Others

బురఖా ధరించి బాక్సింగ్ పోటీకి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాక్సింగ్ పోటీలకు ఆడ అయినా మగ అయినా ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో? అందరికీ తెలుసు. అక్కడ బురఖాలు హిజాబ్‌లు ధరించి రింగులోకి దూకుతామంటే రూల్స్ ఒప్పుకోవ్! కాని, కాని అమెరికన్ మిన్నోసోటకి చెందిన ముస్లిం (16) బాలిక యొక్క మతం మాత్రం జేర్సీలు పొట్టిలాగులు అవీ ధరిస్తే ఒప్పుకోదు. అవ్వా కావాలి బువ్వా కావాలి అంటే కుదరదు అన్నారు అధికారులు. కోర్టుని శరణుజొచ్చింది. రెండేళ్ళు రింగులో బాక్సింగ్‌కి బదులు కోర్టులో పోరాడి నెగ్గింది అమియా జాఫ్ఫార్. హిజాబ్ వేసుకోవచ్చును, శరీరమంతా నిండుగా కప్పుకొనే దుస్తులు ధరించి గ్లోవ్స్ తొడుక్కుని ప్రత్యర్థిమీదకి లంఘించవచ్చును అన్నారు కోర్టువారు. ఇది అమెరికన్ కోర్టులు సృష్టించిన చరిత్ర అన్నారు. ఈ బాక్సింగ్ పాపా వాళ్ళ అమ్మా, కోచ్ నతాలియ హైలీ అన్నారు. నేను ..... ప్రపంచ బాక్సింగ్ పోటీలలో నా సత్తా చాటాలని అనుకుంటున్నాను. ఇక్కడ పోటీలలో ఫుల్ బురఖా డ్రెస్సులో పోటీలలో గెలిచాకా ప్రపంచ సంస్థకి విజ్ఞప్తులు పెట్టుకొని అక్కడ కూడా అల్లాహ్ దయతో గెలుస్తానంటున్నాది ఈ అమెరికన్ ముస్లిం యువతి. సరిగ్గా అవసరమైన బరువు, ఐదు అడుగుల ఒక్క అంగుళం వున్న ఈ అమ్మాయి ఏప్రిల్ ..... పుట్టింది. ఈ కోర్టు తీర్పు ఒక రకంగా పుట్టినరోజుకి అల్లాహ్ ఇచ్చిన కానుక అన్నది సారా ఒకీఫి అంటే వాళ్ళ అమ్మ. మొత్తంమీద సర్దార్జిలు టర్బన్‌లు, ముస్లిమ్ లేడీస్ హిజాబ్‌లు ఒగ్గరు కదా?

-వీరాజీ