AADIVAVRAM - Others

కక్కరా... కో (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివయ్యకు ఎప్పటి నుంచో కోడిని పెంచుకోవాలన్న కోరిక ఉండేది. ఎట్టకేలకు ఒక రోజు పుంజు పిల్లని కొని పెంచుకోసాగాడు. మరి కొన్ని రోజులకు శివయ్యతో పక్కింటి కనకయ్య ‘శివయ్యా! పుంజు పిల్లకు తోడుగా పెట్ట పిల్లని కొన్నావంటే ఒకదానికొకటి తోడుగా ఉంటాయ’ని ఉచిత సలహా పారేశాడు. దాంతో శివయ్య సంతకి వెళ్లి ఒక పెట్ట పిల్లని కొనుక్కొచ్చాడు.
కొంతకాలానికే పుంజు, పెట్ట మంచి స్నేహితులై పోయాయి. ఒకదాన్ని వీడి మరొకటి ఉండలేని పరిస్థితికి వచ్చాయి.
తిండిగింజల కోసం వెళ్తే రెండూ కలిసే వెళ్లేవి. కొన్నాళ్లకి పెట్ట బలంగా తయారైంది. దీంతో శివయ్యకి దాన్ని కూర చేసుకొని తినాలన్న ఆశ కలిగింది. ఎప్పుడు పెట్టని ముట్టుకుందామన్నా పుంజు కోపంగా మీదికి వచ్చేది. ఇక ఇలా కాదని.. పుంజు బయటికి వెళ్లిన సమయంలో చాటుగా పెట్టని మట్టుపెట్టి.. కూర వండించుకొని తృప్తిగా భోజనం చేసి విశ్రాంతి తీసుకోసాగాడు.
పుంజు ఆహారం కోసం బయటికి వెళ్లి తిరిగి వచ్చింది. పెట్ట కనిపించకపోవడంతో అటూ ఇటూ ఆందోళనగా తిరిగింది. శివయ్యనే పెట్టని ఏదో చేసి ఉంటాడని భావించింది పుంజు.
దాంతో - పుంజు ఒక్క ఉదుటున గాల్లో కెగిరి తన బలమైన కాళ్లతో శివయ్యను తన్నడంతో అతను చివాలున పైకి లేచి.. పుంజును చూశాడు. చింతనిప్పుల్లా ఉన్నాయి దాని కళ్లు. కోపంతో ఊగిపోతోంది.
‘నా పెట్టని ఏం చేశావ్?’ అని గర్జించినట్టుగా ప్రశ్నించింది శివయ్యను.
‘నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు’ అన్నాడు శివయ్య.
శివయ్యకు కోపం నషాళానికంటింది. అంతే కాలితో ఒక్క తన్ను తన్నాడు పుంజుని. ఎగిరి దూరంగా పడిందది.
‘ఏం చేస్తావ్ నువ్వు? నేనే పెట్టని తినేశాను. నీ దిక్కున్న చోట చెప్పుకో’ అంటూ కోపంతో నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు శివయ్య.
అంతే! ఒక్కసారిగా లేని శక్తిని కూడకట్టుకున్నట్టుగా పుంజు తన రెక్కలు విదిల్చి గాల్లోకి ఎగురుతూ, తన వాడైన కాలి గోళ్లతో గుచ్చుతూ శివయ్యను తంతూ ‘కక్కరా..’ అంటూ ఎగిరెగిరి తంతోంది.
శరీరంలో ఓపికున్నంత వరకు శివయ్యను ఊపిరాడకుండా తన వాడైన ముక్కుతో కళ్లల్లో పొడిచి, పొడిచి ‘కక్కరా.. కోడి’ అంటూ ఆక్రోశంగా అరుస్తూ శివయ్య చనిపోయాడని నిర్ధారించుకున్నాక అక్కడ నుండి వెళ్లిపోయింది కోడిపుంజు.
అప్పటి నుండి పుంజుకు తన పెట్ట గుర్తొచ్చినప్పుడల్లా ‘కక్కరా.. కోడి’ అంటూ అరుస్తూనే ఉండేది. రాన్రాను ‘కక్కరా.. కోడి’ అనే కోడిపుంజు అరుపు ‘కక్కరో..కో’ అనే కూతగా మారిందని అంటారు.

-జడపల్లె మాధవాస్సుధ