AADIVAVRAM - Others

పాస్‌వర్డ్ (సండేగీత)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనుషులకి మరుపు ఎక్కువ. సహాయం చేసిన వ్యక్తులని, సంఘటనలని ఎక్కువగా మర్చిపోతుంటారు. అందుకని ఆ విషయం గుర్తుచేసే వ్యక్తులు అవసరం ఏర్పడుతారు. అయితే అది అన్ని విషయాల్లో కాదు. కొన్ని విషయాలు మర్చిపోరు. ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్లని మర్చిపోరు. తరచూ గుర్తు పెట్టుకొని బాధపడుతూ ఉంటారు. వాళ్లని గుర్తు పెట్టుకోవడం వల్ల అనవసరమైన నెగెటివ్ ఎనర్జీ ఎక్కువై పోయి ఆరోగ్యం పాడవుతుంది.
ఈ విషయం గురించి ఓ మంచి కథనాన్ని ఇంటర్నెట్‌లో చదివాను. ‘పాస్‌వర్డ్ నా జీవితాన్ని ఎలా మార్చింది’ అన్న కథనం. ఆ వ్యక్తి జీవితాన్ని పాస్‌వర్డ్ ఎలా మార్చివేసిందో చూద్దాం.
ఓ వ్యక్తికి భార్యతో మాటామాటా పెరిగి దూరమయ్యాడు. ఆమె మళ్లీ దగ్గర కావడానికి ఆమె ప్రయత్నం చేసింది. కానీ ఆ వ్యక్తి అందుకు సిద్ధంగా లేడు. ఆ ఘర్షణలో ఆమె కొన్ని మాటలని కటువుగా అంది. ‘నిన్ను పెళ్లి చేసుకోవడం నాకిష్టంలేదు. కానీ మా నాన్న వత్తిడి వల్ల చేసుకున్నాను’. ఈ మాటలని అతను మర్చిపోలేక పోతున్నాడు. అందుకని ఆమె మళ్లీ అతని దగ్గరికి వచ్చే ప్రయత్నాన్ని స్వీకరించలేక పోతున్నాడు. ఎందరు ఎన్ని చెప్పినా అతని మనస్సు మారలేదు. ఆమె మాటలే అతని మనసులో గింగుర్లు మంటున్నాయి.
అతను ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. కంప్యూటర్‌తో అతని సహజీవనం. ఒక రోజు కంప్యూటర్‌ని తెరిచాడు. స్క్రీన్ మీద అతనికి ఓ సందేశం కన్పించింది.
‘మీ పాస్‌వర్డ్ ముగిసిపోయింది.
కొత్త పాస్‌వర్డ్ కోసం
క్లిక్ చేయండి’
ఇది దాని సారాంశం. అతనికి కోపం వచ్చింది. మైక్రోసాఫ్ట్‌లో పనిచేసే ఉద్యోగులందరికి ప్రతి 30 రోజులకొకసారి పాస్‌వర్డ్ మార్చుకోమని ఆ సందేశం వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. అతనికి విసుగ్గా అన్పించింది. కానీ తప్పదు. పాస్‌వర్డ్‌లో ఎనిమిది రకాల క్యారెక్టర్స్ ఉండాలి. ఒకటి పెద్ద అక్షరం, రెండవది చిన్న అక్షరం, ఒక సంఖ్య, ఒక గుర్తు, ఇవి కనీసం ఉండాలి. గతంలో వాడిన పాస్‌వర్డ్స్ మళ్లీ వాడడానికి వీల్లేదు. ఎన్ని పాస్‌వర్డ్‌లు తయారుచేయాలోనన్న విసుగు అతనికి కలిగింది. చేయాల్సిన పనులతో పాస్‌వర్డ్ తయారుచేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. పాస్‌వర్డ్‌ల తయారీలో అతని భార్య గతంలో బాగా సహాయం చేసేది. భార్యని క్షమిస్తే... అన్న పాస్‌వర్డ్ తయారుచేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది.
కర్సర్ బ్లింక్ అవుతూ కన్పించింది. వెంటనే మాధురి క్షమించాను22. అని టైప్ చేశాడు. మాధురిలో ‘మా’ పెద్ద అక్షరం, ‘క్ష’ అనేది చిన్న అక్షరం, 22 ఆ రోజటి తేదీ. సులువుగా గుర్తుండే విధంగా పాస్‌వర్డ్‌ని తయారుచేశాడు. ముప్పై రోజులు అదే పాస్‌వర్డ్‌ని అతను టైప్ చేయాలి. అంతేకాదు కంప్యూటర్‌ని ఓ ఐదు నిమిషాలు వాడకపోయినా మళ్లీ ఆ పాస్‌వర్డ్‌ని టైప్ చేయాలి.
ఆ విధంగా అది నెలరోజులు టైప్ చేశాడు. ఆ మంత్రం అతన్ని ప్రభావితం చేసింది. ఆమెను క్షమించాలన్న ఆలోచన అతనిలో కలిగింది. ఆ ఆలోచన కలిగిన రోజున అతని భార్య క్షమాగొంతుతో ఫోన్ చేసింది.
అంతే!
ఆమెను ఇంటికి రమ్మన్నాడు. ఒంటరి జీవితం ముగిసింది. జంట జీవితం మొదలైంది. ఆ తరువాత చేయాల్సిన పనులని పాస్‌వర్డ్‌లుగా తయారుచేయడం మొదలుపెట్టాడు.
దాంతో అతని జీవితం చాలా మెరుగుపడింది. అందరి మాటలకన్నా అతను సృష్టించుకొన్న పాస్‌వర్డ్ మంత్రంలా పని చేసి అతని జీవితాన్ని మార్చివేసింది.

- జింబో 94404 83001