Others

శ్రుతి మించుతున్న ‘న్యాయ’ చైతన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యాయవ్యవస్థలో మితిమీరిన చైత న్యం పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ న్యాయమూర్తులను హె చ్చరించడంద్వారా రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఇటీవల అందరి దృష్టినీ ఆకర్షించారు. అధికారాల అమలు విషయంలో రాజ్యాంగంలోని ప్రధాన వ్యవస్థల మధ్య సమతుల్యత దెబ్బతినకూడదని, అలాగని సమతుల్యత లేకపోవడం కూడా మంచిది కాదని ఆయన వ్యాఖ్యానించారు. ‘ప్రజాస్వామ్యంలోని ప్రతి వ్యవస్థ తన పరిధికి తాను కట్టుబడి పనిచేస్తూ పోవాలి. రాజ్యాంగం నిర్దేశించిన అధికారాల విభజనను న్యాయ వ్యవస్థలోని మితిమీరిన చైతన్యం నీరుగార్చకూడదు’ అంటూ ఇటీవల భోపాల్‌లో జరిగిన జాతీయ జ్యుడిషియల్ అకాడెమీలో జరిగిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సదస్సులో తన ఆవేదనను వెలిబుచ్చారు.
రాజ్యాంగంలోని మూడు ప్రధాన వ్యవస్థల మధ్య సమతుల్యతను దెబ్బతీస్తున్న న్యాయవ్యవస్థ మితిమీరిన చైతన్యంపై రాష్టప్రతి అసహనంను వ్యక్తం చేయడానికి కారణం ఏమై ఉంటుంది? అడపాదడపా సంయమనం కోల్పోతుండటం, అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి వాటితో న్యాయవ్యవస్థ ఇటీవల గాడి తప్పుతోంది. న్యాయ వ్యవస్థ చేస్తున్న కొన్ని వ్యాఖ్యలను పరిశీలిస్తే అసలు కోర్టులు ఉన్నది న్యాయాన్ని అందించేందుకా లేక తమ అనుచిత వ్యాఖ్యలతో పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కేందుకా అన్న సందేహం కలగకమానదు. న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠ మసకబారేలా విమర్శల బారిన పడకుండా చూడటం ప్రతి పౌరుడి బాధ్యత. అలాగే తన అనవసర వ్యాఖ్యలతో ప్రతిష్ఠ దిగజారకుండా చూసుకోవడం న్యాయవ్యవస్థ బాధ్యత కూడా. ‘అధికారాల అమలుకు సంబంధించి స్వీయ క్రమశిక్షణను నిర్దేశించుకోవడం, సంయమనం పాటించడం ద్వారా మాత్రమే ఇలాంటి విమర్శలనుంచి న్యాయవ్యవస్థ బయటపడుతుంది’ అని రాష్టప్రతి అభిప్రాయపడటం గమనార్హం.
మరి మనకు అటువంటి సంయమనం కనిపిస్తున్నదా? ఐపిఎల్ కేసులో బోంబే హైకోర్టు వ్యవహరించిన తీరు న్యాయవ్యవస్థ చైతన్యం తీరుకు ఒక ఉదాహరణ. ఈ కేసులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యమే (పిల్) అవివేక పూరితం. గోల్ఫ్‌కోర్సులు, స్విమ్మింగ్ పూల్స్, స్టార్ హోట ళ్లు, పెద్ద పెద్ద బంగ్లాల్లో నివసించే రాజకీయ నేతలు, ధనవంతులు, సినీ దిగ్గజాల లాన్‌లలో పెద్దమొత్తంలో వృధా అవుతున్న నీటిని గురించి ప్రస్తావనే ఈ ‘పిల్’లో లేదు. కోర్టు కూడా ఆవిధంగా వృధా అయ్యే నీటి పరిణామ వివరాలపై ప్రశ్నించిన పాపాన పోలేదు. వీటన్నింటిని పట్టించుకోకుండా కోర్టు కేవలం తన ఆగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం, బిసిసిఐలపై వెళ్లగక్కింది. ఇప్పటికే వేలాది కేసులు కుప్పలు తెప్పలుగా పెండింగ్‌లో ఉన్న స్థితిలో, కోర్టు కేవలం ఐపిఎల్ మ్యాచ్‌లు ఎక్కడ జరగాలనేది నిర్ణయిస్తే చాలు. అదే సుప్రీంకోర్టులో ఇప్పటికే 61,000 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ స్థితిలో కోర్టులు అనుమతించే పిల్స్ కేవలం ‘‘ప్రచారం కోసం దాఖలైనవి’’ మాత్రమే!
‘‘దోవకి రావడం నీకిష్టం లేదా’’, ‘‘రిటైర్మెంట్ విషయంలో టెండూల్కర్‌ను అనుసరించు’’ వంటివి సుప్రీంకోర్టు వ్యాఖ్యానాల్లో కొన్ని. ఇదే బిసిసిఐ కేసుకు సంబంధించి భారత ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానిస్తూ, ‘‘క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక టెండూల్కర్ న్యాయవాద పట్టా పొంది, లీగల్ ప్రాక్టీస్‌లోకి వస్తే బాగుంటుంద’’ని సలహా ఇచ్చారు. అంతేకాదు బిసిసిఐని ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోరాదంటూ కూడా ఒక దశలో కోర్టు ప్రశ్నించింది. ఇందుకోసం ప్రత్యేక చట్టాన్ని అమల్లోకి తీసుకు రావాలని కోరింది. అసలు వచ్చిన కేసుకు సంబంధించిన మంచి చెడులను విచారించకుండా, కొంతమంది వ్యక్తులకు ‘కితాబు’లివ్వడం న్యాయవ్యవస్థ పనికాదు.
న్యాయవ్యవస్థ స్వరం, ధోరణి చూస్తుం టే, రాజ్యానికి చెందిన ఇతర రెండు అంగాలను తన ఆధీనంలో పనిచేసేవిగా పరిగణిస్తున్నట్టు కనిపిస్తోంది. న్యాయవ్యవస్థ వ్యవహారశైలిని పరిశీలిస్తున్న వారికి, అది తన పరిమితుల్లోనే విధులు నిర్వర్తిస్తున్నట్టు అనిపించదు. ఇతర రెండు అంగాలపై ఆధిపత్య ధోరణితో, అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నదన్న అభిప్రాయం న్యాయవ్యవస్థపై కలుగుతుంది. నిజంగా ఇటువంటి పరిస్థితి మన రాజ్యాంగం ఊహించనిది. నైనిటాల్ హైకోర్టు వ్యాఖ్యలను ఒక్కసారి పరిశీలించండి..‘‘రాష్టప్రతి రాజు కాదు’’, ‘‘ప్రభుత్వం తాను చట్టం కంటె అధికం కాదని తెలుసుకోవాలి’’, ‘‘కేంద్రం గందరగోళాన్ని సృష్టిస్తోంది’’, ‘‘ అవినీతిపై తీర్పు చెబితే ఏ ప్రభుత్వం కూడా ఐదు నిముషాలకు మించి అధికారంలో మనలేదు’’. మరి ఇటువంటి వ్యాఖ్యలు న్యాయవ్యవస్థ స్థాయికి ఎంతమాత్రం తగనివి.
వీటన్నింటిని పరిశీలిస్తే న్యాయవ్యవస్థ పనితీరు అద్భుతంగా ఉన్నదని చెప్పడం ఎంతమాత్రం సాధ్యం కాదు. హైకోర్టు న్యాయమూర్తులు కేసులను 15 నుంచి 25 నిముషాలు విచారించి తీర్పులు చెబుతున్నట్టు తెలుస్తోంది. కేసు విచారణకు రావడానికి సుదీర్ఘకాలం చకోరపక్షుల్లాగా వేచి చూసిన లిటిగెంట్లకు అనుభవంలోకి వచ్చే అంశమిది. ఇంతకాలం వేచి చూసిన విచారణ కేవలం కొద్ది నిముషాల్లోనే ముగిసిపోతున్నది. వాస్తవ పరిస్థితి ఈవిధంగా ఉంటే ‘పిల్స్’ను విచారించడానికి రోజుల తరబడి సమయం వెచ్చించడానికి కోర్టులు ఏమాత్రం వెనుకాడటం లేదు. ఎందుకంటే అవి మీడియాలో పతాక శీర్షికలకెక్కుతాయి. అంతే కాకుండా ప్రజలు ఆసక్తి కనబరచేది కూడా వాటిపైనే మరి! ప్రచారానికి ఎటువంటి ఢోకా ఉండదు!
భారతీయ రిజర్వ్ బ్యాంకు వాచ్‌డాగ్ మాదిరిగా ఏవిధంగా వ్యవహరించాలో సూచించవచ్చునని సుప్రీకోర్టు భావించినట్టుంది. అందుకనే ‘‘మీరు నిఘా ఉంచడానికి వీల్లేదా? సమాచారాన్ని ఎప్పటికప్పుడు సమకూర్చుకొని, ప్రభుత్వరంగ బ్యాంకులు రుణాలు అందజేసే విషయంలో తగిన చర్యలు తీసుకోకూడదా?’’..ఇవన్నీ న్యాయవ్యవస్థ పరిశీలనలు! బ్యాంకులను ఎట్లా నియంత్రించాలన్నది ఆర్‌బిఐకి చెప్పవచ్చునా? ఇక్కడ న్యాయవ్యవస్థ కార్యనిర్వాహక, శాసన వ్యవస్థల పరిధుల్లోకి చొచ్చుకెళుతున్నదనేది సుస్పష్టం.
దేవాలయాల్లోకి మహిళల ప్రవేశం కేసు, సుప్రీంకోర్టు తన న్యాయ పరిధిని అతిక్రమించిందనడానికి మరో చక్కని ఉదాహరణ. ఈ కేసులో సుప్రీకోర్టు అడిగిన ప్రశ్న.. ఆచారమా? లేక రాజ్యాంగమా? ఏది ఇక్కడ ముందు? ఇక్కడ ఈ రెండింటిలో ఏదనేది కాదు అసలు ప్రశ్న. ఆచా రం,రాజ్యాంగం...ఈ రెండింటినీ గౌరవించవలసిందే. కోర్టు ఇక్కడ కీలక సమయంలో తన ‘చైతన్యాన్ని’ ప్రదర్శిస్తున్నదంతే. మీడియా చైతన్యం, న్యాయ వ్యవస్థ చైతన్యం అనేవి ఒకే నాణేనికి ఇరువైపులా బొమ్మా బొరుసుగా మారాయి. ఇక పలుకుబడి సరేసరి. ఆచారం గురించి సుప్రీకోర్టు మాట్లాడినప్పుడు, అది కేవలం మెజారిటీ మతస్థుల ఆచారం మాత్రమే! అంటే అది రాజ్యాంగానికి లోబడి ఉండాల్సిందేగా! మరి ముస్లిం మహిళలను మసీదుల్లోకి, దర్గాల్లోకి అనుమతించరు. మరి అది వారి ఆచారం. దీనిమాటేంటి? మరి కోర్టు అన్ని మతాల ఆచార వ్యవహారాలను పరిగణలోకి తీసుకొని ఉన్నట్టయితే, తన వ్యాఖ్యలు నిజాయతీగా ఉండి ఉండేవి.
అయితే రాజ్యాంగంలోని 25, 26 అధికరణలు కేవలం సైద్ధాంతిక పరమైన అంశాలకు మాత్రమే పరిమితం కాదు. అవి మతాలకు కూడా వర్తిస్తాయి. మతానికి సంబంధించిన వివిధ రకాల క్రతువులు, ఆచార వ్యవహారాలు, కార్యకలాపాలు, ఆరాధనా విధానాలు, వంటివాటికి హామీ ఇస్తున్నాయి. ఇదిలావుండగా మహిళలను దేవాలయాల్లోకి అనుమతించడం లేదనడానికి సంబంధించిన సంపూర్ణ సమాచారం కోర్టు వద్ద లేదు. మరి దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో అనుసరించే ఆచార వ్యవహారాలపై అధ్యయనం జరిగిందా? స్ర్తిపురుష సమానత్వం అనేది కేవలం మెజారిటీ వర్గాలకు చెందిన ఆచార వ్యవహారం మాత్రమేనా? విచారమేమంటే మెజారిటీ వర్గాల ప్రజలకు మాత్రమే స్ర్తిపురుష సమానత్వంపై బోధించడం. దేశంలోని వేలాది దేవాలయాల్లోకి మహిళలు యదేచ్ఛగా ప్రవేశించవచ్చు. ఇక్కడ వారికి పురుషులతో సమాన హక్కులున్నాయి. అయితే అందుకు శబరిమల వంటి వేళ్లపై లెక్కించే దేవాలయాలు తప్ప! శబరిమలలోని అయ్యప్పస్వామి బ్రహ్మచర్యంపై కోర్టు అవివేక పూరితమైన వ్యాఖ్యలు చేసింది. ఇది కచ్చితంగా న్యాయపరిథిని అతిక్రమించడమే. కొంతమంది కార్యకర్తలు కావాలనే హైందవ మతాన్ని అప్రదిష్ట పాలు చేయడానికి కృషి చేస్తున్నారు. అంతేకాదు హైందవంలో మహిళల పట్ల తీవ్ర వివక్ష కొనసాగుతోందని ప్రపంచానికి వెల్లడి చేయడమే వీరి లక్ష్యం. ఈ పాపిష్టి క్రీడలో న్యాయవ్యవస్థ కూడా చేరిపోయింది.
ప్రభుత్వ ప్రకటనలపై ముఖ్యమంత్రుల చిత్రాలను ప్రచురించరాదంటూ కొంతకాలం క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు మీకు గుర్తుండే ఉంటాయి. ప్రజలచేత ఎన్నికైన ముఖ్యమంత్రులు ప్రభుత్వ ప్రకటనలు ఏవిధంగా డిజైన్ చేయాలనేది నిర్దేశించడం న్యాయవ్యవస్థ పనా? అదృష్టవశాత్తు, తాను తీసుకున్న నిర్ణయంలో సహేతుకత లేదన్న సంగతి న్యాయవ్యవస్థ గుర్తించి దాన్ని కొట్టివేసింది. న్యాయవ్యవస్థ ఇదే మాదిరి తనను తాను నియంత్రించుకోలేక, మతంతో సహా తన పరిధిలో లేని వాటి విషయాల్లో కలుగజేసుకుంటూ వెళితే, కాలక్రమంలో ‘‘నియంతృత్వ న్యాయవ్యవస్థ’’ అనే సార్థక నామధేయా న్ని మూటకట్టుకోవాల్సి వస్తుంది.