Others

గుడ్డుతో గుండె పదిలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌకగా లభించే పౌష్టికాహారంలో గుడ్డుదే అగ్రస్థానం. శాఖాహారంగా భావించి గుడ్డు తినటం వల్ల ఉపయోగాలు అనేకం. రోజూ ఒక గుడ్డు తినండని వైద్య నిపుణులు చూసిస్తున్నారు. రోజూ ఆహారంలో భాగంగా గుడ్డును తీసుకోవటం వల్ల శరీరానికి ఉపయోగపడే హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ పెంచుతుంది. ఈ కొలెస్ట్రాల్ రక్తం గడ్డకట్టడాన్ని అదుపులో ఉంచుతుంది. రక్తనాళాలు, గుండె జబ్బులు దరిచేరవు. కంటి సంబంధిత సమస్యలను సైతం దూరం చేస్తుంది. ఒక గుడ్డులో 300 మైక్రోగ్రాముల కొలైన్ లభిస్తుంది. ఇది మెదడు పనితీరుకీ, నరాల వ్యవస్థ బలంగా ఉండటానికి దోహదం చేస్తోంది. వారంలో కనీసం ఆరు కోడిగుడ్లు తింటే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం 44 శాతం తక్కువగా ఉంటుందని అధ్యయనాలు సైతం వెల్లడిస్తున్నాయి. క్షయ వ్యాధిగ్రస్తులు, బాలింతలు, గర్భిణులు, కాలేయ వ్యాధిగ్రస్తులు రోజూ గుడ్డు తింటే మంచిది. మినరల్స్, రైబోప్లెవిస్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో దెబ్బతిన్న కణాలను మెరుగు పరచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఒక గుడ్డులోని తెల్లసొనను కప్పు పాలలో కలిపి, దీనికి రెండు చెంచాల తేనె కలుపుకుని తాగితే శరీరంలోని విష పదార్థాలకు విరుగుడు లభిస్తోంది. ఇలా ప్రతిరోజూ తీసుకోవటం వల్ల శారీరక బలం పెరిగి టానిక్ వలే ఉపయోగపడుతుంది. ఎదిగే పిల్లలకు కావల్సినంత ప్రొటీన్లు అందుతాయి. పోషకాహార లేమితో బాధపడేవారు రోజూ ఓ గుడ్డు తినమని వైద్యులు సైతం చెబుతుంటారు. అందమైన చర్మం, సహజ సిద్ధమైన జుట్టు పొందాలనుకునేవారు గుడ్డును బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే మేలు.