Others

బీహార్ వధువుల ధైర్యసాహసాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీహార్ వెనుకపడ్డ రాష్ట్రం అంటారు కానీ అక్కడ 2015 నుంచి మద్యనిషేధం అమలుకావటానికి ఆ ఆధునిక యువతుల పట్టుదల కూడా వుంది. సుజాతపురా గ్రామం బక్సార్ జిల్లాలో పాట్నాకి 120 కిలోమీటర్ల దూరంలో వుంది. రైతుబిడ్డ ‘బిట్టూ’ అతని పెళ్లి బృందం సుమారు డెబ్బై కిలోమీటర్ల దూరం బరాత్ చేసుకుని అలసి సొలసి వచ్చారు.
పీటలమీద వధూవరులు కూర్చున్నాక పెళ్లికూతురికి సారా కంపు తాకింది. సరిగ్గా సింధూరధారణ సమయంలో పెళ్లికూతురు ‘రాణి కుమారి’ దిగ్గున లేచి నిలబడి నాకీ పెళ్లి వద్దు పొమ్మంది. బుడ్డికి దాసోహం అన్న వీనికి దాంతోనే పెళ్లి చెయ్యండి’’ అంటూ విసవిస వెళ్లిపోయింది. ‘‘విడిదిలో దిగినపుడు కూడా బాగానే తెలివిగానే వున్నారు మగ పెళ్లివారూ’’ అని మధ్యవర్తుల గోల.
రెండు గ్రామాల పెద్దలు ఆడపిల్లలు తెలివిమీరిపోయారు.. అంటూ రాజీకి తంటాలు పడుతూనే దుఃఖపడ్డారు. బీహార్‌లో ఇతరత్రాకూడా ఇలాగే పెళ్లి కూతుళ్లు ఇతర గ్రామాల్లో సైతం చివరి క్షణాల్లో మగాళ్ల పరువు తీస్తున్నార’’ని చర్చించుకున్నారు. ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన కూడా సమస్తిపూర్‌కు చెందిన ‘్ధమారియా’ గ్రామం- అదీ పాట్నాకి 70 కిలోమీటర్ల దూరంలో వుంది. వధువు సరిగ్గా సింధూర ధారణ వేళలో పీటలమీద నుంచి లేచి నాకీ పెళ్లి వద్దు అన్నది. వరుడు మోటార్ సైకిలు అడిగాడట- బీహారులో త్రాగినా, కట్నం అడిగినా జైలుకి పంపేస్తారు తెలుసా? అని వధువులు ధైర్యంగా పెద్దల్ని నిలదీస్తున్నారు. సరే, ఇది కొంతవరకు బాగానే వుంది కాని పాట్నాకి 125 కిలోమీటర్ల దూరంలో వున్న ‘బెగుల్సరై’ జిల్లా బిఖ్రి గ్రామంలో ఒక పెళ్లికూతురు మరీ సాహసం చేసింది. అంతవరకూ చూడలేదు కాబోలు, పీటలమీద వరుణ్ణి చూస్తూనే ‘‘అబ్బే! ఈ అబ్బాయి నల్ల కొరివిలా ఉన్నాడు, నాకొద్దు’’ అనేసింది. ఆమె బీహారులో అరుదయిన పచ్చ పసిమి రంగులో ఉన్నదిట! ఔరా?