AADIVAVRAM - Others

దేవుడెక్కడున్నాడు? (కథాసాగరం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం రకరకాల మతాల వాళ్లను చూస్తూ ఉంటాం. మనిషిని మనిషిగా చూస్తే ప్రపంచంలో ఎవర్నీ ఇతను ఫలానా మతం వాడని మనం గుర్తుపట్టలేం. పిలకలు ఉండడం, గడ్డం పెంచుకోవడం, మెడలో రుద్రాక్షలు, లేదా మత చిహ్నాలు వేలాడదీసుకోవడం దాన్ని బట్టి ఎవరికి వారు నేను ఫలానా మతానికి చెందినవాణ్ణి అని ప్రదర్శించుకుంటారు.
ఎవరి ప్రార్థనాలయాలకు వాళ్లు వెళతారు. ఇతర్ల మందిరాలకు వెళ్లరు. వాళ్ల ఉద్దేశంలో దేవుడు వాళ్ల ప్రార్థనా మందిరంలోనే ఉంటాడు. ఇతర మతస్థులు పాపులు. ప్రతి మతస్థుడూ ఇంకో మతస్థుణ్ణి అలాగే అనుకుంటాడు.
హసన్ అని ఒక భక్తుడు ఉండేవాడు. నిరంతర దైవ చింతనలో నిమగ్నుడై ఉండేవాడు. డెబ్బయ్యేళ్లపాటు ఎడ తెగకుండా మసీదుకు సమయానికి వెళ్లి ప్రార్థనలు చేసేవాడు. డెబ్బయ్యేళ్ల నించీ అతను క్రమం తప్పకుండా మసీదుకు వస్తూ ప్రార్థనలు చేస్తున్నాడని గ్రామానికంతా తెలుసు. డెబ్బయ్యేళ్లు అతనికి మసీదుతో అనుబంధం. అతనూ, మసీదూ వేరు కాదన్నంతగా కలిసిపోయారు. హసన్ లేని మసీదును ఎవరూ ఊహించలేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎప్పుడూ క్రమం తప్పకుండా మసీదుకు రావడం కుదరదు. ఏదో పనుల వల్ల ఇతర ప్రాంతాలకు వెళతారు. సమయానికి అక్కడ ప్రార్థనలు జరుపుతారు. అది వేరే విషయం. కానీ అదే మసీదుకు రావడానికి వాళ్లకు కుదరదు కదా!
కానీ హసన్ గ్రామాన్ని వదిలి వెళ్లేవాడు కాదు. అందువల్ల మసీదుకు అనునిత్యం దర్శించేవాడు. రోజుకి ఐదుసార్లు క్రమం తప్పక నమాజు చేసేవాడు. కొన్ని సమయాల్లో అనారోగ్యం పాలయినా అతను మసీదుకు రావడం మాత్రం మానలేదు.
ఒకరోజు ఉదయానే్న అతను మసీదులో కనిపించలేదు. అతను రాకపోవడమన్నది అసంభవం. అతను మసీదుకు రాలేదంటే అతను చనిపోయాడని అర్థం. అందరూ అతని విషయంలో అంత దృఢమైన అభిప్రాయం ఏర్పరచుకున్నారు. ప్రార్థనలు ప్రారంభమయ్యాయనుకుంటే అక్కడ హసన్ ఉంటాడని అందరి నమ్మకం. ఏమైంది? నడవలేని స్థితికి చేరుకున్నాడా? ఎందుకు రాలేదు? తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడా? ఎంత ఆలోచించినా జనాలకు అంతుబట్టలేదు.
జనాలు అతన్ని వెతుక్కుంటూ పోయారు. హసన్ ఒక చెట్టు కింద కనిపించాడు. ఆశ్చర్యపోయారు. ఆరోగ్యంగానే కనిపించాడు. ఎందుకని మసీదుకు రాలేదు? అతనే్న అడిగి తెలుసుకుందామనుకుని అడిగారు.
హసన్ ‘నేను క్రమం తప్పకుండా డెబ్బయి సంవత్సరాలు మసీదుకు వచ్చాను. ఆయన ఆలయం మినహా మరొకటి నాకు కనిపించలేదు. అందుకని వచ్చాను. అప్పటికి నాకు దేవుడుండే స్థలం ఆ మసీదు ఒక్కటే అన్న అభిప్రాయం ఉండేది. ఇప్పుడు దేవుడు మసీదులోనే కాదు, అన్ని చోట్లా ఉన్నాడని తెలుసుకున్నాను. ఆయన లేని చోటు ఏదీ లేదని తెలుసుకున్నాను. అందుకని ఇప్పుడు నాకు మసీదుకే వెళ్లాల్సిన పని లేదని తెలిసింది. ఇక్కడ దేవుడు లేడంటే ఫలానా చోట ఉన్నాడంటే ఆయన కోసం అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా ఉన్నాడని తెలిస్తే అక్కడికి వెళ్లాల్సిన పనేముంది?’ అన్నాడు.
అతని మాటలు జనానికి అర్థం కాలేదు. హసన్‌కు పిచ్చెక్కిందని అనుకున్నారు. సాధారణ ప్రజానీకానికి హసన్‌లో వచ్చిన విప్లవాత్మకమయిన పరిణామం అర్థం కాదు.

- సౌభాగ్య, 9848157909