Others

ధర్మసంరక్షణకోసమే అవతరించిన ఆదిశంకరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదాంతానికి, వైదిక ధర్మ ప్రవృత్తికి చెదపురుగుల్లా వేద విహిత మతాలు పుట్టి స్వైర విహారం చేస్తున్న కాలంలో వేదాంత విరుద్ధ శాస్త్రాలన్నింటినీ సమూలంగా నాశనం చేసి అద్వైత సిద్ధాంతం ద్వారా సర్వత్రా జ్ఞాన మార్గాన్ని ప్రతిష్ఠింపచేసారు శ్రీ శంకర భగవత్పాదులు. సాక్షాత్తు శివాంస సంభూతుడైన శ్రీ శంకరాచార్యులవారు తమ అత్యల్ప వయసులోనే ముప్పది రెండేళ్ల కాలంలో యావద్భారతాన్ని దర్శించి సర్వమతాల కుతర్కాలను ఖండించి కేవలాద్వైతమే పరమావధి అని చాటి చెప్పారు.
ఆచార్యులు ప్రవచించిన సిద్ధాంతాల కారణంగా భారతదేశం కర్మకాండ రూఢివాద కూపంలోను, నాస్తికవాదుల జడవాదుల కూపంలోను మునిగిపోకుండా రక్షించబడింది. భారతీయ సంప్రదాయానికి ఆధారమైన వైదిక వాజ్ఞ్మయాన్ని సరిగా అధ్యయనం చేసి వ్యాఖ్యానించగలిగేవారు అరుదుగా వున్న సమయంలో ఆ బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకుని పరిస్థితులను చక్కదిద్ది తిరిగి ప్రజల్లో వైదిక ధర్మ స్పూర్తిని కలిగిస్తూ వైదిక వాజ్ఞ్మయపు ప్రామాణికతను స్థాపించడానికి తన అల్ప జీవితాన్ని శంకరాచార్యులు హారతి కర్పూరంలా వెచ్చించారు.
‘శివరహస్యం’ అను గ్రంధంలో
దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే
స ఏవ శంకారాచార్యః సాక్షాత్ కైవల్య నాయకః
దుష్టాచారములు నశింపచేయడానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆది శంకరుడుగా అవతరించాడని భావము.
స్కాంద పురాణంలో
‘కరిష్యత్స్మవతారం స్వం శంకరో నీల లోహితః
శ్రౌత స్మార్త ప్రతిష్ఠార్ధం భక్తానాం హిత కామ్యయా’
శ్రౌత స్మార్త క్రియలను సుప్రతిష్ఠం చేసి వైదిక మార్గాన్ని నిలబెట్టడానికి నీలలోహితుడు (శివుడు) శంకరాచార్యునిగా అవతరించాడు‘ అని పేర్కొంది.
గౌడపాదులు, గోవింద భగవత్పాదులు శివుడే సనాతన ధర్మాన్ని సంరక్షించడానికి శంకరాచార్యుల రూపంలో అవతరిస్తారని ముందుగానే గుర్తించారు. ఆచార్యులవారి ప్రముఖ శిష్యులు సురేశ్వరాచార్యులు, పద్మపాదాచార్యులు తమ గురువులో సాక్షాత్ శంకరదేవునే దర్శించారు.
దేవ వాజ్ఞ్మయం అందరూ తెలుసుకునేలా ప్రస్థాన త్రయం (ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు, భగవద్గీత) భాష్యాలు రచించారు. వీటిని అర్ధం చేసుకోవడం కష్టమని తలిచి ప్రకరణ గ్రంథాలు శతాధికం రచించారు. తమ దేశ పర్యటనలో ఎన్నో ఆలయాలను జీర్ణోద్ధరణ గావించారు. ఆచార్యులవారు దర్శించిన క్షేత్రాలలో కొలువైవున్న దేవీదేవతలపై పుంఖానుపుంఖాలుగా స్తోత్రాలను పండిత పామరజనులకు అందించి ప్రజల్లో భక్తి భావన పెంపొందించారు.
శ్రీ శంకరులు తొల్దొల్తగా వైదిక దర్శనములపై దృష్టి సారించారు.దర్శనమలు పరస్పర విరుద్ధములు కాదు, బ్రహ్మాను సంధానమునకు పోషకములు. వివిధ ఉపాసనా మార్గములు బ్రహ్మానుసంధానమును ఉద్దేశించినవే. మధ్యకాలంలో గమ్యం మరిచి వాటిలో చేర్చిన వక్రతలను తొలగించితే అవి మోక్షపథములే. ఆచార్యులవారు ఏ దర్శనమునూ, ఉపాసనా మార్గమును పూర్తిగా తోసివేయలేదు. వాటన్నింటినీ సంప్రదాయానుసారం నిర్వర్తించాలి. ఈ విధంగా నాడు సమాజంలో ఉన్న వైదిక మంత్ర, తంత్ర, యోగ శాస్తమ్రుల ఆధారంగా వేలాది దేవీ దేవతలను ఆరువర్గాలుగా విభజించి అంతకు ముందున్న పంచాయతన విధానాన్ని పునరుద్ధరిస్తూ షణ్మత స్థాపన చేసి షణ్మత స్థాపనాచార్యునిగా ప్రసిద్ధి పొందారు. విజయ యాత్ర కొనసాగించారు.
నాలుగు దిశలలో వున్న ఒక్కొక్క ఆమ్నాయానికి నాలుగు వేదములలో ఒక్కొక్క వేదాన్ని, నాలుగు మహా వాక్యములలో ఒక్కొ క్క మహా వాక్యాన్ని అనుసంధానం చేసారు. ఇవి సమస్త వేదసారాన్ని, విభిన్న దృక్కోణాలనుండి వ్యక్తీకరించగలిగినవి. నాలుగు ఆమ్నాయాలకీ నాలుగు సంప్రదాయాలు ఏర్పాటు చేసారు. ఒక్కొక్క పీఠానికి ఒక్కొక్క నామము, దేవత, క్షేత్రము, యోగపట్టము ఏర్పరిచారు. తన ప్రముఖ శిష్యులలో నలుగురిని ఒక్కొక్క ఆమ్నాయానికి అధిపతులుగా నియుక్తులను చేసారు. వాటి వివరాలు
1 పశ్చిమంలో (ద్వారక) కాళికాపీఠం దేవత సిద్ధేశ్వర శక్తి-్భద్రకాళి; నది-గోమతి; సంప్రదాయం- కితవార; వేదము-సామవేదము; మహా వాక్యం-తత్త్వమసి; ఆచార్యులు-శ్రీ పద్మపాద; పీఠాధిపతుల నామములు-తీర్థ, ఆశ్రమ.
2. ఉత్తర దరిశలో (బదరికాశ్రమం) జ్యోతిర్మఠం; దేవత-నారాయణ శక్తి-పూర్ణగిరి; నది-అలకనంద; సంప్రదాయం-నందదార; వేదము-అధర్వణ వేదము; మహావాక్యం-అయమాత్మాబ్రహ్మా; ఆచార్యులు-శ్రీ తోటక; నామములు-గిరి, పర్వత
3.తూర్పు దిశలో (జగన్నాధ పురీ)-గోవర్ధన మఠం; దేవత-జగన్నాధ-పురుషోత్తమ శక్తి, నది-మహాదధి; సంప్రదాయం-్భగవార; వేదము-ఋగ్వేదము; మహా వాక్యం-ప్రజ్ఞానం బ్రహ్మ; ఆచార్యులు-శ్రీ హస్తామలక, పీఠ నామములు-అరణ్య, వన.
4. దక్షిణ దిశలో (శృంగేరి) శారదా మఠం; దేవత-మలహనికర లింగ వరాహశక్తి-శారద; నది-తుంగ, సంప్రదాయం-్భరివార; వేదం-యుజుర్వేదం; మహావాక్యం-అహం బ్రహ్మాస్మి; ఆచార్యులు-శ్రీ సురేశ్వర; పీఠాధిపతి నామములు-అన్నినామములు ప్రత్యేకించి సరస్వతి, పురి, భారతి, అరణ్య, గిరి, తీర్థ, ఆశ్రమ
ఇలా నాలుగు పీఠాలల తాను కైలాసంనుండి తెచ్చిన ఐదు స్పటిక లింగాలలో నాలుగింటిని ఆయా పీఠాలలో ప్రతిష్టించారు. హిందు ధర్మం మార్గదర్శనం చేస్తూ కొనసాగుతున్నదంటే శ్రీ శంకరులు సశాస్ర్తియమైన పద్ధతిలో మఠ వ్యవస్థకు పునాదియే కారణం.

ఎ. సీతారామారావు