Others

మల్లెపూల మహత్మ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మండు టెండలనుండి సేదతీర్చే మల్లెల్ని మించిన మనోహర పరిమళం మరెక్కడా ఉండదు. వీటిలో సుగంధం ఎక్కువ. మల్లెల గుబాళింపు ఆహ్లాదంగా, గుండెల నిండా సంతోషాన్ని నింపి ఆనందాల్లో ముంచెత్తుతుంది. వేసవి కాలం వచ్చిందంటే చాలు మనసంతా మల్లెల పరిమళాలు గుబాళిస్తాయి. విచ్చుకున్న మల్లెలు ఇంటిని సుగంధాలతో నింపేస్తుంటాయి. ఆహ్లాదపరిచే మల్లెల సోయగాలు మనసును అల్లరిస్తాయి. మగువలు మెచ్చిన మల్లెలు మదిని మురిపిస్తాయి. మగువ సిగలో ఎన్ని రకాల పువ్వులు ఒదిగినా మల్లెపూల ముందు దిగదుడుపే. పరిమళానికి, సోయగానికి స్వచ్ఛమైన ధవళకాంతులకు మారుపేరయిన మల్లెలు స్ర్తిల సిగలో సహజ ఆభరణాలు. మహిళలు మల్లెలు ధరించడంవల్ల సుఖంగా, ఆనందంగా, హాయిగా నిద్రపడుతుంది. పక్కవాళ్ళకి కూడా ఇలాంటి అనుభూతి కలుగుతుంది. మల్లెపూల సువాసనకు విసుగు, అసహనాలు దరికిచేరవు.
కళ్ళనుంచి మెదడు వరకూ ఆహ్లాదం కలిగించడంలో ఇవి చురుగ్గా పనిచేస్తాయి. ఎండ ఎంత తీవ్రంగా ఉన్నా సాయంకాలం వేళ మల్లెలను చూడగానే రోజంతా పడిన కష్టం ఇట్టే మరచిపోతారు. సాయంత్రానికి వెండి వెనె్నల కురిపిస్తూ విరబూయటం వీటి ప్రత్యేకత. పరిమళానికి మారుపేరయిన పరిమళభరిత మల్లెలంటే అందరికీ ఇష్టమే! ఈ పూల సుగంధానికి పరవసించని మనసే ఉండదంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు చల్లదనానికి, గుభాళింపులకు మారుపేరు మల్లెల సౌరవం జీవితాలనే మార్చేస్తుంది. శృంగారానికి మల్లెపూలకు అవినాభావ సంబంధం ఉండటంతో మగవారికి కూడా ఆ సుగంధ మల్లెలంటే చాలా ఇష్టం. వీటి సువాసన దంపతులమధ్య ఇష్టాన్ని, మమకారాన్ని, ప్రేమానురాగాల్ని పెంచుతుంది. అసలు మల్లెల్ని చూస్తేనే మనసు పులకించి మైమరచి మయూరంలా నాట్యం చేస్తుంది. అందుకే శోభనం రాత్రి ఈ పూలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇదీ మల్లెపూల మహత్మ్యం.

-కాయల నాగేంద్ర