Others

మాంసాహారం లేదా? పిల్ల కూడా వద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యోగిగారి ఉత్తరప్రదేశ్‌లో చాలా కబేళాలు బంద్ ఐపోయాయి. పెళ్లిళ్లల్లో కూడా మాంసాహారం వడ్డించలేకపోతున్నారు. ముజాఫ్పర్ నగర్ జిల్లాకి చెందిన కుల్హాది గ్రామంలో నగమా - రిజ్వాన్‌ల నిఖా చివరి క్షణాల్లో చిక్కుల్లో పడ్డది. పెళ్లి విందులో శాకాహారం మాత్రం వడ్డించారు- బర్రె పోనీ మేక.. అదీ లేదు.. కోడి మాంసమైనా విస్తట్లో వడ్డించకుండా షహనారుూ మ్రోగడమా? పెళ్లికొడుకు పువ్వుల పాగా తీసి నేలకేసి కొట్టాడు. పంచాయితీ నాయకులు వచ్చారు.
‘‘అస్సలు మాంసాహారం దొరకడంలేదు. బర్రె మాంసం కిలో నూట యాభై రూపాయలుండేది. నాలుగొందలు పెట్టినా దొరకడంలేదు. ఏ మాంసం అయినా 350 నుంచి ఆరు వందల రూపాయలకు చేరుకుంది’’ అని ఆడ పెళ్లివారు గోల పెట్టారు. కోడికి కూడా గతి లేదా? అంటూ ఈసడించాడు వరుడు రిజ్వాన్.
పదకొండు మార్చిన యోగి హయాం వచ్చింది. అక్రమ కబేళాలు దుకాణాలు బంద్!
ఈ పెళ్లికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. పంచాయత్ నాయకులు తంటాలు పడుతున్నారు. ఈలోగా పెళ్లికూతురికి కోపం దుఃఖం వొళ్లు మంటా అన్నీ ఒకేసారి వచ్చేశాయి. ‘‘ఈ పెళ్లికొడుక్కి పెళ్లాం అక్కరలేదు.. తిండి యావ తప్ప..’’ అంటూ ముస్తాబు అంతా లాగి అవతల పారేస్తోంది.. అంతలో పెళ్లికి వచ్చిన యువకులలో ఒక చోటుమియాన్ నేను రెడీ అన్నాడు- పిల్ల నాకు నచ్చింది, నేను చేసుకుంటాను- ఆకులు కాయలు హాయిగా తింటాను’’ అంటూ ముందుకి వచ్చాడు. వధువుకూడా సంతోషంగా బుర్ర వూపింది. మియా బీబీ రాజీ అయితే బీచ్‌మే ఖైకూ కాజీ అంటూ (పిల్ల పిల్లాడూ మోజుపడితే మధ్యలో పురోహితుడు ఎందుకు? అంటూ) గ్రామ పెద్దలు పోలీసులు కూడా మాకు కూడా వెజిటేరియన్ డిన్నర్ కొట్టండి అన్నారు. షాహనారుూ షాదీఖానా అంతటా మారుమ్రోగింది!