - 1కప్పు, కొబ్బరికోరు - 5 చెంచా లు, ముందుగా పాలు కాయాలి. ఈ వేడి పాలలో కస్డర్డ్ పౌడర్, పంచదార, ఏలకులు, కొబ్బరి కోరు కలిపి ప్రక్కన పెట్టాలి. చల్లారాక పై పప్పులు అన్నీ వేసి బాగా కలపాలి. కమలా తొనలు కలిపి ఫ్రిజ్‌లో పెట్టాలి. 2 గంటల తరువాత తీసి తింటే రుచి.
పచ్చడి
మినపప్పు, శెనగపప్పు - 5 చెంచాలు, ఆవాలు - 2 చెంచాలు, జీలకఱ్ఱ - 1 చెంచా, మెంతులు - 1/2 చెం చా, ఇంగువ - కొం చెం, నూనె - 2 చెంచాలు, ఎండుమిర్చి - 8, పచ్చిమిర్చి - 4, కొత్తిమీర - కొంచెం, ఉప్పు - 2 చెంచా లు, కమలా తొక్కలు - 6 పళ్ళవి, పసుపు - కొం చెం, ముందుగా బాణలిలో నూనె వేసి పోపు వేయించాలి. ఈ పోపును మిక్సీ పట్టి పొడి ప్రక్క న పెట్టాలి. మిగతా నూనెలో ఉప్పు, పసుపు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి ఉడికించాలి. దీన్ని ముద్దగా గరిటెతో అదిమి పై పోపు, కారం పొడి కలిపి దింపాలి. అన్నం, దోశె- దేనికైనా మంచి రుచి. రెండు రోజులు నిల్వ ఉంటుంది. ఇదే విధంగా తొనలు కూడా చెయ్యవచ్చు. పోపు పొడిని, తొన లు వలచి అందులో కలిపి 5నిమిషాలు ఉడికించి కొత్తిమీర జల్లితే తొనల పచ్చడి రెడీ.
**

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో
bhoomika@andhrabhoomi.netకు
మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03

- వాణీ ప్రభాకరి