Others

ఒంటరిగా దేశాన్ని చుట్టేసింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దూర ప్రాంతాలకు ఆడపిల్లలు ఒంటరిగా వెళ్లాలంటే భయం. అలాంటిది పూజ రాజ్‌పుట్ అనే నావీ అధికారిణి రెండు వేల కిలోమీటర్లు సూపర్‌బైక్‌పై ప్రయాణించి గోవా, మంగుళూరు, ఊటీ, కాళీఘట్, కార్వార్ వరకు ప్రయాణించింది. గుంపుతో వెళితే తాను అందించాల్సిన సందేశాన్ని ప్రజలకు చేరదేమో అనుకుని పూజా రాజపుత్ 1600సిసి సూపర్‌బైక్ మీద తన ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రయాణంలో ఆమె అనేకమందితో మాట్లాడుతూ ఆర్థిక స్వాతంత్య్రం లేనిదే సాధికారిత సాధ్యం కాదనే సందేశాన్ని వినిపించింది.
నేవీ అధికారిణిగా ఇచ్చిన శిక్షణ ఆమెకు ఈ ప్రయాణంలో ఎంతో ఉపయోగపడింది. రోడ్డుమీద ప్రయాణం చేస్తుంటే ఇబ్బందులెదురైనా ధైర్యంగా ఎదుర్కోగలిగింది. ఓంటరిగా ప్రయాణం చేస్తుంటే ఆకతాయిలు ఇబ్బంది పెట్టినా..అనుకోని ఆపద సంభవించినా ఎదుర్కొనేందుకు ఓ చిన్న కత్తి, ఐరన్ రాడ్, పెప్పర్ స్ప్రే ఆయుధాలుగా ఉపయోగించుకున్నది. పూజ ప్రయాణించిన రోడ్డంతా కోస్టల్ ఏరియా. అంతేకాదు కొండ ప్రాంతం అవ్వటం వల్ల వెళ్లిన ప్రతిచోటా వింతగా చూసినా.. ఎన్నో అనుభవాలను ఆమెకు ఎదురయ్యాయి. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎంతో మంది ప్రజలను పరిచయం చేసుకుంది. ఒంటరిగా ప్రయాణం చేస్తున్నానే బెంగ లేకుండా వారంతా తనతో సంతోషంగా మాట్లాడారని, చాలామంది ఫొటోలు కూడా తీసుకున్నారని ఆమె చెప్పారు. చాలామంది చిన్న బైకుల మీద వెళ్లేవారు తన బైక్‌ను విచిత్రంగా చూస్తూ వెళ్లేవారని, పెట్రోల్ బంకుల్లో పనిచేసేవారు, పలు గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాలు తనని ఆదరించి అక్కున చేర్చుకున్నారని చెప్పారు. నచ్చిన ప్రదేశంలో కాసేపు కాఫీ తాగుతూ.. అందమైన దృశ్యాలను ఫొటోలు తీసుకుంటూ సరదాగా ప్రయాణం సాగిందని పూజ వెల్లడించింది. ఇలా ఒంటరిగా ప్రయాణం చేయాలనే అభిలాష ఉంటే మహిళలు తమ జాగ్రత్తలో తాము ఉండాలని, తప్పనిసరిగా ఆత్మరక్షణ కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచిస్తున్నారు. మరింకెందుకు ఆలస్యం ఇలా మీరు మీతోనే ఉంటూ ట్రిప్‌ను ఎంజాయ్ చేయటం ఓ సరికొత్త చక్కని అనుభూతిని సొంతం చేసుకోండి.