Others

స్క్రీన్ చించేస్తున్నారు.. బాలీవుడ్ బాంబ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లవ్‌గేమ్స్, కాబరేట్,
వన్ నైట్ స్టాండ్, గర్ల్‌ఫ్రెండ్, బి.పి., రాత్‌కీ రాణి, డర్టీ మ్యారేజ్, ఇన్సాఫ్ భావనాకా, ఎక్స్‌వైజెడ్, నో పార్కింగ్, పార్ట్‌టైమ్ రొమాన్స్, మస్తీ జాదే, లైలా లీలీ... -ఇవీ బాలీవుడ్‌లో విడుదలకు సిద్ధమవుతున్నబాంబ్‌లు.
--

సినీ ప్రపంచంలో మంచీ చెడూ రైలుపట్టాల్లా సమాంతరంగా ప్రయాణిస్తూనే ఉంటాయి. అందులో భాగంగా మంచి చిత్రాలు, చెత్త చిత్రాలు ప్రేక్షకులను వెంటాడుతూనే ఉంటాయ. వీటిమధ్యలో అవాంఛనీయమైన బూతు మార్కు చిత్రాలూ అప్పుడప్పుడు ప్రేక్షకులను పలకరిస్తుంటాయ.. పరిగెత్తిస్తుంటాయ్. ఇలాంటి చిత్రాలకోసం కొంతమంది ప్రత్యేక ప్రేక్షక వర్గం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ఎలాంటి సినిమా కావాలనుకున్న ప్రేక్షకుడికి అలాంటి సినిమా బాలీవుడ్ అందిస్తూనే వచ్చింది. ఉత్తరాదిలోనేకాక దక్షిణాదిలోనూ అలాంటి చిత్రాలకు మాలీవుడ్ ఒకప్పుడు కేంద్రంగా ఉండేది. మలయాళ చిత్రాలు వస్తున్నాయంటే అవి ద్వంద్వార్థాలు లేక బూతు చిత్రాలు అయి ఉంటాయన్న మార్కును పొందాయి. మలయాళంలోనూ గొప్ప చిత్రాలు లేవని కాదు. కానీ, షకీలా చిత్రాల ఉద్ధృతి పెరిగాక మలయాళ చిత్రాలపై ఓ ముద్ర స్పష్టంగా పడినట్లే అయ్యంది. ఒక్కొక్కసారి మలయాళంలో అగ్ర కథానాయకులే ఆమె చిత్రం విడుదలవుతుందంటే తమ చిత్రాలను వాయిదా వేసుకున్న సందర్భాలూ వున్నాయి. సెక్సప్పీల్ చిత్రాల్లో ఏముంటుంది? కెమెరా పనితనం సరిగా వుండదు. లైటింగ్ కూడా వుండదు. కానీ చూసే ప్రేక్షకుడికి మాత్రం ఏదో వున్నట్లుగానే మాయచేసే పద్ధతి ఆ కాలంలో వుండేది. కానీ ఇప్పుడలా కాదు. అంతా తేటతెల్లంగానే కనిపిస్తోంది. ఇలాంటి తరహా చిత్రాలకు ప్రస్తుతం బాలీవుడ్ కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది.
ముఖ్యంగా ఎక్కడినించో వచ్చిన పోర్న్‌స్టార్ బాలీవుడ్‌పై పగబట్టినట్లుగానే పట్టుబట్టి సినిమా అవకాశాలను సంపాదించింది. ఆమె సినిమాలంటేనే చాలు, గతంలో ఆమె పోర్న్ చిత్రాలు చూసినవారైనా సరే, ఆమె ఫీచర్ ఫిల్మ్‌ల్లో నటిస్తోందీ అంటే ఆ చిత్రాల కోసం ఆబగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇంతకూ ఈ రసాధి దేవత ఎవరూ అంటే సన్నీలియోన్. ఆమె బాలీవుడ్‌లోకి రాకముందు సినిమా చరిత్ర ఒకలావుంటే ఇప్పుడు ఆమె వచ్చాక ఒకలా మారిపోయింది. సన్నీలియోన్ మొదట్లో ఐటెం పాటలు చేసి అక్కడక్కడ మెరుపులు మెరిపించినా.. ఇప్పుడు కథానాయిక ప్రాముఖ్యత వున్న పాత్రల్లోనూ నటిస్తానంటోంది. దీంతో ఆమెకోసం అలాంటి పోర్న్ నీడలున్న కథలను బాలీవుడ్ తయారు చేస్తోంది. దీంతో బూతు చిత్రాల హవా బాలీవుడ్‌పై నల్లని మేఘంలా అలుముకుంటోంది. రెచ్చిపోతున్న శృంగార సన్నివేశాలు, ద్వంద్వార్థాలకు పెట్టని కోటలుగా మారిన ఈ చిత్రాలు రసికుల హృదయాలను దోచుకుంటున్నాయి. దానికితోడు సన్నీలియోన్‌కి వస్తున్న పేరు ప్రఖ్యాతులు, అవకాశాలు ముఖ్యంగా ధన సంపాదనలాంటి అంశాలను చూసిన బాలీవుడ్‌లో కొంతమంది తారామణులు ఆమె బాటలోనే పయనించాలని అనుకోవడం విచారకరం. అటువంటి నాయికలందరూ మొదట్లో సన్నీలియోన్‌ను వ్యతిరేకించినవాళ్లే. పోర్న్ చిత్రాలు చేసేవారికి ఇలాంటి చిత్రాల్లో అవకాశాలుండవని, ప్రేక్షకులు ఒప్పుకోరు అన్నవాళ్లే ఇప్పుడు ఆమె బాట పట్టడం మరీ విడ్డూరం. దానికితోడు ప్రేక్షకుడు ఇప్పుడు కేవలం రెండు గంటలపాటు అది ఎలాంటి వినోదమైనా సరే కావాలని కోరుకోవడంతో ఇటువంటి చిత్రాలకు బాలీవుడ్‌లో అడ్డూ ఆపూ లేకుండా పోతోంది. గొప్ప గొప్ప కళాఖండాలను సృష్టించిన బాలీవుడ్, అదే చేత్తో వికృత చిత్రాలను నిర్మించడం నిజమైన అభిమానులకు బాధాకరంగా మారింది. లవ్‌గేమ్స్, కాబరేట్, వన్ నైట్ స్టాండ్, గర్ల్‌ఫ్రెండ్, బి.పి., రాత్‌కీ రాణి, డర్టీ మ్యారేజ్, ఇన్సాఫ్ భావనాకా, ఎక్స్‌వైజెడ్, నో పార్కింగ్, పార్ట్‌టైమ్ రొమాన్స్, మస్తీ జాదే, లైలా లీలీవంటి చిత్రాలు బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒక్క సన్నీలియోన్‌తోనే ఎన్నో చిత్రాలు రూపొందిస్తున్నారు. ఆమెలాగా వాతలు పెట్టుకున్న మిగతా హీరోయిన్లతోకూడా మరికొన్ని చిత్రాల సృష్టి జరుగుతోంది. ఇవన్నీ కలిసి బాలీవుడ్‌పై ఏ ముద్ర వేయనున్నాయో వేచి చూడాల్సిందే!
--
సాధ్యమయ్యేనా...!
అసభ్యత అనైతికత, ద్వందర్థాలు, హింస, కుట్రలు, కుతంత్రాలు భారతీయ సినిమాను శాసిస్తున్న నేపథ్యంలో సెన్సార్ బోర్డును ప్రక్షాళన చేసేందుకు ప్రముఖ దర్శకుడు, సినీ మేధావి అయిన శ్యామ్‌బెనెగల్ అధ్యక్షతన నిపుణుల కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించడం శుభపరిణామం. నాలుగునెలలలో ఈ కమిటీ నివేదిక యివ్వాలని, దానికనుగుణంగా సెన్సారు నిబంధనలు, ఇండియన్ సినిమాటోగ్రఫీ చట్టాన్ని సవరించాలన్న ప్రభుత్వ శుభసంకల్పం కార్యరూపం దాల్చాలని భారతీయ సినిమా అభిమానులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. దేశాన్ని స్వచ్చ్భారత్‌గా రూపొందించడంలాగే భారతీయ సినిమాను సైతం స్వచ్ఛ సినిమాగా రూపొందించాలన్న అరుణ్‌జైట్లీ ఆశయం నెరవేరాలి. ఇటువంటి చర్యలవలన సినిమాల నాణ్యత పెరుగుతుంది. భారతీయ సినిమాలు సనాతన భారతీయ సత్సంప్రదాయాలను ప్రతిబింబించేవిగా రావాలి! సెన్సార్ బోర్డు మరింత జవాబుదారీతనంతో పనిచెయ్యాలి!

-శేఖర్