Others

భలే చౌక ఏసీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సృజనాత్మకతకు చిన్నా పెద్దా అనే కొలమానమే అక్కర్లేదు. హైస్కూల్ విద్యార్థుల్లోనూ సృజనాత్మకత దాగుంటుంది. వారి పదునైన ఆలోచనలు అద్భుతాలను క్రియేట్ చేస్తుంది. అలాంటి కోవలోకే వస్తుంది కల్యాణి శ్రీవాత్సవ. కేవలం 1800 రూపాయలకే ఏసీ తయారు చేసి అందరి చేత శభాష్ అనిపించుకుంటుంది.
యూపీలోని ఝాన్సీ నగరానికి చెందిన కల్యాణి స్థానిక లోకమాన్య తిలక్ కాలేజీలో ఇంటర్ చదువుతుంది. తల్లిదండ్రులిద్దరూ టీచర్లే. చదువులో చిన్నప్పటి నుంచి ముందుండే కల్యాణి ఆలోచనలు అంతే చురుకుగా ఉంటాయి. ఈ అమ్మాయిలో ఏదో సాధించాలనే తపనను తల్లిదండ్రులు గుర్తించారు. పేద ప్రజలకు ఏసీ అందుబాటులో ఉండేలా ఒక ఆవిష్కరణ చేయాలనే తన తపనను తల్లిదండ్రుల ముందు ఉంచింది. వారి ప్రోత్సాహంతో తయారుచేసి చూపించింది.
థర్మకోల్‌తో తయారుచేసి ఒక బాక్సుకు 12 బోల్టుల డీసీ ఫ్యాన్ బిగించింది. దాన్ని గంటసేపు ఆన్‌చేసి పెడితే రూం టెంపరేచర్ 4 నుంచి 5 డిగ్రీలు పడిపోతుంది. పూర్తిగా సోలార్ ఎనర్జీతో నడిచే ఈ ఏసీ నుంచి ఎలాంటి కాలుష్యం ఉండదు.
జాతీయ స్థాయి పోటీల్లో ఎంపిక
కల్యాణి తయారుచేసిన ఈ ఏసీ ఐఐటీ ఢిల్లీ నిర్వహించిన నేషనల్ లెవల్ మోడల్ కాంపిటీషన్లో సెలెక్ట్ అయింది. గత ఏడాది యూపీ సర్కార్ అమర్ ఉజాల అనే హిందీ దినపత్రిక సంయుక్తంగా ఏర్పాటుచేసిన నారీ సమ్నాన్‌కు ఎంపికైంది. ఆమెతో పాటు ఆటల్లో, చదువుల్లో కళలో మంచి ప్రతిభ కనబరిచిన వారిని సత్కరించారు. కల్యాణి వినూత్న ఆలోచన నచ్చి జపాన్ ప్రభుత్వం నుంచి సెమినార్ కోసం పిలుపు అందింది.
కల్యాణి సైన్సులోనే కాదు పాటలు పాడటంలో కూడా మంచి ప్రతిభ కనబరుస్తుంది. ఒకసారి ఇండియన్ ఐడల్‌లో పాల్గొని మూడో రౌండ్ వరకు వెళ్లింది. లక్నో, కాన్పూర్ వంటి నగరాల్లో ప్రదర్శనలిచ్చి 50దాకా బహుమతులు గెలుచుకుంది. ఏసీ అంటేనే ఖరీదైన వస్తువు. అది మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షా. ఈ నేపథ్యంలో కాల్యాణి తయారుచేసిన ఏసీ ఒక ఫ్యాన్ ఖరీదులో రావటం పేదలకు సంతోషించదగ్గ అంశమే. పూర్తిగా సోలార్ ఎనర్జీతో తయారైన ఈ ఏసీతో పర్యావరణానికి ఎలాంటి ముప్పు లేకపోవటం విశేషం.

చిత్రాలు.. కల్యాణి. ఆమె తయారుచేసిన ఏసీ మెషీన్