Others

విభజన సమస్యలు ఇంకెన్నాళ్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్ర విభజన జరిగి మూడేళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఏపి, తెలంగాణ మధ్య కొన్ని సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. నదీ జలాలు, భవనాలు, ఉద్యోగుల కేటాయింపు వంటి అంశాలపై ఇంకా ‘పంచాయతీ’ కొనసాగుతోంది. వీటిని సాధ్యమైనంత తొందరలో సామరస్యంగా పరిష్కరించుకునేలా ఉభయ రాష్ట్రాలు చొరవ చూపాలి. విభజన ఫలితంగా రాజధాని లేకుండా పోయిన ఏపికి అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. సంపన్న రాష్ట్రంగా మిగిలిన తెలంగాణలో పలు అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. ‘గత పాలకుల నిర్వాకం అంటూ..’ తెలంగాణ నేతలు ఇంకా విమర్శలు చేయడం సరికాదు. సాగునీటి ప్రాజెక్టుల సంగతి సరే.. మరి నిధుల సంగతేమిటి? పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఐటీ సంస్థలు, సీమాంధ్ర సంపన్నుల కారణంగానే హైదరాబాద్‌లో తెలంగాణ సర్కారుకు గణనీయంగా ఆదాయం లభిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించి అనేక సాగునీటి, విద్యుత్ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. గనుక గతాన్ని తవ్వుకోకుండా ముందుకు సాగాలి.
ఎవరు అధికారంలో ఉన్నా భారీ ప్రాజెక్టులకు అంచనా వ్యయం పెరగడం, అవినీతి, నిధుల మళ్లింపు వంటివి జరిగాయి. తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి పాత ప్రాజెక్టులకు సక్రమంగా నీరందితే ఉభయ గోదావరి, కృష్ణా, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పంటల పరిస్థితి మెరుగుపడుతుంది. ఆహార ధాన్యాలను ఎగుమతి చేసే పరిస్థితి ఉంది. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో ఉభయ రాష్ట్రాలూ సమన్వయంతో పనిచేయాలి. చెరువుల ఆక్రమణలను నిరోధిస్తే సాగునీటికి ఇబ్బందులు తప్పుతాయి. భూగర్భ జలాల మట్టం పెరిగి వాతావరణం చల్లబడుతుంది. తాగునీటి కొరత సైతం తీరుతుంది. ఇజ్రాయిల్ దేశంలో వలె కొద్దిపాటి నీటి వినియోగం, తక్కువ ఖర్చుతో పండించే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మెట్ట భూములకు నీరందిస్తే వంట నూనెలు, పప్పు ధాన్యాలు, పశుగ్రాసం దిగుబడులు పెరుగుతాయి. పాడి పరిశ్రమకు కూడా మేలు జరుగుతుంది. గ్రామీణుల వలసలు తగ్గుతాయి.
నీటి ప్రాజెక్టులపై వివాదాలు సమసిపోతేనే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. ఇక, ఎగువ రాష్ట్రాలైన కర్నాటక, మహారాష్టల్ల్రో నదీ జలాలను అక్రమంగా వాడుకోవడాన్ని అడ్డుకునేందుకు ఏపి, తెలంగాణలు ఉమ్మడిగా ఉద్యమించాలి. లేకుంటే తుంగభద్ర, శ్రీశైలం, సాగర్ వంటి ప్రాజెక్టులకు నీరందక రైతులు ఇక్కట్లపాలవుతారు. కేంద్రప్రభుత్వం కూడా కల్పించుకుని కేంద్ర జలసంఘానికి ‘కొత్తనీటి ప్రాజెక్టులు, అంతర్రాష్ట్ర జల వినియోగం’ వంటి అంశాలపై మరి కొన్ని అధికారాలిచ్చి తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తే జగడాలను నియంత్రించాలి.

-తిరుమలశెట్టి సాంబశివరావు