ఆంధ్రప్రదేశ్‌

ఏడాదికల్లా పోలవరం .. వచ్చే జూన్ నాటికి గ్రావిటీ ద్వారా తాగు, సాగునీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వచ్చే జూన్ నాటికి గ్రావిటీ ద్వారా తాగు, సాగునీరు

ఆగస్టు 15న పురుషోత్తపట్నం ఎత్తిపోతల ప్రారంభం నిరుద్యోగులకు ఉపాధి కల్పనపై మహానాడులో చర్చిస్తాం
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడి పోలవరం పనుల పర్యవేక్షణ

పోలవరం, మే 22: వచ్చే ఏడాది జూన్ నాటికి గ్రావిటీ ద్వారా తాగు, సాగు నీరు అందించాలనే లక్ష్యంగా పోలవరం పనులు సాగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. పనులన్నీ నిర్దేశిత లక్ష్యం మేరకు సాగుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుండటంతో పనులన్నీ వేగంగా జరుగుతున్నాయన్నారు. 41.15 మీటర్ల ఎత్తు డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తయితే 2018నాటికి గ్రావిటీ ద్వారా నీటిని కాల్వలకు తరలించవచ్చన్నారు. అలాగే 2019నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటించారు. స్పిల్‌వే లోని రేడియల్ గేట్ల తయారీ, స్పిల్‌వే కాంక్రీటు, డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అధికారులు, కాంట్రాక్టు ఏజన్సీ ప్రతినిధులతో ప్రాజెక్టు పనులపై సమీక్ష జరిపారు. అనంతరం విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే రాష్ట్రంలో నీటి కొరత లేకుండా చేస్తామన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో 10.55 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి తీయాల్సి ఉండగా ఇప్పటివరకు 6.84కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి తీశామని, మిగిలిన పనిని జూన్ నాటికి పూర్తిచేయాలని నిర్దేశించామన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల జనవరికి పూర్తికావచ్చని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అలాగే స్పిల్‌వేలో అమర్చే రేడియల్ గేట్లు 12 పూర్తయ్యాయని, మరో 4 గేట్లు పది రోజుల్లో పూర్తవుతాయన్నారు. డయాఫ్రం వాల్ నిర్మాణం జూన్ నాటికి 419.67మీటర్లు పూర్తిచేయాలని లక్ష్యం కాగా ఇప్పటివరకు 294మీటర్లు పూర్తయ్యిందన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో 3821మంది పని చేస్తున్నారని, అందులో 1659మంది టెక్నికల్ సిబ్బంది అని సిఎం పేర్కొన్నారు. స్పిల్‌వేలో 16,40,450 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు జరగాల్సివుండగా ఇప్పటివరకు 62,197 క్యూబిక్ మీటర్ల పనులు జరిగాయని, ఈ పనులు ఇంకా వేగంగా జరగాల్సి ఉందన్నారు. కాంక్రీటు పనుల కోసం విదేశాల నుండి అధునాతన యంత్రాలు త్వరలో తీసుకువస్తామని, అవివస్తే పనులు ఇంకా వేగంగా జరుగుతాయన్నారు.
ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని, ఇప్పటివరకు 16సార్లు ప్రత్యక్షంగా వచ్చి పనులు పరిశీలించానని, 26సార్లు సమీక్ష ద్వారాపరిశీలించి పనులు వేగవంతం అయ్యేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. కాంట్రాక్టరు, పోలవరం అథారిటీ, ప్రభుత్వ ఇంజనీర్లు సమన్వయంతో లక్ష్య సాధనకు కృషి చేస్తున్నారని సిఎం ప్రశంసించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు చేసిన రూ.3200 కోట్లు రీయింబర్స్‌మెంటుకు కేంద్రానికి బిల్లులు పంపినట్టు చెప్పారు. తూర్పు గోదావరి జిల్లాలోని పురుషోత్తపట్నం ఎత్తిపోతల పనులు వేగంగా జరుగుతున్నాయని, ఈ ఏడాది ఆగస్టు 15న ప్రారంభిస్తామని చంద్రబాబు తెలిపారు.రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి మహానాడులో చర్చిస్తామన్నారు. రాష్ట్ర ఆదాయం ఇంకా పెరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడ మహానాడులో చర్చిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వివరించారు. కార్యక్రమంలో మంత్రులు పితాని సత్యనారాయణ, పైడికొండల మాణిక్యాలరావు, పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు, కలెక్టర్ కాటంనేని భాస్కర్, ఎస్పీ భాస్కర్ భూషణ్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... పోలవరం ప్రాజెక్టు పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు