Others

నాకు నచ్చిన పాట ... మానస వీణ మధుగీతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవతా ఆర్ట్స్ పతాకంపై ఎన్.కృష్ణంరాజు నిర్మించిన ‘పంతులమ్మ’ చిత్రంలోని ‘మానస వీణా మధుగీతం/ మన సంసారం సంగీతం/ సాగర మథనం/ అమృత మధురం/ సంగమ సరిగమ స్వర పారిజాతం’ పాట నాకు చాలా ఇష్టం. ఈ పాట వినేకొద్దీ మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. బహుశ ఈ పాటను ఇష్టపడని వాళ్లు ఉండరేమో. వేటూరి రాసిన ఈ పాటకు సంగీతద్వయం రాజన్- నాగేంద్ర అద్భుతమైన బాణీ అందించారు. బాలు- సుశీల తమ గాత్రాలతో శ్రోతలను మైమరిపించారు. భార్యాభర్తల అన్యోన్య దాంపత్యానికి సంబంధించిన ఈ పాటను కళాకారులు అందరూ ఎవరికివారు పోటీపడి చిరస్థాయిగా నిలిచేలా తీర్చిదిద్దారు. ‘కానుకలేమి నేనివ్వగలను/ కన్నుల కాటుక నేనవ్వగలను’, ‘శతవసంతాల దశ దిశాంతాల సుమ సుగంధాల భ్రమరనాథాల కుసుమించు నీ అందమె విరిసింది అరవిందమే, కురిసింది మకరందమై’ అంటూ బాలు మధురమైన కంచుకంఠంలో పాట వింటున్నపుడు కలిగే ఆనందాన్ని మాటల్లో ఎలా చెప్పగలం. సింగితం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన పంతులమ్మ సినిమాలో అన్ని పాటలూ బాగుంటాయి. ముఖ్యంగా ఈ పాట మరీను. ఈ పాట చిత్రీకరణలో వైవిధ్యం చూపారు. రంగనాథ్, దీప సహజమైన నటన ప్రదర్శించారు. వాళ్ల సంసారంలో సంగీతం నిజంగానే మానసవీణ మీద మధుగీతం వింటున్నట్టు అనిపిస్తుంది. గొప్ప పాట, అంతకంటే ఏం చెప్పలేం.
-జి.గౌరీ గాయత్రి, ఉప్పల్