AADIVAVRAM - Others

ప్రముఖ శాస్తవ్రేత్తలు రాంట్‌జెన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుత ప్రపంచంలో ‘ఎక్స్‌రే’ గురించి తెలియని వారంటూ ఉండరు. మనిషి శరీరంలో ఉన్న ఎముకలను, ఇతర శరీర భాగాలను ఎక్స్‌రే ఫొటో ద్వారా స్పష్టంగా చూపించే ఆధునిక మెడికల్ టెక్నాలజీ ఎక్స్‌రే. ఈ కాలంలో అయితే ఇలా చూడగలుగుతున్నాం కానీ పూర్వం ఈ పరిస్థితి లేదు.
జర్మనీ దేశానికి చెందిన ‘రాంట్‌జెన్’ అనే శాస్తజ్ఞ్రుడు ఎక్స్‌రే సాధనం కనిపెట్టిన తీరు విచిత్రంగా ఉంటుంది. మానవాళికి ఉపయోగపడే సాధనాన్ని కనిపెట్టిన విల్‌హోమ్ కానార్డ్ రాంట్‌జన్ మహాశయుడు జర్మనీలోని లెనెస్ అనే పట్టణంలో 1845లో జన్మించాడు. తండ్రి బట్టల వ్యాపారస్థుడు. రాంట్‌జెన్‌కి చిన్నతనం నుండీ వ్యాపారం మీద మక్కువ వుండేది కాదు. ఏదైనా గొప్ప విషయాన్ని కనిపెట్టాలనే తపనతో నిరంతరం పుస్తకాలను చదివేవాడు.
ఆ రోజుల్లో ఏవైనా శరీర భాగంలోని ఎముకలు విరిగితే ఎక్కడ విరిగిందో? నొక్కి పట్టి అక్కడ కట్టు కట్టేవారు. అది చాలా బాధాకరంగా ఉండేది. పాఠశాల అనంతరం రాంట్‌జెన్ స్విట్జర్లాండులో జెరుచ్ పాలిటెక్నిక్ ఇనిస్టిట్యూట్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సు చదివి, అధ్యాపకుల మన్ననలను పొంది, అనంతరం పై చదువులు చదివి తన 24వ ఏట ఫిజిక్స్‌లో డాక్టరేట్ తీసుకున్నాడు. అతని తెలివితేటలను గురించి విన్న జర్మనీలోని స్ట్రాస్‌బర్గ్, గిస్సెన్ యూనివర్సిటీల యాజమాన్యం వారు తమ వద్ద ప్రొఫెసర్‌గా చేరమని కోరారు. ఆ రెండు యూనివర్సిటీలలోనూ అధ్యాపకుడిగా పని చేసిన రాంట్‌జెన్ ప్రతిరోజూ ఎక్కువ సమయం లేబొరేటరీలో గడుపుతూ కొత్తకొత్త ప్రయోగాలు చేసేవాడు.
ముఖ్యంగా కాంతి కిరణాలు ఏయే పదార్థాల గుండా ప్రవేశించగలవు అనే విషయంపై పరిశోధనలు చేస్తుండేవాడు. ఒకనాటి రాత్రి అలా ప్రయోగం చేస్తూండగా పక్కనున్న అతని చేతి నీడ పడింది. ఆ నీడలో చేతిలోని ఎముకలు స్పష్టంగా కనిపించాయి. అంతే! ఆ ప్రయోగ ఫలితమే ‘ఎక్స్‌రే’. ఆ ‘రే’ (కిరణాలకు) ఏ పేరు పెట్టాలో తెలియక ‘ఎక్స్’ అన్నాడు. అప్పటి నుండీ ‘ఎక్స్‌రే’గా వాడుకలోకి వచ్చింది.
1901లో ‘రాంట్’కు ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ బహుమతి లభించింది. ఆయన 1923లో మరణించాడు.

-పి.వి.రమణకుమార్