Others

కర్మయోగి గాడ్గె మహారాజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క ష్టాలు తర్వాత సుఖాలు, సుఖాల తరువాత కష్టాలు ఒక చక్రంలాగా దొర్లుతుంటాయి. కుంతీదేవి ఒకసారి కృష్ణుని ‘కృష్ణా! నాకెప్పుడు కష్టాలనే ప్రసాదించు . ఆ వంకతోనైనా నిన్ను సదా స్మరించే భాగ్యం కలుగుతుంది’ అనిప్రార్థించిందట. అట్లా కొన్ని కష్టాలు తెలియకుండానే ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగు పెట్టేలా చేసి భగవంతునికి మారుపేరుగా మారడానికి అవకాశానిస్తాయి అనడానికి మహారాష్ట్ర ప్రాంతంలోని అమరావతి జిల్లాలోని ఓ గ్రామంలోని సక్కుబాయి,జింగరాజ్ దంపతులకు పుట్టిన బిడ్డ తార్కాణంగా కనిపిస్తాడు ఈ దంపతులకు లేక లేక ఒక మగపిల్లవాడు కలిగాడు. ఆ బిడ్డకు దేబూజీ అని పేరుపెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకునేవారు. వీరు అతి దారిద్య్రంతో బాధపడేవారు. పైగా జింగరాజ్‌కు తాగుడు అనే వ్యసనం కూడా ఉండేది. ఈ దేబూజీ చిన్ననాటనే జింగరాజ్ తన తాగుడనే వ్యసనం వలన మరణానికి చేరువ అయ్యాడు.
కుటుంబ పోషణనిమిత్తం సక్కుబాయి తన తల్లి దగ్గరకు చేరింది. కుటుంబజీవనంకోసం దేబూజీ చదువుకోవడానికి కాక పశువులు కాయడానికి కుదురుకున్నాడు. అలా పశువులు కాచి అలసిపోయిన దేబూజీ ని తన దగ్గర కూచోబెట్టుకుని వారి అమ్మమ్మ భజన గీతాలు పాడి వినిపించేది. తాను విసురురాయితో పనిచేసుకుంటూ దేవునిపై చక్కని పాటలు పాడేది. అవి వింటూ వింటూ దేబూజీ కూడా ఆ భజన పాటలను కంఠస్తం చేసుకున్నాడు. వాటినే తాను పశువులు కాస్తూ తన తోటివారికి వినిపించేవాడు. పశువులను తోలుకుని ఇంటికి వచ్చేటపుడు కూడా ఈ భజన పాటలను పాడుతుండేవాడు. 15 ఏళ్లు రాగానే దేబూజీ మంచి మర్యాద చూసి తమ పిల్లనిచ్చి వివాహం చేస్తామని ఓమధ్యతరగతి కుటుంబపు పెద్ద దేబూజీ అమ్మను అడిగారు. అంతకన్నా భాగ్యమేముందని దేబూజీ అమ్మ తన కోడలికి ఆహ్వానం పలికింది. అట్లా దేబూజీ కుందాబాయి అనే యువతిని పెండ్లి చేసుకొని గృహస్థు అయ్యాడు. కాని అనారోగ్యాల వల్ల దేబూజీ వాళ్ల మామగారు కూడా కొద్దికాలానికే మరణించారు.
అంతలో దేబూజీకి ముగ్గురు పిల్లలు పుట్టారు. వారిని పెద్దవారిని చేస్తూనే ఈ జననాలు, మరణాలు ఏమిటని దేబూజీ ఆలోచన సాగించేవాడు. కొంతకాలం తరువాత ఉన్నట్టుండి ఈ సంసారం సాగరం దీన్ని ఈదుదామని ఎంత సంపాదిస్తున్నా దానికి అంతు ఉండదు. ఒకదాని తరువాత మరొకటి కావాలనే అనిపిస్తుంది. ఈ సంసారలంపటం వదిలించుకోకుంటే భగవంతుని సన్నిధి దొరకదు. అని అనుకొన్న దేబూజీ తనకొచ్చిన పాటలతో, తాను నివసించే గ్రామంలో వారికి దేవుని భజన చేయండి ముక్తి పొందండి అనే ప్రచారం చేయడం మొదలెట్టాడు. అప్పటి కాలంలో దాపురించే ఎన్నోరోగాలను చూచి దానికంతా కారణం పరిశుభ్రత లేకపోవడమని తలచి వెంటనే తన భజన సంగీతంలో పరిశుభ్రత ఎంత ముఖ్యమో చెప్పసాగాడు. కేవలం అట్లా చెప్పడమే కాక తానే చీపురు పట్టి గ్రామంలోని దారులన్నీ తుడిచేవాడు. ఆ తరువాత తరువాత పేదరిక నిర్మూలనకు, పనే దేవుడని మానవులంతా పని చేయాలని, పని చేసింనందు వల్ల అటు ఆరోగ్యమూ , సంపద రెండూ వస్తాయని ప్రచారం చేస్తూ భజన గీతాలు పాడేవాడు. ఇట్లా పూర్తిగా సంసారాన్ని వదిలివేసి గ్రామ గ్రామంలో తిరుగుతూ జనులందరికీ పరిశుభ్రత గురించి, పనిచేయడంలోని ఆనందాన్ని గురించి వివరిస్తూతాను పని చేసినందువల్ల వచ్చిన డబ్బును ముసలివారికి, అవయవలోపమున్నవారికి దానం చేసేవాడు. వారిని కంటికి రెప్పలా చూచుకోవడం సమాజంలో నివసించే వారందరి బాధ్యత అని దేబూజీ చెప్పేవాడు. వ్యసనాల బారిన పడి అమూల్యంగా దొరికి మానవ జన్మను వృథా చేసుకోరాదని కూడా దేబూజీ ప్రచారం చేసేవారు. దేబూజీ చెప్పే హితవచనాలను యువతను ఆకర్షించేవి. వారందరూ కూడా దేబూజీ చెప్పినట్టు వింటూ అటు భజన గీతాల పట్ల ఆకర్షణను , ఇటు సామాజిక సేవ పట్ల ఆకర్షణను పెంచుకుంటూ దేబూజీ అనుయాయులుగా మారారు. అట్లా దేబూజీ తన జీవిత పర్యంతమూ నిష్కామంగా గ్రామసేవ చేసారు. ఇప్పటికీ కూడా దేబూజీ శిష్యులైనవారు గ్రామోద్దరణను వారి కర్తవ్యంగా భావించి చేస్తుంటారు. ఇట్లాంటి దే బూజీని నిష్కార కర్మయోగిగా అంద రూ భావించారు. ప్రజాహిత కార్యక్రమాల్లో అవిశ్రాంత కృషి చేస్తున్న దేబూజీని ప్రజలు గాడ్గే మహరాజ్‌గా వ్యవహరించసాగారు. నిరాడంబరంగా
జీవించి నిజమైన నిస్వార్ధ కర్మయోగిగా 1956 డిసెంబర్ 20వ తేదీ తనువు చాలించారు.

- జి. కల్యాణి