Others

ఆకులు అలములు తిని బ్రతికాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రతికుంటే బలుసాకు తినవచ్చు అన్నాడు పంచతంత్ర బ్రహ్మ- అలాగా, పాకిస్తాన్‌కు చెందిన ఓ పెద్దమనిషి గత పాతిక సంవత్సరాలుగా కేవలం ఆకులు అలములు, చెట్ల బెరడు, చెట్ల కొమ్మలు వగైరా తిని హాయిగా నాకింక స్వేచ్ఛగా అంటూ బ్రతికేస్తున్నాడు. మొహమూద్ బట్ అతగాడి పేరు. ఈ మొహమూద్ చెప్పాడు, ‘‘మేము చచ్చేటంత పేదవాళ్ళం.. రోడ్డున పడి అడుక్కుతినడం ఇష్టంలేదు.. అంతకన్నా అడవిలో పడి పచ్చి కొమ్మలు తిని బ్రతుకు లాగించడం మంచిది అనుకొని అరణ్యమార్గం పట్టిన ఈ బట్‌కి ఇంతవరకు జలుబు కూడా చేయలేదు. పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రం గుజ్రవాలా జిల్లాకి చెందిన ఈ బట్- పాతిక ఏళ్ళక్రితం నుంచి తాజా మర్రి, జుర్రి లాంటి చెట్ల కొమ్మలు విరుచుకుని ఖుషీ ఖుషీగా ఆరగిస్తున్నాడు. నాకు డాక్టరు అన్న మాటకి అర్థమే తెలియదు’’ అంటున్నాడు తన 53వ ఏట. తన గ్రామం చేరుకున్నాడు. గాడిదలు లాగే సరుకుల బండి ఒకటి సంపాదించాడు. సరుకులు వేసుకుని అటు ఇటూ వాటిని చేరవేస్తూ బ్రతుకు బండీ లాగిస్తున్నాడు. అతని పొరుగున వున్న గులాం మహమ్మద్ చెప్పాడు- ‘‘అతను అన్నం తినగా మేము చూడలేదు.. రోడ్డుమీద బండి లాగించుకుంటూ పోతూ మధ్యలో పచ్చని చెట్లు కానవచ్చిందో బండి ఆపి కొమ్మలు విరుచుకుని తినుకుంటూ’’ పోతాడు.
ఇది ఇలా వుందా? ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఓ వృద్ధురాలు వుంది, ఆమె పేరు కుసుమవతి కాని సుకుమారి కాదు. ‘‘గడచిన 63 సంవత్సరాలనుంచి ఇసుక తిని హ్యాపీగా బ్రతికేస్తున్నాను’’ అన్నది.
‘‘పదిహేనవ ఏట మొదలెట్టా ఇలా ఇసుక భుజించడం! ఇప్పుడు నా వయసు ఎనభై మూడు. ఇంతదాకా ఆసుపత్రికి పోలేదు..’’ అంటున్నది ఆమె. ఏమిటో చిత్రం కదా? ఇసుక, ఆకులు కొమ్మలు తిని మనిషి బ్రతికేయగలిగితే తిండి సమస్యయే వుండదు కదా? అయితే, జిహ్వచాపల్యం మాటేమిటి?

veeraji.pkm@gmail.com