Others

ఈతరం బుద్ధుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(నేడు అంబేడ్కర్ జయంతి)
*
ఆచంద్ర తారార్కం, అజరామరం- అంబేడ్కరీయం
ఆదర్శ సమాజ నిర్మాణానికి ఆలంబనం- ఆయన భావజాలం
భావితరాలకు మార్గదర్శనం- బాబాసాహెబ్ జీవిత గమనం
సర్వమానవ గౌరవ స్వేచ్ఛాగానం- తాను స్వప్నించిన సుందర స్వర్గం

అంటరానితనపు అవమానాలెన్నో జీవిత పర్యంతం వెంటాడినా
బీదరికపు బాధలన్నీ అవరోధాలై అడుగడుగునా వేధించినా
గతి తప్పని పథికుడాయన
నిబద్ధతతో గమ్యం చేరిన స్థితప్రజ్ఞుడాయన, నేటి బుద్ధుడాయన
జరారుజ మరణాలు చూసి చలించినాడు నాటి బుద్ధుడు
కులవివక్షా ఘోరావమానాలు మోసి జ్వలించినాడు నేటి బుద్ధుడు
చదువుతో ఎదిగి, ఎదుగుతూ కదిలి
కదులుతూ కదిలించి,
అదిలించి, ముందుండి నడిపించి
జాతిజనులను జాగృత పరిచినాడు
సకల జనహిత సమాజానికి
కులరహితమే సహజ మార్గమన్నాడు

శ్రామిక, మహిళ, బడుగు హక్కులకు గొడుగు పట్టినాడు
అవ్యవస్థల, అనాచారాల, అణచివేతల చెడుగుపై
పిడుగై యుద్ధాన్ని చేపట్టినాడు

విద్యాయుధమే బలహీనుల చేతి వజ్రాయుధమని చాటినాడు
బుద్ధి గరపి, భుజం కలిపి, ఉద్యమించుట నేర్పినాడు
స్వేచ్ఛ, సమానత్వం, సహోదరత్వ భావనలే పునాదులుగా,
పటిష్ట, విశిష్ఠ రాజ్యాంగ భవనాన్ని నిర్మించినాడు
భారతావనికి ప్రేమతో అందించినాడు
అంబేద్కర్ వారసులమని గర్విద్దాం
అందరమూ ఆ మహాస్ఫూర్తిని కొనసాగిద్దాం
ఆధునిక భారతాన్ని నిర్మిద్దాం.

*
-డా. డివిజి శంకరరావు