AADIVAVRAM - Others

ఈ పదాల పుట్టుక ఇదీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో మొత్తం 5 వేల భాషలు ఉన్నాయి. వాటిలో 2700 భాషలకు ‘లిపి’ (రచనా విధానం) ఉంది. మిగతా 2300 భాషలకు లిపి లేదు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఈ వివిధ భాషలూ స్వతంత్రంగా పుట్టినవి కావచ్చు అని మనందరికీ అనిపించవచ్చు. కానీ ఏ భాషలోని ఏ ఒక్క పదమూ స్వతంత్రంగా ఏర్పడినది కాదు. ప్రతి భాషలోని ప్రతి పదమూ మానవ జాతికి మూల పురుషులైన మహా ఋషుల భాషయైన ‘దేవభాష సంస్కృతం’ వికృతరూపమే తప్ప వేరే ఏదీ కాదు.
మహా ఋషుల భాషయైన ‘సంస్కృత’ పదాల వికృత రూపాలే వివిధ భాషలలోని పదాలుగా రూపొందినాయి అనే సత్యం ఆ పదాల మూల రూపాలు ఏవి అయి ఉండవచ్చునో ఊహించి పరిశోధించగలిగితే అర్థమవుతుంది.
ఉదాహరణకు తెలుగులోని పదాలనే తీసుకుందాం.
అన్నిటికన్న ముందుగా ‘తెలుగు’ అనే పదానే్న తీసుకుందాం. దీనికి మూలం ‘త్రిలింగ’ అనేది అని చాలా మందికి తెలిసి ఉండవచ్చు. ఇలా ఏ ఇతర తెలుగు పదాన్ని తీసుకున్నా అది దాని శబ్దసామ్యం కలిగిన సంస్కృత పదం వికృత రూపమే అని స్పష్టం కావడానికి ఎక్కువసేపు పట్టదు. అయితే నిష్పాక్షిక దృష్టితో, సుస్థిరమైన పరిశోధన మాత్రం అవసరం.
పరిశోధనా దృష్టి లేకపోతే మాత్రం సత్యం ఎన్నటికీ బహిర్గతం కాజాలదు. ఎలాగ అంటారా?
మనకు అన్ని పనులకు ముఖ్య అవసరమైన ‘చెయ్యి’ ‘కాలు’ అనే పదాలనే చూద్దాం. ఈ పదాలు ఎలా వచ్చాయో దాదాపుగా ఏ తెలుగు పండితుడు చెప్పజాలడు. ఎవ్వరూ దీనిని గురించి ఆలోచించనే లేదు కాబట్టి. అంతేకాదు. ఈ పదాలకు మూలాలు సంస్కృత పదాలు అయి ఉండవచ్చునేమో అనిపించినా అవి ఏవో సాధారణంగా ఎవ్వరికీ అంతుపట్టవు కాబట్టి.
ఇప్పుడైనా ఈ ‘చెయ్యి’ ‘కాలు’ అనే పదాలకు సంస్కృత మూలాలు ఏవో తెలుసుకోవాలని అనిపించటం లేదూ?
‘చెయ్యి’ అనే పదానికి సంస్కృత పర్యాయ పదాలు ‘హస్త’ ‘కర’ అనేవి. కాని వాటిని ఎలా మార్చినా ‘చెయ్యి’ అనే పదం ఏర్పడదు. మరి ఎక్కడ నుంచి వచ్చింది ఈ ‘చెయ్యి’ అనే పదం?
తెలుగుతోపాటు సంస్కృతం కూడా అభ్యసించిన పండితులు తాము చదివిన భాషాశాస్త్ర సూత్రాలు గుర్తుకు తెచ్చుకుంటే తళుక్కున వారి మనస్సుల్లో మెరవవచ్చు. వారు ఒకప్పుడు చదివిన ‘శయహస్తే’ అనే మాత్రం.
దీని అర్థం: ‘శయ’ అంటే ‘చెయ్యి’ అని.
ఇప్పుడు స్పష్టం అయిందా? ‘చెయ్యి’కి మూలం ‘శయ’ అని.
అలాగే ‘కాలు’ అనే పదానికి పర్యాయ పదంగా వాడుకలో ఉన్నది ‘పాద’ అనే పదం మాత్రమే. నిజానికి ‘పాదములు’ మనం నిలబడడానికి ఆధారం అయిన ‘అడుగులు’ మాత్రమే అవుతాయి తప్ప పైన నిటారుగా ఉన్న స్తంభాలు కాదు.
మరి ఈ స్తంభాలకు ‘కాలు’ అనే పేరు ఎలా వచ్చింది?
ఎలా అంటే? వాటికి ‘కాలమానములు’ అనగా ‘కాలాన్ని కొలిచేవి’ అనే పేరు ఉన్నది కాబట్టి. సూర్యుని ఎదుట నిలబడితే ఏర్పడే వీటి నీడ పొడుగును బట్టి కాలాన్ని కొలిచి చెప్పడం ఒక విధానమూ, సంప్రదాయామూ అయి ఉన్నవి. అందువల్ల ‘కాలమాన’ అనే పదమే ‘కాలు’ గా స్థిరపడిందని స్పష్టమవుతుంది.
వ్యాస మహర్షి రచించిన మహాభారత గ్రంథం ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ, అన్ని భాషలలోనూ అనువర్తితమై నిరంతర పురాణ పాఠ్యాంశంగా కొనసాగుతున్నది. ఈ పరిస్థితి వల్ల ఈ మహాభారత కథగా ఎవరు ఎవరికి చెప్పారు? అనే ప్రశ్న వచ్చినప్పుడు వ్యాస మహర్షి తన ముఖ్య శిష్యుడైన ‘వైశంపాయన’ మహర్షికి చెప్పాడనీ, ఆ ‘వైశంపాయన’ మహర్షియే అర్జునుని మనుమడైన పరీక్షిత్తుని కుమారుడు జనమేజయుడు నిర్వహించిన మహా యజ్ఞంలో ఈ భారత కథను ప్రజలందరికీ మనోరంజకంగా ఉండేట్లు గానం చేశాడు. ఈ కథనే నైమిశారణ్యంలో సూత మహర్షి శౌనకాది మహర్షులకు వినిపిస్తూ దీనికి అంతకు మూలాధార పురుషుడు ‘వైశంపాయన’ మహర్షియేననీ చెప్పడం జరిగింది.
అలా భారత కథ ఎక్కడ విన వచ్చినా అక్కడ ‘వైశంపాయన’ మహర్షిని స్మరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎక్కడికి వెళ్లినా ‘వైశంపాయన’ అనే పదం వినవచ్చేది. అలా అనంత ప్రఖ్యాతి చెందిన వ్యక్తి ‘వైశంపాయన’ కాబట్టి కాలక్రమేణా అట్టి విశిష్ట కార్యక్రమాల మూల పురుషులకు ‘వైశంపాయన’ అని పిలవడం ప్రారంభమైంది. ఆ ‘వైశంపాయన’యే కాలక్రమంలో ‘్ఛంపియన్’గా ఆంగ్ల దేశంలో, ఆంగ్ల భాషలో స్థిరపడిందని నిస్సందేహంగా చెప్పవచ్చు.

-సన్నిధానం యజ్ఞనారాయణ మూర్తి