Others

కనువిందు చేసే కార్టినల్ పువ్వులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాటేజ్ గార్డెన్‌కు కార్డినల్ పువ్వుల అందం వింత శోభనిస్తాయ. సింధూర పువ్వులుగా కనిపించే ఈ పుష్పాలు కిటికీల పక్కన అందంగా ఒదిగిపోతాయి. వేసవిలో వికసించే పువ్వులకు సూర్యుని వెళుతురు ఎంతో అవసరం. ఉదయం వేళ సూర్యుని వెళుతురు పడితే మొక్క బాగా పెరుగుతుంది. అమెరికా ప్రజలు దీనిని మందుగా వాడతారు. శ్వాసకోశ సమస్యలను, జలుబును దూరం చేస్తుంది. నాలుగడుగులు ఎత్తుకు మించి పెరగవు. ఇంటిముందు లాన్‌లో నడిచే చోట వీటిని పెంచుకుంటే అందంగా కనువిందు చేస్తాయి. అలాగే హేంగింగ్ బాస్కెట్స్, కంటైనర్‌లలోనూ పెంచుకోవచ్చు. సారవంతమైన నేల అవసరం. అలాగే మట్టి తేమగా ఉండాలి. నాటడానికి ముందు నేలలో సేంద్రీయ పదార్థాలు చల్లితే బాగుంటుంది. పచ్చటి పచ్చిక ఉన్నచోట మొక్కలను నాటితే అక్కడ అందంగా కనిపిస్తాయ. ఈ పూలు అందంగా విరగబూస్తే సీతాకోకచిలుకులు, పక్షులు, తేనెటీగలు తదితరమైనవి వచ్చి సందడి చేస్తాయి. ఈ పువ్వులు పెరగటానికి 18 నుంచి 24 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటే చాలు. విత్తనాలను లోతుగా నాటనక్కర్లేదు. నాటిన తరువాత నీరు పోస్తుండాలి. విత్తనాలు మొలకెత్తటానికి అనువుగా తక్కువ మట్టిలో నాటితే బాగుంటుంది. కుండలలో తదితరవాటిల్లో నాటితే త్వరగా మొలకెత్తవు. ఎందుకంటే సూర్యని కిరణాలు సోకితే త్వరగా పెరిగి మన ముంగిట పరిమళాలు విరజిమ్ముతాయి.