Others

పిల్లో కవర్స్‌తో గ్రాండ్ లుక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోజూ ఇల్లు ఒకేలా వుంటే బోర్‌గా వుంటుంది. మార్పు తేవాలంటే బెడ్‌షీట్స్, పిల్లో కవర్స్, సోఫా కవర్స్- ఇలాంటివి మార్చుతూ వుండాలి. పిల్లో కవర్స్‌ను వాడుతున్నపుడు వెన్ను భాగానికి సపోర్టుగా మృదువైన కవర్స్‌నే ఎంచుకోవాలి. మల్టిపుల్ కలర్స్‌లో కవర్స్ మార్కెట్‌లో లభిస్తాయి. రంగులు వెలసిపోవడంగానీ, బిగుసుకుపోవడంగానీ జరగవచ్చు. కవర్స్ ఎంపికలో మాట్రెస్ సైజ్‌ను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. పిల్లో కవర్స్ కోసం ఒకే రంగును ఎంచుకోకూడదు. పిల్లో కవర్స్‌ను కేవలం రంగు గురించే కాకుండా, వాటిమీదున్న ఆర్ట్, అల్లికలు, వాటి నాణ్యతను పరిగణనలోకి తీసుకోవాలి. పిల్లో కవర్స్ కోసమై తయారయ్యే ఫ్యాబ్రిక్ కాటన్, పాలియెస్టర్, చెనైల్, యాక్రిలిక్ వూల్ వీటిలో ఏమైనా ఎంచుకోవచ్చు. డ్రాయింగ్ లివింగ్, డైనింగ్ రూముల్లో ఎక్కడైనా పిల్లో కవర్స్ గొప్ప శోభనిస్తాయి. చెయిర్స్ అయినా, సోఫాలైనా చాలా సౌకర్యవంతంగా, విలాసవంతంగా ఉండడానికి నాణ్యమైన పిల్లో కవర్స్ చాలా అవసరం. ఇంటీరియర్ ఫర్నిషింగ్స్‌లతో మ్యాచ్ అయ్యే రంగుల్నే పిల్లో కవర్స్ ఉండేలా చూసుకుంటే ఆ గది ఉత్తేజభరితంగా ఉంటుంది. పిల్లో కవర్స్‌ని ఎప్పుడు కాటన్, లైనెన్, శాటిన్, వెల్వెట్‌లలో తీసుకోవడం మేలు. చాలా బ్రైట్‌గావుండే పాత సిల్క్ లేదా హ్యాండ్లూమ్ చీరలను కవర్స్‌గా ఉపయోగిస్తే లివింగ్ రూమ్ అందం రెట్టింపు అవుతుంది. లోపల కాటన్ క్లాత్ ఉపయోగించి కుట్టిస్తే చాలా ఎట్రాక్టివ్‌గా కనిపిస్తాయి.

- తరిగొప్పుల విల్లెన్ మూర్తి