Others

సోయగాల చామంతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూజైనా..వేడుకైనా మేము సిద్ధం అంటూ చామంతులు ముందుంటాయి. పసుపు, తెలుపు రంగుల్లో విరబూసే సోయగాల చామంతులు మనసుకు ఆహ్లాదం కలిగిస్తాయ. వీటి పరిమళం ఆస్వాదించాలంటే గది మధ్యలో వీటని వేలాడదీయండి. అలాగే రాగి పాత్రలో నీళ్లు పోసి అందులో చామంతి రేకులు వేసుకుంటే మంచి సువాసనతో పాటు కనువిందు చేస్తుంటాయి. సిట్టింగ్ రూమ్‌లోగానీ, బెడ్‌రూమ్ పక్కన గానీ చామంతి పూల ఫ్లవర్‌వేజ్‌ను ఏర్పాటు చేసుకుంటే పసుపుపచ్చని పూదోట నడిచివస్తున్నట్టుగా ఉంటుంది. అతిథులకు ఆహ్లాదాన్ని పంచిపెడతాయి. ఫ్లవర్‌వేజ్‌లో తెల్లచామంతులు అమర్చుకుంటే అందంతో పాటు వీటి పరిమళం ఊపిరితిత్తుల సమస్యలను సైతం నివారిస్తుందని అనేక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇండోర్ కాలుష్య నియంత్రణకు చామంతుల పరిమళమే విరుగుడని నాసా జరిపిన అధ్యయనంలోనూ వెల్లడైంది. ఇంటి వాతావరణంలోని కాలుష్య కారకాల రసాయనాలను తొలగించే శక్తి ఈ చిట్టిపొట్టి చామంతులకే ఉంది. బాల్కానీల్లోగానీ, వరండాల్లోగానీ వెలుతురు పడేచోట కుండీల్లో పెంచుకుంటే మంచిది. చామంతులను చూస్తే చాలు చిన్ని చిన్ని పక్షులు, సీతాకోకచిలుకలు సైతం వచ్చేసి చిన్నారులతో చిందేస్తాయి. ఒకటి నుంచి మూడు అడుగులు ఎత్తుమాత్రమే పెరిగే వీటి విత్తనాలు వేసిన 10 నుంచి 18 రోజులలోనే మొక్కలు వస్తాయి. వీటికి 16 నుంచి 21 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటే చాలు. విత్తనాలు విత్తిన తరువాత అవసరమైన మేరకే నీరు పోయాలి. మట్టి ఆరిపోకుండా చూసుకుంటే చాలు. సూర్యుని వెలుతురు పడితే మరింత మంచిది. వీటికి తెగుళ్ల బెడద ఎక్కువ. కాబట్టి మొక్కల్లో నీళ్లు నిలువ ఉండకుండా చూసుకోవాలి. కషాయాలు, వంటసోడా ద్రావణం, సబ్బునీళ్లు పిచికారీ చేస్తే తెగుళ్ల బెడదను నివారుంచుకోవచ్చు. ఇళ్లల్లో పెంచుకోదలచినవారు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం లేత మొక్కల్ని నాటుకుంటే మంచిది.