Others

బిడ్డని అమ్మి ‘మందు’కొన్న జంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొకారో స్టీల్ సిటీలో ఆ పడుచు దంపతులు తడి పొడి ఇస్ర్తిలు చేసుకుంటూ మూడు పదులు నిండకముందే ఐదుగురు సంతానాన్ని కన్నారు. చీకటిపడేసరికి మందుచుక్క పడితేనే తప్ప బ్రతకలేని రాజేష్ జంట, సంతోష్ సహిష్ అనే నాటు వైద్యుడికి నలభైఐదు వేల రూపాయలకి బేరం కుదుర్చుకొని తన ఆరు నెలల పసిబిడ్డను ఇచ్చేశారు. రోజూ మీరు తాగినంత మద్యం పోయిస్తానని ఆ నాటువైద్యుడు అన్నాడు. ఆరుమాసాల పసిగుడ్డును తీసుకుపోయి మేఘు మహతోకి లక్షన్నరకి అమ్మేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సారా మనసారా గ్రోలే ఆ తల్లికి 28 సంవత్సరాలే వయసు కాని పదేండ్లలోపు వయసు పిల్లలు ఇంకా నలుగురు వున్నారు. అంచేత బిడ్డని అమ్మేసుకున్నదా తల్లి. బొకారో శిశు సంక్షేమ సంఘం రంగంలోకి దిగింది కనుక బిడ్డ తిరిగి తల్లి ఒడి చేరింది. నాటు వైద్యు డు పసిబిడ్డల్ని అమ్మే వ్యాపారం చెయ్యడు కానీ పడుచు పిల్లల్ని మభ్యపెట్టి సరిహద్దులు దాటించేస్తూ వుంటాడు. కొండజాతి వాళ్ళని పైసలతో ఆకర్షించి పసిపిల్లల్ని వేరే ప్రాంతాలకు అమ్మేసే దళార్లున్న ప్రాంతం జార్ఖండ్‌లోని బొకారో జిల్లా. వెట్టిచాకిరి కోసం వ్యభిచారంకోసం పిల్లలని సరఫరా చేసిన కేసులు ఈ ప్రాంతంలో కొన్ని వేలు ఉంటాయని శిశు సంక్షేమ సంస్థ అంటోంది. ఇరవై రూపాయల స్టాం పు కాగితంమీద అగ్రిమెంట్లు చేసుకుంటారుట. పదిహేను వేల రూపాయలకి అగ్రిమెంటు రాసుకుని పోయినేడాది ఓ జంట పసిగుడ్డను అమ్మేసిన ఉదంతం పోలీసులు ఈ సందర్భంలో గుర్తుచేసుకున్నారు.