Others

పడుచు జంటలు లేని పార్కు వృథా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్కులకి చెట్లు, మొక్కలు, వాటికి పూలు, నియాన్ లైట్ల కాంతులు- యివన్నీ అలంకారాలే గానీ, సాయంకాలం అయ్యేసరికి, సీతాకోక చిలుకల్లాగా పడుచు జంట లు వచ్చి వాలితేనే దాని అందం. కానీ, రెం డు లక్షల చదరపు అడుగుల వైశాల్యంగల, లక్నోలోని ‘రామ మనోహర లోహియా’ పార్కులో యిప్పుడు అంతులేని వెలితి కనబడుతున్నది బోసిపోయి వుంది.
ఈ పార్కులో మొత్తం యాభై రకాల వృక్ష జాతులకు చెందిన పదిహేను వేల- యస్! ఫిఫ్టీన్ థౌజండ్! చెట్లు వున్నాయి. కానీ, శుక్ర, శనివారాల్లోనే పడుచు జనాలు లేరు. దీనికి కారణం కొత్త ముఖ్యమంత్రి యోగిగారి ఉత్తర్వుల మేరకు-యాంటీరోమియో ఉద్యమం ఒక దానిని పోలీసు బలగాలు తీవ్రాతి తీవ్రంగా అమలుచేస్తున్నారు. ‘ప్రేమికుల రోజు’నాడు జంటల్ని వేటాడినట్లు రోమియోలు అంటూ ఆడపిల్లతో కనబడ్డ మగాళ్లను వారి భాగస్వాములతో సహా లాక్కుపోతున్నారు ‘‘సెల్’’లోకి. మార్చి 19నుంచి రోజూ వెయ్యి మంది ప్రేమ జంటలేనా షైరు చేసే రుూ ఉద్యానవనంలో యివాళ జంట కనబడితే, ఒట్టు! ఆడ, మగా పోలీసులు ఆడ పిల్లల్ని చెయ్యి పట్టుకుని లాక్కెల్లి చెరసాలు చేస్తున్నారన్న ఆందోళన మొదలయింది. ఒక జంటను పట్టుకుని పోలీస్‌స్టేషన్‌లో అక్రమంగా నిర్భందించారన్న వార్తపై- ముఖ్యమంత్రి స్పందించి తన ఉత్తర్వులను సడలించడం కూడా జరిగింది. ముగ్గుర్ని సస్పెండ్ కూడా చేశారు. ఇదిలా వుండగా, దేశ రాజధాని ఢిల్లీలో- ‘ఆప్’టూరిస్టు శాఖామాత్యుడు- రోమియోలే కాదు జూలియట్ సహా జంటలను- గొప్పగా - గౌరవంగా- షైర్లూ, షికార్లూ కొట్టనిస్తాం లెండి అంటూ ప్రకటన చేశాడు. మొత్తంమీద యు.పి. పోలీసులు కాపలాకాసి- ఢిల్లీ పోలీసులు కాపలా కాయకుండా అవస్థలు పెడుతున్నారు యువ జంటల్ని...

చెటు టకోసం
దారుణం
చెట్లను కూల్చేయడం పాపమే కాదు- చట్టరీత్యా నేరం. కానీ జరుగుతూనే వుంటుందీ ఘోరం. రాజస్థాన్‌లోని జోథపూర్ నగరం దరిగళంలో ఇరవై ఏండ్ల ప్రాయంగల యువతి చెట్లను నరికివేయడాన్ని ఎదుర్కొంది.
‘తమ పొలాల్లో వున్న చెట్లను నరికివేయడం దారుణం’అంటూ ఆమె ఒక వృక్షాన్ని కౌగలించుకుని వుండిపోయింది.’ రోడ్లు ముఖ్యమా? ప్రాణాధారమైన వృక్ష రాజములు ముఖ్య మా?’’అని రుూ పల్లెటూరి యువతి అందర్నీ నిలదీసి అడిగింది. కాని ఫలితంగా కాలిపోయింది.
ఈ గ్రామం జోధపూర్‌కి నూరు కిలోమీటర్ల దూరంలో వున్నది. ఈ యువతిని పోలీసులు రక్షించలేకపోయారు. ఈ యువతి మీద పెట్రో లు, యితర ఇంధన తైలాలు పోసి, తడిపి, నిప్పు లు పెట్టినట్లు వార్తలు నిర్ధారిస్తున్నాయి. పైగా ఆ గ్రామాధికారి రుూ నేరంలో ముఖ్య పాత్రధారి అని అంటున్నారు. కాలిపోయిన రుూ యువతి శరీరాన్ని మాత్రం పోలీసులు ఆసుపత్రికి చేర్చగలిగారు. దేశంలో చెట్ల సంరక్షణకోసం ఎంత ప్రచారం సాగుతున్నా, జరిగే ఘోరాలు జరిగిపోతూనే వున్నాయి!

ఎయర్‌పోర్టు
అధికారుల నిర్వాకం!

‘డ్రెస్ కోడ్’- అన్నది ఎక్కడ ఏ విధంగా వున్నా- రుూ కాలం ఆడ పిల్లలికి ఛిర్రెత్తిపోతుంది గుళ్లో, బళ్లో, యిలా ఎక్కడయినా దుస్తుల ధారణకి ‘రూల్సు’వుంటే, అది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అన్న వాదం వినవస్తున్నది. మొన్న ఆదివారంనాడు అమెరికాలో డేనె్వర్ ఎయిర్ పోర్టునుంచి మిన్నియా పోలీస్ విమానాశ్రయానికి వెళ్లే విమానం ఎక్కుతున్న ఆడ పిల్లల్ని ట్రావెల్ ఏజెంట్ గేటు దగ్గర ఆపి- డ్రెస్ కోడ్ ప్రకారం ‘లెగ్గింగ్స్’ ‘‘యో గా’’లాగులూ ధరించి విమానంలో ప్రయాణం చెయ్యనివ్వం’’- అంటూ చెయ్యి అడ్డం పెట్టేశారు. కాకపోతే, అదే లెగ్గింగ్స్ (బిగుతు పైజమా లాంటి దుస్తులు) మీద, మరో దుస్తు ఏదేనా బురఖాలాగా కప్పుకున్నా, ఓ.కే;’’అన్నారు. దీని మీద యిద్దరు తప్ప మిగతా ముగ్గురు ఆడ పిల్లలు లోపలికి పోగలిగారు. వేరే దుస్తులు లేని అమ్మాయిలు యిద్దరు దిగిపోయారు. జీన్స్, బిగుతు లాగులు కన్నా తీసిపోయాయా? యివి? అన్న వాదన వద్దు అన్నారు గేట్ కీపర్లు. ‘‘మేము రూల్సు చెయ్యం వాటిని అమలు మాత్రమే చేస్తాం. పైగా యునైటెడ్ ఎయిర్‌లైన్స్ వారి ప్యాసు పట్టుకుని ప్రయాణం చేస్తున్న ఉద్యోగుల పిల్లల్ని ఆపేసే హక్కు కంపెనీకున్నది’’- అన్నారు. దీనితో సోషల్ మీడియా ప్రేలిపోతోంది ట్వీట్స్ మీద ట్వీట్స్! యిదే వర్తమాన నాగరికత!

veeraji.pkm@gmail.com