Others

ప్రకృతి రక్షకుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతను ప్రజలను రక్షించటమేకాదు పర్యావరణాన్ని పరిరక్షించాలనే తపన గల పత్య్రేక పోలీసు అధికారి. అయనే బాచుపల్లి పోలీసు ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణారెడ్డి. హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీసు స్టేషన్‌కు వెళితే అక్కడ పోలీసు స్టేషన్ భవనంపై పచ్చటి మొక్కలు గాలికి ఊగుతుంటాయి. పర్యావరణ ప్రేమికుడైన ఈ పోలీసు అధికారి ఏ పోలీసు స్టేషన్‌లోకి అడుగుపెడితే అక్కడ ఆ భవనం నందనవనమే. సేంద్రీయ పద్దతుల్లో మొక్కలను పెం చుతూ ప్రజల రక్షకుడ్నే కాదు పర్యావరణ రక్షకుడ్ని అని నిరూపించుకుంటున్నారు. స్టేషన్‌కు వచ్చే ప్రజలకు వివిధ సెక్షన్ల గురించే కాదు సేంద్రీయ పాఠాలు వల్లివేస్తుంటాడు. దాదాపు టెర్రిస్‌పై పది రకాల కూరగాయ మొక్కలను పెంచుతున్నారు.
వ్యవసాయం అంటే మక్కువ..
చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే ఈ ఇన్‌స్పెక్టర్‌కు ఎంతో ఇష్టం. బాచుపల్లి పోలీసు అధికారిగా బాచుపల్లి స్టేషన్‌కు వచ్చినప్పటి నుంచి ఆయనకు సేంద్రీ య పద్ధతుల్లో పండే కూరగాయలు దొరకటం లేదు. ఓ రోజు కూరగాయల విక్రయదారుడు టెర్రస్ మీద పండించమని సలహా ఇచ్చాడు. ఇదేదో బాగుందని ధైర్యం చేసి పది రకాల కూరగాయల మొక్కలు నాటారు. వ్యవసాయదారుల కుటుంబం నుంచి రావటం వల్ల విధి నిర్వహణకు ఆటం కం లేకుండా ఖాళీ సమయం లో వీటి సంరక్షణ చర్యలు తీసుకుంటూ ఏపుగా పెం చారు. మొక్కలను పెంచాలంటే ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం లేదని, ప్రతిరోజూ క్రమం తప్పకుండా నీళ్లు పోస్తే చాలు, స్టేషన్‌లోని మిగిలిన సిబ్బంది కూడా సహకరిస్తుంటారని పోలీసు అధికారి బాలకృష్ణారెడ్డి చెబుతున్నారు. మల్లపేట గ్రామం నుంచి ఎర్రమట్టి, ఆవుపేడను సేకరిస్తారు. వీటితో సేంద్రీయ ఎరువులను తయారుచేసి మొక్కలకు వేస్తుంటారు. విత్తనాలు విత్తిన నలభై రోజుల్లోనే మొక్కలు ఏపుగా పెరిగాయని బాలకృష్ణారెడ్డి తెలియజేస్తున్నారు. పాలకూర, మెంతికూర వంటి ఆకుకూరలు చేతికి వచ్చాయి. ఇక టమాటా, బీన్స్, పచ్చిమిరపకాయ, వంకాయ, ఉల్లిగడ్డలు, సొరకాయ వంటి కూరగాయలు రెండు వారాల్లో పంటకు వస్తాయి. బాలకృష్ణారెడ్డి బాచుపల్లిలోనే కాదు బంజారాహిల్స్, ఉప్పల్ ప్రాం తాల్లో పనిచేసినా అక్కడ కూడా ఇలాగే మొక్కలను పెంచారు. పర్యావరణాన్ని కాపాడటం మన చేతుల్లోనే ఉందని చాటిచెప్పారు. కొద్దిపాటి ఖాళీ స్థలం దొరికినా సేంద్రీయ పద్ధతుల్లో కూరగాయలను పండించుకుంటే కుటుంబం మొత్తం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటుందని నమ్మే ఈయన పైకప్పు చల్లగా వేడి వాతావరణాన్ని రక్షణ ఇస్తుందని అంటారు.