Others

అవార్డు తెచ్చిన సంబరం ( శరత్కాలం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినిమా రంగ చరిత్రలో జగపతి సంస్థకు ఒక ప్రత్యేకత వుంది. ఆ సంస్థ నిర్మించిన చిత్రాల నామకరణం నుంచి ఒక విశిష్టత వుంది. ప్రారంభ చిత్రం అన్నపూర్ణనుంచి అరడజను చిత్రాలవరకు దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణులు నిర్ణయంలో మార్పు లేకుండా కొనసాగింది. చిత్రాల నామకరణ విషయంలో కూడా అ.. ఆలతోనే కొనసాగింది. అది ఎలా అంటే ప్రారంభ చిత్రం అన్నపూర్ణ. రెండవ చిత్రం ఆరాధన. ఆ తర్వాత అంతస్తులు, తరువాత వరుసగా ఆత్మబలం, అదృష్టవంతులు చిత్రాల నామకరణం ‘అ.. ఆ’లతోనే కొనసాగటమే కాకుండా ఈ ఆరు చిత్రాలను వి మధుసూదనరావు దర్శకత్వం వహించటం ఒక క్రమశిక్షణగల రికార్డుకు నిదర్శనం. ఈ చిత్రాలకు దర్శకత్వ శాఖలో సహాయకులుగా పనిచేసిన పి.చంద్రశేఖర్‌రెడ్డి, ఎన్.గోపాలకృష్ణ లాంటివారు ఆ తర్వాత కాలంలో దర్శకులుగా పలు విజయవంతమైన చిత్రాలకు పనిచేశారు. జగపతి సంస్థలో శిక్షణ పొందామని ఆనాటి సాంకేతిక నిపుణులు గర్వంగా చెప్పుకునేవారు. ఈ సంస్థ నిర్మించిన అంతస్తులు చిత్రం ద్వారా భానుమతికి నటిగా జాతీయస్థాయిలో అవార్డు లభించింది. ఈ శుభ సమయాన్ని పురస్కరించుకుని జగపతి యూనిట్ సమావేశమై భానుమతిని అభినందిస్తూ ఇంట్లో పండుగలాగా జరుపుకొన్నారు. ఆ సందర్భంలో తీసుకొన్న ఈ అరుదైన ఫొటోలో అవార్డు గ్రహీత భానుమతితోపాటు హీరో అక్కినేని నాగేశ్వరరావు, నిర్మాత రాజేంద్రప్రసాద్, దర్శకుడు వి.మధుసూదనరావు, సహకార దర్శకులుగా పనిచేసిన పి.చంద్రశేఖర్‌రెడ్డి, ఎన్.గోపాలకృష్ణ గార్లతో పాటు ఇతర సాంకేతిక నిపుణులను కూడా పై చిత్రంలో చూడవచ్చు. పండగలంటే ప్రత్యేకంగా వచ్చేవే కానక్కరలేదు. కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక శుభకార్యం దృష్టిలో పెట్టుకుని కలిసి సంతోషంగా జరుపుకోవటం కూడా పండగలా భావించవచ్చు. ఇది ఒకనాటి సంబరాల మాట. ఇవ్వాళ అంతా యాంత్రికంగా జరుపుకుంటున్నారు. అలనాటి సంతోష సంబరాలు మచ్చుకైనా కనపడకపోవడం నిజంగా విచారించదగ్గ విషయం.

-పర్చా శరత్‌కుమార్ 9849601717