Others

పశువధ వల్ల ఎంత నష్టం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో గోవు లేదా గోజాతికి చెందిన పశువుల వధ అడ్డూఅదుపూ లేకుండా సాగుతోంది. వీటి మాంసాన్ని విదేశాలకు భారీగా ఎగుమతి చేస్తున్నారు. ఇది మన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావానే్న చూపిస్తోంది. పశువధ వల్ల పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతోంది. ఎద్దు మాంసం తినే వారి సంఖ్య పెరగడంతో కలిగే దుష్ప్రరిణామాలలో పచ్చని భూములు ఎడారులుగా మారిపోవడం కూడా ఒకటి. ఇది నమ్మశక్యం కానిదిగా అనిపించవచ్చు. అమెజాన్, బ్రెజిల్, దక్షిణ అమెరికా ప్రాంతాలను గమనిస్తే అక్కడ ఎద్దు మాంసాన్ని ఎగుమతి చేస్తూ అధిక మొత్తంలో డబ్బు సంపాదించడంపై వ్యామోహం పెరిగింది. ఫలితంగా ఆ దేశాలలో దట్టమైన అడవులన్నీ ఎడారులుగా మారిపోవడం ఒక వాస్తవంగా మనం చూడవచ్చు.
1970-80లలో బ్రెజిల్, దక్షిణ అమెరికాలోని కోస్టారికా, అర్జెంటినా, హోండ్యురస్ వంటి దేశాలు ఆవులు తదితర పశువులు బలిష్టంగా పెరగడానికి కావలసిన గడ్డిని పెంచడానికి లక్షలాది ఎకరాలలో అడవులను నిర్మూలించారు. పుష్కలంగా మేత మేసి బాగా బలిసిన పశువుల మాంసాన్ని ఉత్తర అమెరికాకి ఎగుమతి చేసి దండిగా లాభాలు గడించవచ్చని వారి ఆలోచన. బలిసిన పశువులను చంపడానికి వధశాలలు, వాటి మాంసాన్ని నిల్వ ఉంచడానికి, ఇతర అవసరాలకి కావలసిన భారీ నిర్మాణాల కోసం పెద్దఎత్తున అడవులను నిర్మూలించారు. ఇలా చేసిన మొదటి మూడు, నాలుగు సంవత్సరాలలో వారికి రాబడి బాగానే వచ్చింది. కానీ తరువాతి సంవత్సరాలలో పరిస్థితి మొత్తం ప్రకృతి చేతుల్లోకి వెళ్ళిపోయింది. విస్తారమైన అడవులను నరికివేయడం వల్ల వర్షాలు కురవడం బాగా తగ్గిపోయింది. భారీగా వర్షాలు కురిసినా అడ్డూఅదుపూ లేని వరదల వల్ల మిగిలిన కొద్ది శాతం అడవులు కూడా నాశనమయ్యాయి. వర్షాభావం వల్ల పశువుల దాణా దిగుబడి తగ్గిపోవడమో లేదా వరదల వల్ల దాణా నీట మునిగిపోవడమో జరిగి అక్కడి రైతులకు, పశుపోషకులకు విపరీతమైన నష్టాలు వాటిల్లాయి. ఒక దేశ ఆర్థిక వ్యవస్థపై పశువుల దాణా పెంపకం కూడా పరోక్షమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. దీనిని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు.
పశువులకు గడ్డి పెంచడం కోసం, వధశాలలు నిర్మించడానికి పెద్దమొత్తంలో భూములు ఏ కొద్దిమంది అధీనంలోకో వెళ్ళిపోవడంతో ఎంతోమంది సామాన్యులు సొంత ఆస్తులను కోల్పోవలసి వచ్చింది. బతుకు తెరువుకోసం లక్షలాది మంది నగరాలపై పడవలసి వచ్చింది. దీనివల్ల సామాజిక జీవనంలోని సమతుల్యం దెబ్బతింది.
బ్రెజిల్ గురించి ఐక్యరాజ్యసమితి అందించిన నివేదిక వివరాలు ఇలా ఉన్నాయి. వైశాల్యంలో భారత్ కన్నా పెద్దదైన బ్రెజిల్‌లో పర్యావరణానికి సంబంధించి తీసిన శాటిలైట్ ఫొటోలు దిగ్భ్రాంతి కలిగించే విషయాలు బయటపెట్టాయి. బ్రెజిల్‌లో విస్తారమైన అటవీ భూములు నిస్సారంగా మారుతున్నాయి. వరదల తాకిడి, గాలిలో తేమ శాతం తగ్గిపోవడం వంటి విపరిణామాలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను బాగా దెబ్బతీస్తున్నాయి. దీనికి కారణం పశుమాంస పరిశ్రమల వల్ల ఆ దేశంలో పశువుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడమే. ఐక్యరాజ్యసమితి చేసిన హెచ్చరికలను అనుసరించి దక్షిణ అమెరికా ప్రభుత్వం అక్కడ ధన సంపాదన కోసం కొందరు ఏర్పాటు చేసిన పశు వధశాలలను మూసి వేయించింది.

- డి.రాజకిశోర్