Others

ఆ స్కూల్స్‌లో కూల్‌డ్రింకులు నిషేధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్ పంజాబ్ రాష్ట్రంలో స్కూలు పిల్లలు కనీసం స్కూళ్ళల్లో వున్నప్పుడైనా చెత్త తిండి- కోక్‌లాంటి కూల్‌డ్రింకులు త్రాగి ఆరోగ్యం పాడుచేసుకోకూడదు అని పౌష్టికాహార సంఘం తీర్మానించింది. రేపటి యువత స్కూలు పిల్లలే కనుక వీళ్లకి పాలు, పండ్ల రసాలు లాంటివి ఇవ్వాలని- బర్గర్లు, ఫ్రాన్కీలు, నిల్వ తిండ్లు కాకుండా తాజా తిండి, పండ్ల రసాలు స్కూలు క్యాంటీన్లు సప్లై చెయ్యాలని ఆర్డర్లు జారీ కాబోతున్నాయి. పాక్ ఫుడ్ అథారిటీకి ప్రతిపాదనలు వెళ్లాయి- కూల్‌డ్రింకులు పిల్లల ఎముకల బలాన్ని హరిస్తాయని ఆ సంఘం తీర్మానించింది. ఒక్క పాకిస్తాన్ పంజాబ్‌లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈ ఆందోళన ఉన్నది. 2010లో అమెరికా అప్పటి అధ్యక్షుడు ఒబామాగారు ‘హెల్తీ హంగర్ ఫ్రీ కిడ్స్ యాక్టు’ ఒకటి అమలు చేశాడు. ఉత్తరప్రదేశ్‌లో యోగిగారి పాలన వచ్చిన తరువాత పిల్లలు స్కూళ్లకి టిఫిన్ బాక్సులలో మాంసాహారం తెచ్చుకోకూడదని- ఆంక్షల్ని గట్టిగా అమలు చేస్తున్నారు. జైన్ సంఘాలు నిర్వహించే బడులలో - అంతంతమాత్రంగా అమలు అవుతున్న ఈ రూల్స్ యోగిగారి మద్దతుతో స్ట్రిక్టు అయిపోయాయి. ఒక స్కూలు పిల్లలంతా ‘యోగి హెయిర్‌కట్’ చేయించుకోమని ఆర్డర్లు వేసింది. దీంతో ఆందోళన వచ్చింది. ఇవాళ హెయిర్ కట్ అంటారు, రేపు ‘యోగి డ్రెస్’ అంటే చస్తామేమో అని పేరెంట్స్ గోల పెట్టేశారు. అయ్యా! క్రూ కట్ అన్నా, మరో తఫ్ఫిని కట్ అన్నా పిల్లలకి వారి తల్లిదండ్రులకి అర్థం అవడంలేదూ.. అందుకని అలా చెప్పాము అని స్కూల్ యాజమాన్యం సంజాయిషీ ఇచ్చింది. బేకరీల మధ్య, బార్‌లప్రక్కన, నాన్‌వెజ్ టిఫిన్ల బండ్ల ముందు స్కూళ్లు ఉంటాయి. వీటిముందు నిషేధం అన్న వాటి ప్రక్కన ఈ ఆటంకాలు చెల్లవు- అధికార్లకు మామూళ్లు అందించే ‘కల్చరు’ మాత్రం పెరుగుతుంది. కోక్ మాదిరి శీల పానీయాల నిషేధం సాధ్యమా? అని యుపి సిఎం- యోగిజీ పరిశీలించవచ్చును. ఐడియా పాక్‌దే కావచ్చు కానీ వినదగును ఎవ్వరు చెప్పిన అన్నాడుగా శతకకారుడు!

veeraji.pkm@gmail.com