Others

అమృత పానీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎండలు మండుతున్నాయి. వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి మనిషినీ దాహం పీడిస్తుంది. చల్లని నీళ్ళు ఎన్ని తాగినా దాహం తీరదు సరికదా కడుపుబ్బరం అనే మరో అనారోగ్యం వెంటాడుతుంది. ఫ్రిజ్‌లలో ఉంచిన శీతల పానీయాలు సైతం తాత్కాలిక ఉపశమనం కలిగించేవే కాని, దాహానికి పూర్తిగా అడ్డుకట్ట వేయలేవు. చల్లగా ఉదరంలోకి జారటం మినహా దాహాన్ని తన్ని తరిమేయలేవు. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ దాహం మొదలవుతుంది. అలాంటి సమయాల్లో ‘కొబ్బరినీళ్లు’ అమృత పానీయంగా వుంటుంది. ఒక్క బోండాంలోని కొబ్బరి నీళ్ళు తాగితే దాహం కట్టడుతుంది. తీవ్రమైన ఎండ వేడిమినుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. వేసవి కాలంలో దాహాన్ని పారద్రోలి, వడదెబ్బ తాకిడినుంచి తట్టుకోవడానికి కొబ్బరినీళ్ళు దివ్యమైన ఔషధంగా పనిచేస్తాయి. రుగ్మతలను సైతం పారద్రోలే కొబ్బరినీళ్ళు ప్రతిచోటా దొరుకుతున్నాయి.
పోషకాలు ఇవీ..
కొబ్బరి నీళ్ళలో బహు పోషకాలు నిక్షిప్తంగా వున్నాయి. 100 మిల్లీ లీటర్ల కొబ్బరి నీటిలో 105 మిల్లీగ్రాముల సోడియం, 312 మి.గ్రా. పొటాషియం, 30 మి.గ్రా. మెగ్నీషియం, 29 మి.గ్రా. కాల్షియం, 10 మి.గ్రాల ఐరన్, 37 మి.గ్రా.ల భాస్వరం, 27 మి.గ్రా. గంధకం, 183 మి.గ్రా. క్లోరిన్‌లు నిక్షిప్తంగా ఉంటాయి. కొబ్బరినీరులో 4 శాతం పిండి పదార్థాలు, 0.4 శాతం మినరల్స్, 0.1 శాతం ప్రొటీన్లు, 0.1 శాతం కొవ్వు పదార్థం కూడా వుంటుంది. ఔషధ గుణాలలో కాని, పోషక విలువలలోగాని లేత కొబ్బరి నీటితో ఏ శీతల పానీయం పోటీ పడలేదని వైద్య నిపుణులు సైతం ముక్తకంఠంతో అంగీకరిస్తున్నారు.
కొబ్బరినీళ్ళు దాహార్తిని తగ్గించటానికి మాత్రమే ఉపయోగపడటం లేదు. అతిసారం, రక్తవిరోచనాలు, పేగుల మంటలను తగ్గించటానికి కొబ్బరినీళ్ళు బాగా ఉపయోగపడతాయి. హైపవర్ అసిడిటీకి విరుగుడుగానూ, వాంతులు, తల తిరగటం లాంటి అవలక్షణాలను అదుపు చేసే దివ్య ఔషధం కొబ్బరి నీళ్ళు. గతంలో అతి భయంరమైనదిగా ప్రచారం జరిగిన కలరా వ్యాధి నిర్మూలనకు ఇది మంచి మందు. అతిసారంవల్ల వాంతులవల్ల కోల్పోయిన పొటాషియంను సమకూర్చి, దేహానికి సత్తువ అందించటంలో కొబ్బరినీళ్ళు కీలక పాత్ర పోషిస్తాయి. కొబ్బరికాయ కొద్దిగా ముదిరినపుడు అందులో వున్న నీరు జెల్లీలాగా తయారవుతుంది. దీనిని ‘స్పూన్ కోకోనట్’ అంటారు. ఇది చాలా రుచిగా ఉంటుంది. సులభంగా జీర్ణవౌతుంది. కొబ్బరికాయ నీటిలో సోడియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, సల్ఫర్, క్లోరిన్, ఇనుము లాంటి ఖనిజాలు కలిగి ఉండటంవల్ల మనిషికి మంచి పౌష్టికాహారంగా పేర్కొనబడుతుంది. మహిళలకు వేసవిలో క్రమం తప్పకుండా తాగించితే గుండెకు మేలు చేస్తుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

-దాసరి ఆళ్వార్‌స్వామి