Others

తిన్నగా జైలుకి తిరిగి వచ్చేశాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరం నాది కాదు ఆకలిది అన్న సినిమా డైలా గు ఒకటి వున్నది.. దానిలో చాలా అంతరార్థం ఉన్నదీ అనుకుంటామా? ఒక్కోసారి ఆకలి నేరం చేయకుండా కూడా కాపాడవచ్చు. పోయినవారం కేరళలోని తిరువనంతపురం దగ్గరి నే్నట్టుకాల్తేరిలో వున్న ఆరుబయలు కారాగారం నుంచి ఒక ఖైదీ ‘మంటూ’ అతని నిక్‌నేమ్- అసలు పేరు అబ్దుల్ రజాక్ (32) డ్రమాటిక్‌గా పారిపోయాడు. అతను అసలు పశ్చిమ బెంగాల్‌కు చెందినవాడు. ఒక దొంగతనం కేసులో శిక్షపడగా నెమ్మదస్తుడు, మెతకమనిషి అని చెప్పి ఆరు నెలలు జైలుకు పంపించారు. అక్కడ తోట పనులే ఎక్కువ. కానీ మనవాడు ఒక మొబైల్‌తో ‘సెల్ హాండెడ్’గా దొరికిపోయాడు. నిజానికి ఇతనితోపాటు మరో ఇద్దరు సెల్ దొంగలు కూడా దొరికారు. వీళ్ళకి విచిత్రమైన శిక్ష వేశారు. రోజంతా దొరగారి బంగళా ముందు నిలువు కొలువు వేశారు. కానీ మంటు ఎలాగో మస్కాకొట్టి పారిపోయాడు. మంగళవారం ఇలా చెక్కేసిన ఖైదీ శనివారానికి మళ్లీ కేంద్రానికి అన్నమో రామచంద్రా అంటూ తిరిగొచ్చేశాడు. ఎంత గాలించినా దొరకనివాడు ఆకలికి దొరికిపోయాడు. నే్నటుకాల్తేరు ఆరుబయలు జైలు బాసులు విస్తుపోయారు. ఎక్కడ చచ్చావురా అన్నారు. మామిడికాయలు కోద్దారని పోయానన్నాడు అమాయకంగా మొహం పెట్టి. అయితే, వీణ్ణి మనం పోలీసులకు అప్పజెప్పాలి. దొంగసరుకుతో దొరికాడు. అందాకా వుండు అని చీకటి కొట్టులో పడేశారు. అక్కడైనా ఇంత ముద్ద పడేస్తారు కదా సారూ! ఓపెన్ జైలులో బందీలకి వ్యాపకం వుండాలని హెయిర్‌కటింగ్ సెలూన్‌లను ఏర్పాటుచేస్తున్నారు గవర్నమెంటువారు. కానీ రజాక్ క్రాఫింగులు చేయలేడుగా.. పాపం!

veeraji.pkm@gmail.com