Others

నిత్య’నూతనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు స్క్రీన్‌మీద పట్టుమని పది సినిమాలు చేయకున్నా -అందరి హీరోయిన్లకంటే అరడజను మార్కులే ఎక్కువే పడతాయి నిత్యమీనన్‌కు. అందుక్కారణం -వంకపెట్టలేని ఆమె పెర్ఫార్మెన్స్. తెలుగులో తక్కువ చేసినా -నిత్య ట్రాక్ రికార్డు మాత్రం చిన్నదైతే కాదు. అటు కన్నడ, ఇటు మలయాళం, మధ్యలో తమిళం.. ఇలా దక్షిణాది భాషా చిత్రాల్లో నిత్యది సెపరేట్ ట్రాక్. ప్రొఫెషనల్ ఫిమేల్ ఆర్టిస్టుల్లో ఆమె ప్రత్యేకం -అనదగ్గ ఎన్నో పాత్రలు పోషించింది నిత్య. ఆమధ్య వరుస సినిమాలతో సందడి చేసినా ‘జనతా గ్యారేజ్’ తరువాత ఆమె జోరు తగ్గింది. కారణం? అనడిగితే ‘నచ్చిన పాత్రలు పడకపోవడమే’ అంటోంది. ‘క్రేజ్ ఉందికదాని వరుస సినిమాలు చేసేసే ఆలోచన లేదు. నటనకి అవకాశముండే పాత్రలు పడితేనే సినిమా చేస్తా’ అన్నది నిత్య బలంగా చెప్పే మాట. ఈ డైలాగ్ చాలా మంది హీరోయిన్లూ చెప్తారని కొట్టిపారేయడానికి లేదు. ఎందుకంటే -ఆమె అంతకుముందు అలాంటి పాత్రల్లోనే కనిపించింది కనుక. ‘అలా మొదలైంది’ అంటూ వచ్చిన ‘నిత్య’, ‘ఇష్క్’లో ప్రియగా, ‘గుండెజారి గల్లంతయ్యిందే’లో శర్వాణిగా, ‘మళ్లీమళ్లీ ఇది రానిరోజు’లో నజీరాగా, ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో వల్లీ.. ఇలా ప్రతి చిత్రంలోనూ తన పాత్రతో బలమైన ముద్రే వేసుకుంది నిత్య. చాలాకాలం గ్యాప్ తరువాత మళ్లీ తెలుగు తెరపై రెండు చిత్రాల్లో కనిపించే అవకావం ఉందని అంటున్నారు. కన్నడలో హిట్టుకొట్టిన ‘యుటర్న్’ తెలుగు రీమేక్‌లో లీడ్ రోడ్ చేసేందుకు సైన్ చేసిందని అంటున్నారు. కథానాయిక ప్రాధాన్యత కలిగిన కథతో కొత్త దర్శకుడితో కెఎస్ రామారావు నిర్మించబోయే చిత్రంలోనూ నిత్యమీనన్ నటించబోతోందని తెలిసింది. అంటే, వచ్చే సీజన్‌లో మళ్లీ నిత్య చిత్రాల జోరు పెంచబోతోందన్న మాట.

-ప్రవవి