AADIVAVRAM - Others

రామాయణం.. మీరే డిటెక్టివ్ 32

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆశే్లష వెళ్లిన రెండు నిమిషాలకి హరికథ మొదలైంది. హరిదాసు ఇలా చెప్పాడు.
పౌరులంతా వెళ్లాక దశరథుడు తన మంత్రులతో ఆలోచించి మర్నాడు పుష్యమీ నక్షత్రం రోజు రాముడికి పట్ట్భాషేకం చేయాలని నిశ్చయించాడు. అక్కడ నించి తన అంతఃపురానికి రాముడ్ని తీసుకురమ్మని మంత్రులని పంపాడు.
మంత్రుల రాక గురించి ద్వారపాలకులు చెప్పగానే రాముడికి మనసులో అనుమానం కలిగింది. వారిని లోపలికి రప్పించాడు.
‘దశరథ మహారాజు నిన్ను మళ్లీ చూడాలని అనుకుంటున్నాడు. రావాలా, వద్దా అన్నది నువ్వే నిర్ణయించుకోవాలి’ వారు చెప్పారు.
వెంటనే రాముడు తన తండ్రి దగ్గరికి వెళ్లి దూరం నించే ఆయనకి నమస్కరించాడు. దశరథుడు రాముడ్ని కౌగిలించుకుని, తన పక్కన కూర్చోబెట్టుకుని ఇలా చెప్పాడు.
‘రామా! అధిక ఆయుష్షు కల నేను వృద్ధుడ్ని అయ్యాను. ఇంతదాకా నేను ఇష్టమైన భోగాలని అనుభవించాను. అన్నదానాన్ని చేశాను. భూరి దక్షిణలు ఇచ్చే వందలాది యజ్ఞాలు చేశాను. క్షత్రియ ధర్మాలైన అధ్యయన, వ్యజన దానాలని చేశాను. యజ్ఞాలు చేసి దేవతా రుణాన్ని, స్వాధ్యాయనంతో ఋషి ఋణాన్ని, సంతానాన్ని కని పితృ ఋణాన్ని, దానాలతో బ్రాహ్మణ ఋణాలని తీర్చాను. కొడుకైన నీకు రాజ్యాభిషేకం చేయడం తప్ప నాకు ఏదీ మిగిలి లేదు. ప్రజలంతా నువ్వు రాజవ్వాలని కోరుతున్నారు. కాబట్టి నీకు పట్ట్భాషేకం చేస్తాను. నేనీ రోజు చెడ్డ కలలని కన్నాను. వాటిలో పిడుగులతో, గొప్ప శబ్దాలతో పగలే ఉల్కలు పడ్డాయి. నా జన్మ నక్షత్రాలని చెడు గ్రహాలైన రవి, కుజులు ఆక్రమించారు అని పెద్దలు చెప్తున్నారు. ఇది ఘోర ఆపదని కలిగిస్తుంది. నా మనసు మారక మునుపే నువ్వు రాజ్యాధికారాన్ని చేపట్టు. ఈ రోజు చంద్రుడు పునర్వసు నక్షత్రంలో ఉండి రేపు పుష్యమి నక్షత్రంలో కలిసాక నీకు పట్ట్భాషేకం చేయాలని దైవజ్ఞులు చెప్పారు. అందువల్ల నువ్వు నీ భార్యతో కలిసి ఉపవాసం చేస్తూ ఈ రాత్రంతా దర్భాసనం మీద పడుకోవాలి. ఇలాంటి పనులకి సాధారణంగా అనేక విఘ్నాలు కలుగుతూంటాయి. అందువల్ల నీ మిత్రులంతా నిన్ను జాగ్రత్తగా రక్షించాలి. భరతుడు దయ, ధర్మం, ఇంద్రియ నిగ్రహం కలిగి మంచి వాళ్ల మార్గంలో నడుస్తాడు అన్నది నిజం. కాని ధర్మంగా సన్మార్గంలోని మనుషుల మనసులు కూడా చంచలం కావచ్చు’
తండ్రి నించి సెలవు తీసుకుని రాముడు సరాసరి తల్లి అంతఃపురానికి వెళ్లాడు. ఆ సమయంలో కౌసల్య పట్టు వస్త్రాల్లో పూజాగృహంలో వౌనంగా లక్ష్మీదేవిని ప్రార్థించడం రాముడు చూశాడు. అప్పటికే రామ పట్ట్భాషేక సమాచారం తెలుసుకుని అక్కడికి వచ్చిన సుమిత్ర, లక్ష్మణులు సీతని కూడా రప్పించారు. కౌసల్య కళ్లు మూసుకుని ధ్యానం చేస్తూండటంతో వారంతా వేచి ఉన్నారు. పుష్యమీ నక్షత్రంలో తన కొడుక్కి రాజ్యాభిషేకం జరుగుతుందని తెలిసిన కౌసల్య ప్రాణాయామం చేసి విష్ణువుని ధ్యానించసాగింది. ఆమె కళ్లు తెరిచాక రాముడు తల్లికి నమస్కరించి చెప్పాడు.
‘అమ్మా! నాన్నగారు నన్ను రాజ్యపాలనకి నియమించారు. ఆ ప్రకారం రేపు నాకు పట్ట్భాషేకం జరుగుతుంది. నన్ను, సీతని ఈ రాత్రంతా ఉపవాసం ఉండమని ఋత్విక్కులు, నాన్నగారు చెప్పారు. రేపు జరిగే ఆ కార్యక్రమానికి సంబంధించిన మంగళకరమైనవన్నీ నాకు, సీతకి జరిపించు’
ఆ శుభవార్త విన్న కౌసల్య ఆనందభాష్పాలతో ఇలా చెప్పింది.
‘నాయనా రామా! చిరకాలం జీవించు. నీ శత్రువులు నశింతురు గాక! ఐశ్వర్యంతో నా జ్ఞాతులకి, సుమిత్ర జ్ఞాతులకి ఆనందం కలిగేలా చేయి. నువ్వు పుట్టిన నక్షత్రం మంగళకరమైంది. అందుకే దశరథ మహారాజుని నీ సద్గుణాలతో ఆకట్టుకున్నావు. పుండరీకాక్షుడైన మహావిష్ణువుకి నేను చేసిన ఆరాధన ఫలవంతమై నిన్ను ఇక్ష్వాకు వంశీయుల రాజ్యలక్ష్మి ఆశ్రయిస్తోంది.’
రాముడు నమ్రతగా కూర్చున్న లక్ష్మణుడ్ని చూసి చిరునవ్వుతో ఇలా చెప్పాడు.
‘లక్ష్మణా! నాతో కలిసి నువ్వు కూడా ఈ భూమిని పరిపాలించు. నా రెండో ప్రాణమైన నిన్ను కూడా రాజ్యలక్ష్మి వరించింది. నీకు ఇష్టమైన భోగాలని, రాజ్యఫలాలని అనుభవించు. నేనీ జీవితాన్ని, రాజ్యాన్ని నీ కోసం మాత్రమే కోరుకున్నాను’
తర్వాత ఇద్దరు తల్లులకి నమస్కరించి రాముడు సీతతో తన ఇంటికి వెళ్లాడు. (అయోధ్య కాండ సర్గ-4)
ఆశే్లష హరికథ విని బయటకి వస్తూండగా నుదుట నిలువు నామాలు, పంచె, లాల్చీ, ఉత్తరీయం వేసుకున్న ఓ వృద్ధుడు ఎదురుపడి నవ్వుతూ ఆశే్లషని అడిగాడు.
‘నేను ఈ రోజు రావడం ఆలస్యమైంది. ఇవ్వాళ చెప్పిన కథ చెప్పవా?’
ఆశే్లష తను విన్న రామాయణ కథని చెప్పాక ఆయన చెప్పాడు.
‘బాబూ! నువ్వు చెప్పిన కథలో ఐదు తప్పులు ఉన్నాయి. అవేవిటో చెప్తా విను’

**
మీకో ప్రశ్న
*
అయోధ్య కాండలో మొత్తం
ఎన్ని సర్గలు ఉన్నాయి?

**
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు
*
ఆంధ్రా వాల్మీకి అనే పేరు ఎవరికి, ఎందుకు వచ్చింది?
వావికొలను సుబ్బారావు గారికి. ఆయన వాల్మీకి రామాయణాన్ని తొలుత తెలుగులో రచించారు. కాబట్టి ఆ బిరుదు ఆయనకి వచ్చింది. (ఊరూరా తిరిగి భిక్షమెత్తి ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి ఆలయ పునరుద్ధరణ కూడా చేసారు.)
*
కిందటి వారం ప్రశ్నలకు జవాబులు
1.చైత్రమాసం అని వాల్మీకి రాసాడు. కాని హరిదాసు మార్గశిర మాసం అని తప్పు చెప్పాడు.
2.దశరథుడు అందుకు తగ్గ ఏర్పాట్లు చేయమని వశిష్ఠుడిని ఆదేశించాడు. తర్వాత అధికారులని ఆదేశించాడు. కాని హరిదాసు వశిష్ఠుడ్ని ఆదేశించిన సంగతి చెప్పలేదు.
3.బంగారు కొమ్ముల తొడుగు గల ఎద్దు అని దశరథుడు చెప్తే, హరిదాసు తప్పుగా ‘ఎద్దు’ అని మాత్రమే చెప్పాడు.
4.రాజప్రాసాదంలోని రెండో కక్షకి రప్పించండి అని హరిదాసు చెప్పడం విస్మరించాడు. (వారి అర్హతల్ని బట్టి సందర్శకులు కొన్ని కక్షల దాకానే వెళ్తారు)
5.రథం దిగి సుమంత్రుడి వెంట రాముడు వచ్చాడు. కాని హరిదాసు రాముడు ఒంటరిగా వచ్చినట్లుగా చెప్పాడు.
6.‘ఇందీవర శ్యాముడు’, శృతసంహారకుడు ఐన రాముడి అని వాల్మీకి రాశాడు. కాని హరిదాసు ఇందీవర శ్యాముడు అని చెప్పడం విస్మరించాడు.
7.పౌరులంతా రాజు మాటలని విని, సంతోషించి, ఆయన దగ్గర సెలవు తీసుకుని తమ ఇళ్లకి వెళ్లి దేవతలని పూజించారు అన్నది ఈ సర్గలోని ఆఖరి శ్లోక తాత్పర్యం. దాన్ని హరిదాసు చెప్పలేదు.

మల్లాది వెంకట కృష్ణమూర్తి