Others

ఆ కోరిక అలా తీరింది! (శరత్కాలం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పుడంటే -తిరుపతి యాత్ర సులువైపోయింది. ఒకప్పుడు తిరుపతి వెళ్లడమంటే పెద్ద ప్రహసనం. కుటుంబాల సమేతంగా తిరుపతి యాత్రకు వెళ్లిన సినీ అభిమానులు కొందరు -అట్నుంచి అటే చెన్నపట్నానికీ వెళ్లేవారు. ఎందుకంటే -నందమూరి తారక రామారావును చూడాలని. ఆయనను ఒక్కసారైనా కలవాలని. రోజూ వందలాదిగా వచ్చే అభిమానులు బజుల్లారోడ్‌లోని ఎన్టీఆర్ ఇంటి ముందు వరుసగట్టేవారు. అలా కలిసే వాళ్లలో కొందరికి -మరో కోరికా ఉండేది. ఎన్టీఆర్ సినిమాల్లో చిన్న వేషం లభించినా చాలని. ఆయనతోపాటు నటించి జన్మ ధన్యం చేసుకోవాలని ఆశపడే జూనియర్ ఆర్టిస్టులూ ఉండేవారు. ఇక అదృష్టం కలిసొచ్చి ఆయన సినిమాలో నటించే అవకాశం లభిస్తే.. తరువాత వరుస అవకాశాలు వస్తే.. ఇక అలాంటి నటుడి జీవితానికి అంతకుమించిన అదృష్టం ఏముంటుంది? ఆ అదృష్టం అక్కడితో ఆగకుండా, ఆయనతో నటించిన చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడి, విజయోత్సవ సభలో ఎన్టీఆర్ చేతుల మీదుగా జ్ఞాపిక అందుకునేంత వరకూ వెళ్తే.. అంతటి అదృష్టం దక్కితే. ఇంత జరగాలంటే -గత జన్మలో ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలని భావించిన వాళ్లూ అప్పట్లో ఉండేవారు. అలా ఆశపడి.. అదృష్టం వరించి.. ఆయనతో నటించాడు. గొప్ప నటుడిగా పేరు సంపాదించి, ఎన్టీఆర్ చేతుల మీదుగా జ్ఞాపిక తీసుకునే అదృష్టాన్నీ సంపాదించుకున్నాడు ఈ ఎన్టీఆర్ వీరాభిమాని. అతనే రాజబాబు. కామెడీకి కొంత అర్థాన్ని చెప్పి, దానికొక ఆహార్యాన్ని అలవాటు చేసిన నటుడు. పైన చెప్పిన ఆశ, అదృష్టం, అవకాశం అన్నీ రాజబాబు నోటినుంచి వెలువడిన మాటలే. ‘నా తొలినాటి రోజుల్లో నాకు కలిగే కోరికలకు పరిమితి ఉండేది కాదు. అయితే, అన్ని కోరికలూ నెరవేరాయి. ఆఖరి కోరిక ఇవ్వాళ ఇలా తీరింది’ అన్నాడు ఈ జ్ఞాపికను అందుకునే సమయంలో రాజబాబు. ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య హైదరాబాద్ వెంకటేశ థియేటర్‌లో (ఇప్పుడు థియేటర్ లేదు) జరిగిన కృష్ణవేణి చిత్రం శతదినోత్సవంలో ఎన్టీఆర్ చేతుల మీదుగా జ్ఞాపికను అందుకుంటున్న ఈ చిత్రం వెనుక -అన్ని అరుదైన ఆశలు, జ్ఞాపకాలు ఉన్నాయి.

9849601717 -పర్చా శరత్‌కుమార్