Others

సెట్స్‌పై పవన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రివిక్రమ్- పవన్‌కళ్యాణ్ కాంబినేషన్‌లో ఎప్పటినుంచో సినిమా కావాలని అభిమానులు అడుగుతూనే ఉన్నారు. గత కొంతకాలంగా ఈ కాంబినేషన్ ఓ వండర్ చిత్రాన్ని క్రియేట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. అందుకు తగిన విధంగా తొలిసారిగా పవన్‌కళ్యాణ్ కెరీర్‌లో 90 కోట్ల భారీ బడ్జెట్‌తో త్రివిక్రమ్ పవన్‌తో సినిమా ప్రారంభించారు. గతంలో రెండు చిత్రాలు బ్లాక్‌బస్టర్‌గా నిలిపిన త్రివిక్రమ్ ఈ చిత్రంతో హ్యాట్రిక్ కొట్టడానికి సమాయత్తమవుతున్నారు. యువ కథానాయికలు కీర్తిసురేష్, అనూ ఇమ్మాన్యుయల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో వారిద్దరికి తగిన విధంగా పవన్‌కళ్యాణ్ మాస్ స్టయిలిష్‌గా కనిపించనున్నారట. ఇటీవల నిశ్శబ్దంగా ప్రారంభమైన ఈ చిత్రానికి సంబంధించిన సెట్స్‌లో పవన్ సందడి చేశారు. దీంతో అభిమానులకు మళ్లీ ఆనందం వచ్చింది.