Others

కొంటె ‘కిల్ఫీగాళ్ల’తో రైళ్లకు ముప్పు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెల్ఫీలు తీసుకునే వ్యామోహం ‘‘వెర్రి కుదిరింది రోకలి తలకి చుట్ట’’మన్నట్లుగా తయారవుతోంది.. ప్రాణాలతో- సొంత ప్రాణాలతో కూడా కాదు- ఇతరుల క్షేమంతో చెలగాటమాడే ఈ స్మార్ట్ ఫోను క్రీడకి కిల్ఫీ అని ముద్దు పేరు కూడా పెట్టుకున్నారు జనాలు. మొన్న శనివారంనాడు ఆలిగడ్ మీదుగా ఢిల్లీకి పరుగులు తీస్తున్న సీల్ధా రాజధాని ఎక్స్‌ప్రెస్‌కి అడ్డంగా ఎర్రజెండా లాంటి వస్తమ్రొకటి అత్యవసరంగా ఊపుతూ కుర్రవాడొకడు అడ్డం పడ్డాడు. డ్రైవర్ ఏదో పెద్ద ముప్పు ముందున్నది కాబోలు అనుకుని ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు. వెంటనే ఆ ఆకతాయి పిల్లవాడు ఇంజను ముందుకి దూకి ఒక సెల్ఫీ కొట్టుకుని డ్రైవర్ దిగి వచ్చేలోగా తుర్రుమన్నాడు. రాజధాని అర్థాంతరంగా ఆగిపోవడంతో- మరో రైలు, ఇంకో నాలుగు గూడ్సు బండ్లు ఎక్కడివక్కడ ఈడిగలబడ్డాయి. పారిపోయిన కుర్రకుంక మీద కేసు రాసుకున్నారు పోలీసులు- ఢిల్లీ రైలు గంట లేటు అయింది. ప్రయాణికులు రైల్వే అధికారులమీద కారాలు మిరియాలు నూరేరు. ఇలాగే ఆమధ్య ఇదే ట్రాక్‌మీద ఓ ముగ్గురు యువకిశోరాలు బండరాళ్ళు అడ్డం పెట్టి భువనేశ్వర్-రాజధానిని నిలవరించి సెల్ఫీలు కొట్టుకుని అడ్డంగా దొరికిపోయారు. కాని వాళ్లు మైనర్లు కావడంతో పోలీస్ బెయిల్ ఇచ్చి పంపించక తప్పలేదు.