Others

వేసవి తాపానికి వీటితో చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎండలు ముదిరిపోతున్నప్పుడు ఎదురయ్యే సమస్యలకు తాటిముంజలు దివ్యమైన ఔషధంగా పనిచేస్తాయి. ముఖ్యంగా వేసవిలో వ్యాపించే చికెన్‌పాక్స్ బాధితులకు ఇది చల్లటిమందు. ఐస్ ఆపిల్‌గా పిలుచుకునే తాటిముంజల్లో ఎ, బి, సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. నీటిశాతమూ ఎక్కువే. కొబ్బరికాయల తరువాత ఎక్కువ నీటిని ఇచ్చే పండ్లు ఇవి. మనిషికి కావలసిన ఖనిజ లవణాలైన ఫాస్పరస్, పొటాషియం, కాల్షియం, జింక్ వీటిలో తగినపాళ్లలో ఉంటాయి. వేడిమి నుంచి రక్షణకు, వడదెబ్బ తగలకుండా ఉండేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఈ ముంజలను తింటే కడుపునిండినట్లు, మగతగా ఉంటుంది. అందువల్ల ఇతర పదార్థాలు తినాలని అనిపించదు. ఫలితంగా ఆహార వినియోగం తగ్గి బరువుపెరగకుండా ఉంటారన్నమాట. ఉదరసమస్యలకు ఇది మంచి మందు. జీర్ణక్రియ మెరుగుపరిచే ముంజలు విషతుల్య పదార్థాలను తొలగిస్తాయి కూడా.