Others

ఆరోగ్యాన్ని అందించే ఆకుకూరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార లేదా పీచుతో కూడిన స్వాభావిక ఆహార పదార్థాలు మనం తీసుకునే భోజనంలో 50 శాతందాకా తప్పనిసరిగా ఉండాలి. కండరాల కదలికలకు నార లేదా పీచుతో కూడిన ఆహార పదార్థం సహాయపడుతుంది. తాజా కూరగాయలతో కూడిన సలాడ్‌లు, బచ్చలి కూర జీర్ణశక్తిని పెంచుతాయి. ఆహారం బాగా జీర్ణమయ్యేందుకు అవసరమైన పీచు పదార్థం ఆకుకూరల్లో అధికంగా ఉం టుంది.
శరీరంలోని, ప్రేగుల్లోని బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగా పోరాడే గుణం ఆకుకూరల్లోని పత్రహరితాలకు ఉంది. ఆకుకూరలను పచ్చిగానే నమలటంవల్ల పళ్ల సందుల్లో ఇరుక్కుపోయిన ఆహార పదార్థాల ముక్కలను బయటికి తీసుకొస్తాయి. అలాగే పళ్లకు హానిచేసే క్రిములను నాశనం చేస్తాయి. ఆకుకూరలు అన్ని మంచివే. వీటిలో ఎన్నో వెరైటీలు కూడా ఉన్నాయి. అయితే రెండిటినీ పోలిస్తే లేత రంగు ఉన్నవికన్నా ముదురు ఆకుపచ్చ కూర మంచిది. మనం తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, పీచు సమపాళ్లలో వుంటే అన్ని పోషకాలు అందుతాయి. కానీ ఏ ఒక్క ఆహార పదార్థంలో నూ ఇవి నాలుగూ ఒకేసారి లభించవు.
ఇందులో దేని ప్రాధాన్యత దానిదే. అందుకే సమతుల ఆహారం తీసుకోవాల్సిన అవసరం వుంది. యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉండటం వల్ల గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి ఇవి రక్షణ కల్పిస్తాయి. రోజూ ఆహారంలో కనీసం పది గ్రాముల తాజా ఆకుకూరలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
పచ్చికూరలు తింటేనే మేలు
తిండి ఆరోగ్యమైందిగా వుండాలంటే ఆకుకూరలు తినటం శ్రేష్ఠం. ఆకుకూరలు తరిగి చట్నీలలో కలుపుకొని తినవచ్చు లేదా కొన్ని కూరలు పచ్చివే నమలచ్చు. వీలైతే పచ్చివిగానే తినాలి. మెంతికూర, కర్వేపాకు, తులసి, గోంగూర, కొత్తిమీర, తోటకూర మొదలైనవి పచ్చిగానే తినవచ్చు. ఆకుకూరలు శుభ్రం చేయటానికి మంచినీరు వాడాలి లేదంటే వాటిని ఉప్పు వేసిన వేడినీటిలో శుభ్రం చేయాలి. అప్పుడు మాత్రమే వాటి పై వున్న క్రిములు, వాటిగుడ్లు పూర్తిగా నశిస్తాయి.
పోషకాలు పూర్తిగా పొందాలంటే..
ఆకుకూరల్లో వుండే పోషకాలను పూర్తిగా పొం దాలంటే వాటిని బాగా సన్నగా తరగాలి. ఆకుకూరలతో సూపులు, సలాడ్లు చేసుకోవచ్చు. ఆకుకూరలు వండేటపుడు లేదా ఉడికించేటప్పుడు మూతతెరిచి పెట్టరాదు. ప్రెషర్‌కుక్ చేసేట్లయితే, ఉడికించిన నీటిని పారబోయవద్దు. దానికి కొద్దిపాటి ఉప్పు లేదా నిమ్మరసం లేదా కొన్ని మసాలాలు వేస్తే సూప్‌లా తయారవుతుంది.
ఆహారంలో వీటి స్థానం ప్రత్యేకం
తరచుగా దొరికే వీటిని తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ఆకుకూరల్లో ఉండే విటమిన్ బి పాలె ట్స్ జ్ఞాపకశక్తితోపాటు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. గుండె సంబంధిత వ్యాధులకు దారితీసే అమైనో ఆమ్లాలను నియంత్రించడానికి సహకరిస్తాయి. తోటకూర, పాలకూర, బచ్చలికూర, గోంగూర, మెంతికూర, చుక్కకూర, మునగఆకు, కరివేపాకు, కొత్తిమీర, బ్లాక్‌బీన్స్, సోయాబీన్స్, గ్రీన్‌పీస్ తదితర వాటిలో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. అలాగే మధుమేహం, గుండె జ బ్బులు అధిక బరువు, మలబద్ధకం వ్యాధులు దరిచేరవు.

- తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి